పండుగలు, శుభకార్యాలు అంటే బంగారం తప్పనిసరి. ప్రత్యేక సందర్భాల్లో బంగారం కొనడం ఇప్పుడు ఒక సంప్రదాయంగా మారింది.. ఒక్కపుడు బంగారాన్ని తీసుకోవాలంటే చేతిలో డబ్బులు ఉంటేనే కొనేవాళ్ళు. ఇప్పుడు టెక్నాలజీ కారణంగా, చాలామంది చేతిలో డబ్బు లేకున్నా బంగారాన్ని క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేయడం ప్రారంభించారు. కానీ కార్డు స్వైప్ చేయడం అంత ఈజీ కాదు - దాని వెనుక చాలా మినహాయింపులు, ఛార్జీలు, మరియు రిస్కులు ఉంటాయి. అయితే స్వైప్ చేసే ముందు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు కొన్ని ఉన్నాయి. అవి ఏంటో మనం తెలుసుకుందాం.
- ప్రతి బ్యాంక్‌కు బంగారంపై EMI, క్యాష్‌బ్యాక్, రివార్డ్స్‌కు సంబంధించి విధులు వేరుగా ఉంటాయి. ముందు మీ క్రెడిట్ కార్డ్ ఇష్యూ అయిన బ్యాంక్ బంగారంపై ఎలాంటి షరతులు పెట్టారో తెలుసుకోండి.

- చాలా జ్యూవెలరీ షాపులు బంగారాన్ని క్రెడిట్ కార్డు మీద కొనుగోలు చేస్తే 2%-3.5% వరకు ప్రాసెసింగ్/స్వైప్ అదనపు ఫీజును వసూలు చేస్తారు.
- బంగారు ఆభరణాలు (Jewellery), బంగారు నాణేలు (Gold coins) కొనుగోళ్లపై చాలా బ్యాంకులు EMI మార్పిడిను అనుమతించవు. జ్యూవెలరీపై కూడా కొన్ని బ్యాంకులు EMI ని ఆపేసి ఉండవచ్చు.
- బిల్లు మొత్తాన్ని టైమ్‌కి చెల్లించకపోతే, 36%-42% వరకు వార్షిక వడ్డీ వసూలవుతుంది. ఇది భారం అయ్యే అవకాశముంది.
- క్రెడిట్ కార్డ్ బిల్లు మొత్తాన్ని మినిమం డ్యూస్ కూడా టైమ్‌కు చెల్లించకపోతే లేట్ ఫీజులు, GST, ఇతర ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది.
- కొన్ని కార్డులు బంగారం కొనుగోలుపై క్యాష్‌బ్యాక్ లేదా పాయింట్లు ఇస్తున్నా, అవి బ్రాండ్ స్పెసిఫిక్ అయి ఉండవచ్చు. అలాగే క్వార్టర్ లిమిట్స్ ఉండవచ్చు. కొన్ని కార్డులు ప్రత్యేక జ్యూవెలరీ బ్రాండ్లపై 5% cashback లేదా 3% రివార్డ్స్ ఇస్తున్నాయి. ఉదాహరణ: టైటాన్ SBI కార్డ్- తనిష్క్(Tanishq) పై 3% వాపసు, HDFC Regalia Gold Card, SC Ultimate Cardలు reward పాయింట్లు ఇస్తున్నాయి.
- అవసరానికి తగినన్ని డబ్బులు ఉన్నా కూడా పాయింట్లు కోసమో, cashback కోసమో క్రెడిట్ వాడకండి. క్రెడిట్ కార్డ్ చెల్లింపు పైన డిసిప్లిన్ లేకపోతే అదనపు వడ్డీ ఊబిలోకి తీసుకెళ్తుంది.
RuPay కార్డ్‌ను UPIతో లింక్ చేయడం ఎలా? స్టెప్ బై స్టెప్ గైడ్
- పూర్తి బిల్లును టైమ్‌కి కట్టగలిగితేనే క్రెడిట్ కార్డు వాడండి. డ్యూస్ పెండింగ్‌లో వుంటే అది వడ్డీ భారంగా మారుతుంది. ఆర్థికంగా తెలివిగా ఉండండి.
బంగారం కొంటే ముందు మీ అవసరం, బడ్జెట్, క్రెడిట్ కార్డు షరతులు, వడ్డీ శాతాలు అన్నింటినీ పరిశీలించండి. బంగారం లాంటి విలువైన వస్తువు కొన్నప్పుడు ఒక్కసారి ఆఫర్లకు పోకుండా, అన్ని ఖర్చులు, లాభ నష్టాలను చూసుకుని నిర్ణయం తీసుకోండి. అప్పుడే బంగారంతో పాటు మీ ఆర్థిక స్థితి కూడా మెరుగుపడుతుంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications