భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(BSNL) కొత్త పోస్ట్ పెయిడ్ ప్లాన్స్‌తో ముందుకు వస్తోంది. ప్రయివేటు టెలికం ఆపరేటర్లకు ధీటుగా కొత్త ఆఫర్లు తీసుకు రానుంది. రూ.798, రూ.999 పోస్ట్ పెయిడ్ ప్లాన్స్‌తో డేటా ప్యాక్, టాక్ టైమ్ సహా ఎన్నో ప్రయోజనాలు ఉండనున్నాయి. ఇప్పటికే ఉన్న రూ.199 పోస్ట్ పెయిడ్ ప్లాన్‌ను కూడా రివైజ్ చేసి డేటా రోలోవర్ వంటి అదనపు ప్రయోజనాలు అందించనుందని తెలుస్తోంది. అంతేకాదు, రూ.99, రూ.225, రూ.325, రూ.799, రూ.1,125 ప్లాన్స్‌ను తొలగించనుంది. ఈ కొత్త ప్లాన్స్ వచ్చాక పాతవాటిని తొలగించనుంది. ఈ కొత్త పోస్ట్ పెయిడ్ ప్లాన్స్‌ను డిసెంబర్ 1వ తేదీ నుండి అమలు చేయనుందని తెలుస్తోంది.

బీఎస్ఎన్ఎల్ సరికొత్త ప్లాన్
రూ.199, రూ.798, రూ.999 ప్లాన్స్‌తో అపరిమిత కాలింగ్, డేటా, డేటా రోలోవర్, ఫ్యామిలీ యాడ్-ఆన్ ప్యాక్ వంటి ప్రయోజనాలు ఉండనున్నాయి. ఈ పోస్ట్ పెయిడ్ ప్లాన్స్‌తో పాటు బీఎస్ఎన్ఎల్ రెండు యాడ్ ఆన్ ప్లాన్స్‌ను రూ.150, రూ.250 తీసుకు రానుంది. ఇవి వరుసగా 40GB డేటా, 70GB డేటాను ఆఫర్ చేయనుంది.

రూ.798 ప్లాన్
రూ.798 ప్లాన్‌ను అన్ని సర్కిల్స్‌లో డిసెంబర్ 1వ తేదీ నుండి తీసుకురానుంది. ఈ పోస్ట్ పెయిడ్ ప్లాన్‌లో 50GB నెల డేటాతో పాటు రోలోవర్ సౌకర్యం 150GB వరకు ఉంటుంది. ఈ ప్లాన్ ద్వారా రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు, రెండు ఫ్యామిలీ-యాడ్ ఆన్ కనెక్షన్స్ ప్రయోజనాలు ఉన్నాయి. ప్రధాన కనెక్షన్‌తో పాటు యాడ్ ఆన్ కనెక్షన్‌కు కూడా అదే తరహా ప్రయోజనాలు ఉన్నాయి.
రూ.999 పోస్ట్ పెయిడ్ ప్లాన్ ద్వారా నెలకు 75GB డేటాతో పాటు 225GB డేటా రోలోవర్ సౌకర్యం ఉంది. లోకల్, ఎస్టీడీ నెట్ వర్క్‌కు అపరిమిత వాయిస్ కాల్స్ (FUP రోజుకు 250 నిమిషాలు) ప్రయోజనం ఉంది. రోజుకు వంద ఎస్సెమ్మెస్‌లు వస్తాయి. మూడు ఫ్యామిలీ యాడ్-ఆన్ కనెక్షన్స్.

రూ.199 పోస్ట్‌పెయిడ్ ప్లాన్
రూ.199 పోస్ట్ పెయిడ్ ప్లాన్‌ను రివైజ్ చేయనుంది. 25GB నెల డేటా, 75GB వరకు రోలోవర్ డేటా, రోజుకు 100 ఎస్సెమ్మెస్ ప్రయోజనం కల్పించనుంది. యాడ్ ఆన్ ఫ్యామిలీ సదుపాయం లేదు. అన్-లిమిటెడ్ నెట్ వాయిస్ కాలింగ్, 300 నిమిషాల ఆఫ్-నెట్ కాలింగ్ ఉంది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications