ఇప్పటి డిజిటల్ యుగంలో అన్ని లావాదేవీలు వేగంగా, సురక్షితంగా జరిగేలా చేయడంలో UPI (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పటికే ఎక్కువ మంది బాంక్ ఖాతాలు UPIకి లింక్ చేసుకుని సౌకర్యంగా పేమెంట్స్ చేస్తున్నారు. అయితే, తాజాగా RuPay డెబిట్ కార్డ్‌లను కూడా UPIకి లింక్ చేసే అవకాశం అందుబాటులోకి వచ్చింది. దీని వల్ల పేమెంట్స్ మరింత ఈజీ, సురక్షితంగా మారాయి.
ఈ ప్రక్రియ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు తెలుసుకుందాం.
1. మీ మొబైల్ ఫోన్‌లో ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం లేదా భీమ్ UPI యాప్‌ను ఓపెన్ చేయండి. ఇవి అన్ని UPI ఆధారిత డిజిటల్ పేమెంట్ యాప్‌లు. మీ దగ్గర ఆ యాప్ లేకపోతే మీ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

2. UPI యాప్ ఓపెన్ చేసి అందులో "Add Bank Account" లేదా "Add New Account" అనే ఎంపికపై ట్యాప్ చేయండి. ఇది మీ బ్యాంక్ ఖాతాను యాప్‌తో అనుసంధానించేందుకు ఇది అవసరం.
3. RuPay కార్డ్‌ను జారీ చేసిన బ్యాంక్ పేరు (ఉదా: SBI, HDFC, PNB, Union Bank) సెలెక్ట్ చేయాలి. UPI యాప్ ఆధారంగా మీ ఖాతా వివరాలను గుర్తించేందుకు ప్రయత్నిస్తుంది.
4. ఆ తర్వాత మీ బ్యాంక్‌లో రిజిస్టర్ చేసిన మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. అది యాప్‌లో నమోదు చేసి వెరిఫై చేసుకోవాలి.
5. ఆ వెరీఫికేషన్ తో మీ బ్యాంక్ అకౌంట్ అనుసంధానమైన తరువాత, యాప్ మీకు కార్డ్ వివరాలను అడుగుతుంది. అక్కడ మీరు RuPay డెబిట్ కార్డ్ ను ఎంచుకోండి. ఇది UPIలో ఉపయోగించేందుకు అనుమతించబడిన డెబిట్ కార్డ్ మాత్రమే అయి ఉండాలి.
6. మీ RuPay కార్డ్‌లోని చివరి 6 అంకెల నంబర్ మరియు చెల్లుబాటు తేదీ (expiry date) ఎంటర్ చేయాలి. ఇది కార్డ్ నిజమైనదా అన్నదాన్ని వెరిఫై చేయడానికి ఉపయోగపడుతుంది.
7. వెరిఫికేషన్ పూర్తయ్యాక, మీ మొబైల్ నంబర్‌కి OTP వస్తుంది. దానితో పాటు, మీరు కొత్తగా UPI PIN (4 లేదా 6 అంకెల నెంబర్) సృష్టించాలి. ఇది మీ భవిష్యత్తు లావాదేవీలలో పాస్‌వర్డ్ లాగా పనిచేస్తుంది.
8. ఇప్పుడు మీరు విజయవంతంగా మీ RuPay కార్డ్‌ను UPIతో లింక్ చేశారు. ఇంక మీరు QR కోడ్ స్కాన్ చేసి, ఫోన్ నెంబర్ ద్వారా లేదా యాప్‌లో నేరుగా పేమెంట్స్ చేయవచ్చు.
ఈ విధంగా మీరు మీ RuPay కార్డ్‌ను UPIతో సులభంగా లింక్ చేయవచ్చు. ఒకసారి లింక్ అయిన తర్వాత, మీరు షాపింగ్, బిల్లులు చెల్లించడం, డబ్బులు పంపడం వంటి లావాదేవీలను PIN ద్వారా తక్కువ సమయంలో పూర్తి చేయవచ్చు. ఇది డిజిటల్ భారత్ దిశగా ముందడుగు. అంతేకాకుండా, క్యాష్ తిప్పలు లేకుండా అన్ని పేమెంట్స్‌ని సురక్షితంగా చేయడం మీ చేతుల్లో ఉంటుంది.


Click it and Unblock the Notifications