టీడీఎస్ లో కోత పడిందేమో చూసుకోండి...

మూలం వద్ద పన్ను (టీడీఎస్) గురించి వినే ఉంటారు. ఆదాయ పన్ను చట్టం ప్రకారం కొంత మందికి కొన్నిరకాల చెల్లింపులు చేసే సమయంలో చెల్లింపులు చేసే సంస్థలు మూలం వద్ద పన్నును మినహాయించి మిగతా మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా వ్యక్తులు ఒక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయంపై నిబంధనల మేరకు పన్ను చెల్లించాలి. కానీ చాలా మంది పన్నులు ఎగవేస్తుంటారు. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయడానికి మూలం వద్ద పన్ను దోహదపడుతుంది. ఇలా మినహాయించిన మొత్తాన్ని సంభందిత వ్యక్తులు లేదా సంస్థలు ఆదాయ పన్ను శాఖ ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది. టీడీఎస్ మినహాయింపు జరిగిన సందర్భంలో ఆదాయ పన్ను శాఖకు రిటర్న్ ను సమర్పించడం ద్వారా ఆ మొత్తాన్ని వ్యక్తులు రిఫండ్ గా పొందవచ్చు. నగదు చెల్లింపు లేదా చెక్కు లేదా లభ్డిదారు ఖాతాలో నగదు జమ చేసే సందర్భంలో టీడీఎస్ వర్తిస్తుంది.

ఏయే సందర్భాల్లో టీడీఎస్ విధిస్తారంటే..

ఏయే సందర్భాల్లో టీడీఎస్ విధిస్తారంటే..

* వేతనాలు, బ్యాంకులు చెల్లించే వడ్డీ, కమీషన్ చెల్లింపు, అద్దె చెల్లింపు, కన్సల్టెంట్లకు చెల్లింపులు, లాయర్లు లేదా ఫ్రీలాన్సర్లకు చెల్లింపులు చేసే సమయాల్లో టీడీఎస్ మినహాయింపు వర్తిస్తుంది.

* ఉద్యోగి వేతనం ఆదాయ పన్ను గరిష్ట పరిమితికి మించి ఉన్న సమయంలో కంపెనీలు తమ ఉద్యోగికి నెలవారీగా చెల్లించే జీతం నుంచి టీడీఎస్ ను మినహాయించుకుంటాయి.

* బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు, పోస్టాఫీసు సీనియర్ సిటిజెన్ డిపాజిట్లపై ఒక ఆర్ధిక సంవత్సరంలో వచ్చే వడ్డీ పై టీడీఎస్ విధిస్తారు. ఇంతకు ముందు వార్షిక వడ్డీ రూ. 10,000 ఉండేది. దీన్ని 2019 బడ్జెట్లో రూ.40,000 కు పెంచారు. సీనియర్ సిటిజన్లకు ఇది రూ.,50,000 చేశారు. ఈ పరిమితి దాటితే 10 శాతం టీడీఎస్ విధిస్తారు. పాన్ నెంబర్ లేకపోతే 20 శాతం కూడా టీడీఎస్ ను వర్తింపజేసే అవకాశం ఉండవచ్చు.

* లాటరీలు, క్రాస్ వర్డ్ పజిల్స్, కార్డు గేమ్స్, గుర్రపు పందేలపై పొందే ఆదాయంపై 30 శాతం టీడీఎస్ విధిస్తారు.

* మ్యూచువల్ ఫండ్ లేదా యూనిట్ ట్రస్ట్ అఫ్ ఇండియా యూనిట్ల తిరిగి కొనుగోళ్ల సందర్భంలో చేసే చెల్లింపులపై 20 శాతం టీడీఎస్ ఉంటుంది.

ఇలా చేయండి..

ఇలా చేయండి..

* మారిన గరిష్ట ఆదాయ పన్ను పరిమితికి లోబడి ఆదాయం ఉన్న పన్ను చెల్లింపుదారులు ఒకవేళ టీడీఎస్ చెల్లింపులు జరిగిన సందర్భంలో తమ రిఫండ్స్ ను పొందడానికి అవకాశం ఉంటుంది. రిఫండ్ కు అర్హత ఉంటే వారి ఖాతాలో ఆ సొమ్మును జమచేస్తారు.

* మీ కంపెనీకి మీ పెట్టుబడులు, పొదుపునకు సంభందించిన ప్రూఫ్ లను సమర్పించి టీడీఎస్ మినహాయింపు జరగకుండా చూసుకోవచ్చు. ఆదాయ పన్ను మినహాయింపు పరిమితి దాటితే టీడీఎస్ వర్తిస్తుంది.

* మీ మొత్తం ఆదాయం పన్ను పరిమితికన్నా తక్కువగా ఉంటే బ్యాంకుకు ఫారం 15జీ, ఫారం 15 హెచ్ సమర్పించడం ద్వారా టీడీఎస్ వసూలు చేయకుండా చూసుకోవచ్చు.

ఎంత టీడీఎస్ చెల్లించారో తెలుసుకోండి..

ఎంత టీడీఎస్ చెల్లించారో తెలుసుకోండి..

* టీడీఎస్ అనేది పాన్ నెంబర్ తో లింక్ అయి ఉంటుంది.

* మీ ఆదాయం నుంచి టీడీఎస్ ఎంత చెల్లించారో తెలుసుకోవడానికి ఆదాయ పన్ను వెబ్ సైట్ నుంచి ఫారం 26 ఏఎస్ ద్వారా తెలుసుకోవచ్చు.

* ఈ ఫారంలో మీ ఆదాయం పై టీడీఎస్ తగ్గింపునకు సంబంధించిన అన్ని వివరాలు ఉంటాయి. అందుకే ఎక్కడైనా మీ పాన్ నెంబరును సరిగ్గా నమోదు చేయాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+