కరోనా మహమ్మారి, ఈక్విటీ మార్కెట్లు, అంతర్జాతీయ మార్కెట్, ఇంధన ధరల్లో అస్థిరత్వం బంగారంపై కూడా ప్రభావం చూపుతోంది. పసిడి రోజు రోజుకు భారీగా పెరుగుతూనే, అప్పుడప్పుడు స్వల్పంగా తగ్గుదల నమోదు చేస్తోంది. మొత్తానికి ధరలు మాత్రం రికార్డ్ స్థాయికి చేరుకుంటున్నాయి. కరోనా దెబ్బతో స్వల్పకాలంలోనే ఇటీవల రూ.50వేల మార్క్ దాటింది. ఫిబ్రవరి-మార్చి నెలల్లో రూ.39వేల నుండి రూ.40వేల మధ్య ఉన్న ఈ లోహం మూడు నెలల్లోనే దాదాపు రూ.10వేలు పెరిగింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రానున్న ఏడాది రెండేళ్లు కోలుకునే పరిస్థితి లేకపోవడంతో ఇన్వెస్టర్లు బంగారంవైపు చూస్తున్నారు.

పసిడి పెరిగే అవకాశముందా.. ఎప్పుడు?
బంగారం ధరలు సమీప భవిష్యత్తులో అంటే రెండేళ్లలో రూ.65 వేల నుండి రూ.68వేల మధ్యకు చేరుకోవచ్చునని భావిస్తున్నారు. మూడు నాలుగు నెలల్లో దాదాపు రూ.10వేలు పెరిగిన బంగారం పరిస్థితులు ఇలాగే ఉంటే ఆ మార్క్ చేరుకోవడం అంత కష్టమేమీ కాదని అంటున్నారు. బంగారం ఇటీవలి కాలంలో చాలా వేగంగా పెరిగిందని, పరిస్థితి ఇలాగే ఉంటే పెరుగుదల ఖాయమని, కానీ కరోనా ఉదృతి తగ్గినా, ఆర్థిక వ్యవస్థలు పుంజుకున్నా ఒత్తిడి తగ్గుతుందని చెబుతున్నారు. అప్పుడు ఇంత వేగంగా పెరగకపోవచ్చునని అంటున్నారు. పెరుగుదలపై డాలర్‌తో రూపాయి ప్రభావం కూడా ఉంటుందంటున్నారు.

బంగారంపై ఇన్వెస్ట్ చేస్తూ.. ఆచితూచి
నిన్నటి వరకు మూడు రోజుల పాటు బంగారం ధరలు తగ్గాయి. అయినప్పటికీ రూ.48,000కు పైనే ఉన్నాయి. అంటే తగ్గుదల పెద్దగా కనిపించడం లేదు. ఈక్విటీ, చమురు, ప్రపంచ ఆర్థిక పరిస్థితులపై ఇన్వెస్టర్లు గందరగోళంలో ఉన్నారు. దీంతో బంగారంపై పెట్టుబడులు పెడుతూనే ఈక్విటీ మార్కెట్లపై ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

ఏకైక మార్గం బంగారం
ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తారు. స్వల్పకాలంలో ఎలా ఉన్నా దీర్ఘకాలంలో మాత్రం ఇది మంచి రిటర్న్స్ ఇస్తుంది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లకు ఉన్న ఏకైక మార్గం బంగారం. ఇతర విలువైన లోహాలు కూడా ఉన్నప్పటికీ వాటికి డిమాండ్ తక్కువ. ఇన్వెస్టర్లను పక్కన పెడితే దేశీయంగా ఓ వైపు కరోనా, మరోవైపు ప్రజల చేతుల్లో డబ్బు తగ్గింది, ఇంకోవైపు సీజన్ కాదు. దీంతో బంగారం దుకాణాలు మాత్రం వెలవెలపోతున్నాయి. సాధారణంగా ప్రస్తుత సీజన్‌లో బంగారం ధరలు తగ్గాలి కానీ అందుకు భిన్నంగా పెరుగుతోందని అంటున్నారు.

పెరుగుదల 25 శాతం
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఆరు నెలల్లో 24 శాతానికి పైగా పెరిగాయి. ఏడాదిలో 35 శాతానికి పైగా పెరిగాయి. రూ.40వేలకు పైకి చేరుకున్నప్పటికీ ఓ సమయంలో నెల రోజుల క్రితం రూ.40వేల వద్ద ఉంది బంగారం. కానీ అప్పుడే రూ.50వేలకు చేరుకుంది. కొద్ది నెలల్లోనే ఏకంగా 25 శాతం పెరిగింది.

ఎవరు ఎప్పుడు కొనాలి?
ఈ సమయంలో బంగారం కొనుగోలు చేయవచ్చా అంటే దీర్ఘకాలం పెట్టుబడిదారులు కొనుగోలు చేయవచ్చునని చెబుతున్నారు. ఇతరులు కాస్త వేచి చూసే ధోరణితో ఉంటే మంచిదంటున్నారు. వచ్చే ఏడాది లోపు దిద్దుబాటు ఉండవచ్చునని చెబుతున్నారు. స్వల్పకాలంలో మాత్రం మరింత పెరుగుతుందని, కాబట్టి అవసరం ఉన్నవారు మాత్రం కొనుగోలు చేయవచ్చునని సూచిస్తున్నారు. నాలుగైదేళ్లకోసారి బంగారం ధరలో పతనం ఉంటుందని చెబుతున్నారు.
More From GoodReturns

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Gold: రాబోయే 2 ఏళ్లలో బంగారంపై భారీ లాభాలు.. ఇన్వెస్టర్లు అప్రమత్తం!

బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

Today Gold Silver Rate Live: తగ్గిన వెండి ధర.. పెరిగిన బంగారం ధర.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications