For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వెంటనే ఇందులో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించండి.. లాభాలెన్నో

|

ELSS (ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీం).. ఇది పన్ను ఆదా ప్రయోజన పథకం. మంచి రాబడిని ఇచ్చే పథకాన్ని ఎంపిక చేసుకోవడం ఎంతో ముఖ్యం. ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి పన్ను ELSS స్కీముల్లో పెట్టుబడి పెట్టడం మంచి నిర్ణయంగా చెప్పవచ్చు. ఏప్రిల్ నుంచి ప్రారంభించి మార్చి వరకు క్రమంగా ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఏడాది చివర్లో ఇన్‌కం ట్యాక్స్ రిటర్స్ విషయంలో ఆందోళన తగ్గే అవకాశాలు ఉంటాయి. ELSSలో మంచి ఫండ్స్‌ను ఎంచుకోవాలి.

కొత్త రేషన్ కార్డుకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి?కొత్త రేషన్ కార్డుకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

లాభాలు ఏమిటి?

లాభాలు ఏమిటి?

ELSS లాకిన్ పీరియడ్ మూడేళ్లు ఉంటుంది. కనీసం రూ.500 నుంచి ఇన్వెస్ట్ చేయవచ్చు. మంత్లీ ఇన్వెస్ట్ ఆప్షన్ ఉంటుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్ తదితర వాటి కంటే ఎక్కువ ఇంటరెస్ట్ రేటు వస్తుంది. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద అర్హత కలిగిన పథకాల్లో ELSS కూడా ఒకటి. ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల మొత్తం పెట్టుబడులపై పన్ను మినహాయింపు ఉంటుంది. మార్కెట్ క్యాప్‌తో సంబంధం లేకుండా మంచి రాబడులకు అవకాశమున్న కంపెనీలను ఎంచుకొని ఇన్వెస్ట్ చేసే సౌలభ్యం ఈ ఫండ్స్ మేనేజర్లకు ఉంటుంది. డివిడెంట్ ఆప్షన్ ఎంచుకుంటే వచ్చే ఆదాయంపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. మూడేళ్ల లాకిన్ పీరియడ్ తర్వాత పెట్టుబడులను వెనక్కి తీసుకునే సమయంలో వచ్చే లాభంలో రూ.1లక్ష వరకు పన్ను ఉండదు. అంతకుమించినా కేవలం 10 శాతం పన్ను ఉంటుంది. ప్రతి నెల రూ.12,500 మొత్తాన్ని సిప్‌లో ఇన్వెస్ట్ చేస్తే సంవత్సరంలో రూ.1.5 లక్షలు అవుతుంది.

ఎన్నో ఈల్ఎస్ఎస్ స్కీంలు

ఎన్నో ఈల్ఎస్ఎస్ స్కీంలు

ఆదాయపన్ను ఆదా కోసం మాత్రం ఉత్తమమైన పెట్టుబడుల్లో ELSS ముఖ్యమైనది. ELSS స్కీంలో పెట్టుబడి తర్వాత లాకిన్ పీరియడ్ కంటే ముందు దానిని విత్ డ్రా చేసుకోలేరు. అలాగే, వాటిని మార్చుకోలేరు. ఇది ఓ రకమైన మ్యుచువల్ ఫండ్. లాకిన్ పీరియడ్ తర్వాత విత్ డ్రా చేసుకోవడం మాత్రమే భిన్నంగా ఉంటుంది. ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్ లాంగ్ టర్మ్ ఈక్విటీ, యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ, హెచ్‌డీఎఫ్‌సీ ట్యాక్స్ సేవర్, కొటక్ ట్యాక్స్ సేవర్, రిలయన్స్ ట్యాక్స్ సేవర్.. వంటివి ఉన్నాయి.

పెట్టుబడికి కారణాలు

పెట్టుబడికి కారణాలు

ఆదాయపన్ను ఆదా కోసం పలు రకాల పెట్టుబడులు ఉన్నాయి. కానీ ఆర్థిక నిపుణులు ELSS ది బెస్ట్ అని భావిస్తారు. అందుకు పలు కారణాలు ఉన్నాయి. ఇందులో ఎన్నో ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. పీపీఎప్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీం వంటి ప్రభుత్వ స్కీంలు కూడా ఉన్నాయి. ఆదాయపన్ను సెక్షన్ 80సీ కింద అర్హత కలిగిన పథకాల్లో లాకిన్ పీరియడ్ తక్కువగా (మూడేళ్లు) ఉండేది ELSS, ఇందులో ఇన్వెస్ట్ చేయడానికి డీమ్యాట్ అకౌంట్ అవసరం లేదు... ఇలా పలు కారణాలు ఉన్నాయి.

English summary

వెంటనే ఇందులో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించండి.. లాభాలెన్నో | What is ELSS and how it works?

ELSS stands for Equity Linked Savings Scheme. These are tax saving mutual funds that you can use to save income tax of up to Rs 1.5 lakh under Section 80C. ELSS funds have a lock in period of 3 years.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X