Gold Rate Today: బంగారం కొనుగోలు చేయొచ్చా? 2021 ప్రారంభంలో ఎలా ఉండొచ్చు
ఈ ఏడాది (2020)లో బంగారంపై ఇన్వెస్ట్ చేసినవారు భారీ రిటర్న్స్ పొందారు. రూ.40వేల లోపు ఉన్న బంగారం ధరలు ఆ తర్వాత కరోనా మహమ్మారి కారణంగా రూ.56,000 మార్కును కూడా దాటాయి. హైదరాబాద్ వంటి నగరాలలో ఏకంగా రూ.59,000 స్థాయికి వచ్చింది. ఏడాది ప్రారంభంలో పసిడిపై పెట్టుబడులు పెట్టిన వారికి దాదాపు 30 శాతం నుండి 50 శాతం వరకు రిటర్న్స్ వచ్చి ఉంటాయి. కరోనా వ్యాక్సినైజేషన్ ప్రారంభమవుతుండటంతో పసిడిపై కాస్త ఒత్తిడి తగ్గినప్పటికీ, దీర్ఘకాలంలో మంచి పెట్టుబడిగా బులియన్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.

కొత్త ఏడాది ప్రారంభంలో కాస్త తగ్గొచ్చు.. కానీ
కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆంగ్ల కొత్త సంవత్సరం 2021 ప్రారంభంలో ఇప్పటి కంటే పసిడి కాస్త క్షీణించే అవకాశాలు కొట్టిపారేయలేమని నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశీయ, అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లో కాస్త పైకి, కిందకు కదిలినప్పటికీ మొత్తానికి ఇప్పటి కంటే కొంత తగ్గుదలను నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే వ్యాక్సినేషన్ ఫలితాన్ని బట్టి ఆ తర్వాత పసిడి ధరల్లో మార్పులు ఉంటాయని అంటున్నారు.

బంగారం స్వల్పంగా డౌన్
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో నిన్న 10 గ్రాముల ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.-85.00 (-0.17%) క్షీణించి రూ.50064.00 వద్ద ముగిసింది. రూ.50,151.00 వద్ద ప్రారంభమై, రూ.50,186.00 వద్ద గరిష్టాన్ని, రూ.49,878.00 కనిష్టాన్ని తాకింది.
ఏప్రిల్ ఫ్యూచర్స్ రూ.50.00 (0.10%) పెరిగి రూ.50198.00 వద్ద క్లోజ్ అయింది. రూ.50,150.00 వద్ద ప్రారంభమై, రూ.50,279.00 వద్ద గరిష్టాన్ని, రూ.49,936.00 కనిష్టాన్ని తాకింది.
వెండి మార్చ్ ఫ్యూచర్స్ రూ.58.00 (-0.09%) స్వల్పంగాతగ్గి రూ.67518.00 వద్ద క్లోజ్ అయింది. రూ.67,701.00 వద్ద ప్రారంభమై, రూ.67,900.00 వద్ద గరిష్టాన్ని, రూ.66,682.00 కనిష్టాన్ని తాకింది.

అక్కడ జంప్
అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ 4.80 (+0.26%) డాలర్లు పెరిగి 1,882.90 డాలర్ల వద్ద క్లోజ్ అయింది. ఏడాదిలో 25.19% పెరిగింది. సిల్వర్ ఫ్యూచర్స్ 0.021 (+0.08%) డాలర్లు పెరిగి 25.942 డాలర్ల వద్ద క్లోజ్ అయింది. ఏడాదిలో సిల్వర్ ఫ్యూచర్స్ 45.48% పెరిగింది.


Click it and Unblock the Notifications