sip for long term:పెద్ద మొత్తంలో ఆదాయం పొందేందుకు భారీగా ఇన్వెస్ట్ చేయాల్సిన పని లేదు. కొద్ది మొత్తాలతో నిలకడగా పెట్టుబడి పెడుతూ ఉంటే చాలు. కొద్ది కాలంలోనే లక్షల్లో జమ చేయొచ్చు. కేవలం రూ.200తో రూ. 20 లక్షల నిధిని సమకూర్చుకోవచ్చంటే నమ్ముతారా? కానీ, ఇది నిజం. దీనికై ఎలా ప్లాన్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

ఆర్థిక క్రమశిక్షణ ఉంటే చిన్న మొత్తాల్లో చేసే పెట్టుబడులతో కూడా పెద్ద పెద్ద లక్ష్యాలను చేరుకోవచ్చు. దీనికి సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) ఒక మంచి టూల్ అని చెప్పొచ్చు. SIP విధానం ద్వారా తక్కువ మొత్తంతో ఎక్కువ లాభాలను సాధించొచ్చు. మ్యూచువల్ ఫండ్ SIP లు మార్కెట్ రిస్క్‌కు లోబడి ఉన్నప్పటికీ ఇవి ఇతర సాధనాల కంటే కాస్త ఎక్కువ రాబడిని అందించే అవకాశం ఉంటుంది. మ్యూచువల్ ఫండ్‌లలో SIP ద్వారా రోజూ కొంత మొత్తాన్ని పొదుపు చేయడం ద్వారా లాంగ్ టర్మ్ లో పెద్ద ఫండ్ ను సమకూర్చుకోవచ్చు. ఉదాహరణకు రోజుకు కేవలం రూ. 200 మాత్రమే పొదుపు చేసినా లాంగ్ టర్మ్ లో అది లక్షల రూపాయల నిధిగా మారుతుంది.
రూ. 20 లక్షల ప్లానింగ్ ఇలా..
రోజుకి రూ.200 పెడితే.. నెలకు రూ. 6000 అవుతుంది. ఈక్విటీ ఫండ్స్ లో సగటు రిటర్న్స్ రేటు సంవత్సరానికి 10 నుంచి12 శాతం ఉంటుంది. ఒకవేళ ఏడాదికి 12 శాతం రిటర్న్స్ గనుక వచ్చినట్టయితే 12 సంవత్సరాల్లో మీ ఫండ్ వాల్యూ రూ.20 లక్షలకు చేరుకుంటుంది. ఇక్కడ మీరుపెట్టుబడి పెట్టిన మొత్తం రూ. 8,90,600 అయితే రిటర్న్స్ ద్వారా అదనంగా రూ. 11,31,000 వరకూ సమకూరుతుంది. ఇలా మొత్తం విలువ రూ.20 లక్షలు అవుతుంది. సింపుల్ గా చెప్పాలంటే రోజుకు రూ. 200 లేదా నెలకు సుమారు రూ.6,000 చొప్పున క్రమం తప్పకుండా పెట్టుబడి పెడితే 12 శాతం రిటర్న్స్ చొప్పున 12 ఏళ్లలో రూ.20 లక్షలకు పైగా పెద్ద నిధి సమకూరుతుంది.
స్టెప్-అప్ తో మరింత వేగంగా..
మీరు ఇంకా ఎక్కువ మొత్తాన్ని ఆశిస్తున్నట్టయితే.. ఆదాయం పెరిగే కొద్దీ పెట్టుబడి మొత్తాన్ని కూడా పెంచాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఈ పద్ధతిని 'స్టెప్-అప్ (Step-up SIP) అంటారు.
అంటే మీరు కట్టే సిప్ ను ప్రతి సంవత్సరం 10 శాతం చొప్పున పెంచుకుంటూ పోవాలి. అంటే మొదటి ఏడాది నెలకు రూ.6000, రెండో ఏడాది నెలకు రూ. 6600 ఇలా పెంచుకుంటూ పోతే మరింత త్వరగా మీరు లక్ష్యాన్ని చేరుకోవచ్చు.
ఇది ముఖ్యం
మ్యూచువల్ ఫండ్స్ అనేవి మార్కట్ రిస్క్ కు లోబడి ఉంటాయి. కాబట్టి పెట్టుబడి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎల్లప్పుడూ ఆర్థిక నిపుణుడిని సంప్రదించడం మంచిది. అలాగే ఫండ్స్ కు సంబంధించిన డాక్యుమెంట్స్ ను పూర్తిగా చదివి అర్థం చేసుకున్నాకే నిర్ణయానికి రావాలి.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..



Click it and Unblock the Notifications