ఏ క్షణంలో ఏదైనా జరగవచ్చు. ఏమి జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఏదైనా అనుకోని సంఘటన వల్ల ఆస్తినష్టం లేదా మరేదైనా నష్టం జరిగితే దాని నుంచి ఎలాగైనా బయట పడవచ్చు. కానీ ప్రాణ హాని జరిగి మనిషి దూరమైతే ఈ నష్టాన్ని ఎవరు పూడ్చలేరు. ఈ రోజుల్లో రోడ్డు ప్రమాదాలు పెరిగి పోతున్నాయి. అనేక రకాల వ్యాధులతో యుక్త వయసులోనే ఎంతో మంది చనిపోతున్నారు. వీరిపై ఆధారపడిన వారు అనేక విధాలుగా ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఒకవేళ దురదృష్ట వశాత్తు తాము లేకపోయినా తమపై ఆధారపడిన వారు ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో చాలా మంది టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్లను తీసుకుంటున్నారు. ఈ పాలసీలను తీసుకున్న వారు ఒకవేళ మరణిస్తే బీమా పరిహారాన్ని నామినీకి అండ జేస్తారు. దీని వల్ల ఆ కుటుంబం ఆర్ధిక రక్షణను పొందుతుంది.

కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా
ఒక వస్తువు లేదా సేవ నుంచి ఒక్కో కస్టమర్ ఒక్కో రకమైన ప్రయోజనాన్ని కోరుకుంటారు. ఇలాంటి వాటిని దృష్టిలో ఉంచుకొని కంపెనీలు ఉత్పత్తులను తీసుకు వస్తుంటాయి. టర్మ్ ఇన్సూరెన్సు లోను వివిధ ప్రయోజనాలను కోరుకునే వారు ఉన్నారు. అందుకే బీమా కంపెనీలు విభిన్న బీమా పథకాలను అందుబాటులోకి తెచ్చాయి. సాధారణంగా బీమా తీసుకున్న కాలంలో పాలసీ దారు మరణిస్తే బీమా పరిహారాన్ని వారి కుటుంబానికి అందజేస్తారు. పాలసీ రెన్యూవల్ చేసుకోకపోతే బీమా రక్షణ ఉండదు.

విభిన్న రకాలు
బీమా కవరేజీ, ప్రయోజనాలను బట్టి విభిన్న రకాల టర్మ్ బీమా ప్లాను అందుబాటులోకి వచ్చాయి. అవి ఏమిటంటే..

లెవల్ టర్మ్ ప్లాన్స్
ఇది ప్రాథమికంగానే కాకుండా సులభతరమైన టర్మ్ ఇన్సూరెన్సు. పాలసీ కాలపరిమితిలో సమ్ అష్యురెన్సు స్థిరంగా ఉంటుంది. బీమా తీసుకున్న వారు మరణిస్తే తీసుకున్న పాలసీకింద లభించే ప్రయోజనాన్ని నామినీకి ఇస్తారు.

రిటర్న్ ఆన్ ప్రీమియం ప్లాన్స్
ఈ ప్లాన్లపై మెచ్యూరిటీ ప్రయోజనం లభిస్తోంది. అంటే పాలసీ కాలపరిమితి తర్వాత పాలసీదారుడు జీవించి ఉంటే అతను లేదా ఆమె చెల్లించిన ప్రీమియం మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు. ఇలాంటి ప్లాన్లు ఎక్కువ మంది ఎంచుకుంటున్నారు. అందుకే కంపనీలు కూడా వీటిని ఎక్కువగా అందుబాటులోకి తెస్తున్నాయి.

పెరిగే టర్మ్ ప్లాన్లు
ఈ ప్లాన్లలో పాలసీదారు వార్షిక ప్రాతిపదికన సమ్ అష్యురెన్సు ను పెంచుకునే అవకాశం ఉంటుంది. ప్రీమియం మొత్తం మారదు. అయితే ఈ ప్లాన్లపై ప్రీమియం కాస్త ఎక్కువ ఉంటుంది.

తగ్గే టర్మ్ ప్లాన్లు
ఈ ప్లాన్లలో సమ్ అష్యురెన్సు వార్షిక ప్రాతిపదికన తగ్గుతూ వస్తుంది. తగ్గుతున్న బీమా అవసరాలకు అనుగుణంగా ప్రతి సంవత్సరం తగ్గుతూ వస్తుంది. భారీగా గృహ లేదా వ్యక్తిగత రుణం తీసుకుని లేదా నెలవారీ వాయిదాలు చెల్లిస్తున్న తరుణంలో ఇలాంటి ప్లాన్లు అవసరమవుతాయి.

మార్పిడి చేసుకునే టర్మ్ ప్లాన్లు
ఈ ప్లాన్లలో పాలసీదారు కొంత కాలం తర్వాత ఇతర ప్లాన్లలోకి మారే అవకాశం ఉంటుంది. దీని ప్రకారం టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్ ను ఎండోమెంట్ ప్లాన్ గా మార్చుకోవచ్చు. ఇందులో ఎలాంటి ఇబ్బందులు ఉండవు.

రైడర్లతో...
ఇలాంటి ప్లాన్లలో ప్రమాదం వల్ల జరిగే మృతికి కవరేజి, తీవ్రమైన అనారోగ్యాలకు కవరేజీ పొందే సదుపాయం ఉంటుంది. వీటికోసం అదనంగా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications