Gold Prices Today, భారీగా పెరిగిన బంగారం, వెండి ధర: కొనుగోలు చేయవచ్చా?
ధన్‌తెరాస్ బంగారం కొనుగోలుకు శుభప్రదమైన రోజుగా భావిస్తారు. గడిచిన రెండేళ్లుగా బంగారం కొనుగోళ్లతో పాటు బంగారంపై పెట్టుబడులు కూడా పెరుగుతున్నాయి. 2018 దీపావళి నుండి 2019 దీపావళి మధ్య పసిడి 20 శాతం రిటర్న్స్ ఇచ్చింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది దీపావళికి 31 శాతానికి పైగా రిటర్న్స్ ఇచ్చింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో పసిడి ధరలు మార్చి నుండి వేగంగా పెరిగాయి. పసిడి ధరలు 10 గ్రాములు 50 వేల పైన ఉంది. బంగారం ధరలు ఒకటి రెండు నెలలుగా దాదాపు స్థిరంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొనుగోలు చేయవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

నేడు భారీగా పెరిగిన బంగారం ధరలు
నేడు బంగారం ధరలు భారీగా పెరిగాయి. సాయంత్రం గం.9.00 సమయానికి దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో 10 గ్రాముల పసిడి రూ.572.00 (1.14%) పెరిగి రూ.50,741.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.50,315.00 ప్రారంభమై, రూ.50,790.00 గరిష్టాన్ని తాకి, రూ.50,217.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
ఫిబ్రవరి ఫ్యూచర్స్ 10 గ్రాములు రూ.597.00 (1.19%) పెరిగి రూ.50,834.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.50,455.00 ప్రారంభమైన ధర, రూ.50,840.00 వద్ద గరిష్టాన్ని, రూ.50,322.00 కనిష్టాన్ని తాకింది.

వెండిదీ అదే దారి
వెండి కూడా పసిడి దారిలోనే పెరిగింది. ఎంసీఎక్స్‌లో కిలో వెండి (డిసెంబర్) రూ.420.00 (0.67%) పెరిగి రూ.62,961.00 పలికింది. రూ.62,767.00 ప్రారంభమై, రూ.63,095.00 గరిష్టాన్ని, రూ.62,145.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
మార్చి ఫ్యూచర్స్ కిలో రూ.466.00 (0.73%) పెరిగి రూ.64,698.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.64,270.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.64,818.00 గరిష్టాన్ని, రూ.63,893.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లో అప్
అంతర్జాతీయ మార్కెట్లోను పసిడి ధరలు పెరిగాయి. అయితే ఇప్పటికీ 1900 డాలర్లకు దిగువన చాలా దూరంలో ఉన్నాయి. 0.84 శాతం ఎగిసి ఔన్స్ డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ 1,877.30 డాలర్లు పలికింది. 1,860.75 - 1,882.85 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. క్రితం సెషన్‌లో 1,861.60 వద్ద క్లోజ్ అయింది. ఈ ఏడాది 25.63 శాతం పెరిగింది.
సిల్వర్ ఫ్యూచర్స్ 0.62 శాతం పెరిగి 24.418 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. 24.090 - 24.475 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. క్రితం సెషన్‌లో 24.267 డాలర్ల వద్ద ముగిసింది. ఈ ఏడాది 43 శాతం పెరిగింది.


Click it and Unblock the Notifications