సంపాదన మొదలుపెట్టిన సమయం నుంచి చాలా మంది పెట్టుబడుల వెంట పడతారు. పెట్టుబడి పెట్టేవారిలో రెండు రకాలు ఉంటారు.
సంపాదన మొదలుపెట్టిన సమయం నుంచి చాలా మంది పెట్టుబడుల వెంట పడతారు. పెట్టుబడి పెట్టేవారిలో రెండు రకాలు ఉంటారు. ఎక్కువ రిస్క్ తీసుకుని బాగా డబ్బు సంపాదించాలని ఒక వర్గం అనుకుంటే, ఎక్కువ రిస్క్ అవసరం లేదు మన పెట్టుబడి భద్రంగా ఉంటే చాలు, ఒక రకమైన రాబడితో సరిపెట్టుకుందాం అనే మరో వర్గం అనుకుంటారు. దీర్ఘకాల లక్ష్యాలు కలిగి ఉన్నావారికి దేశంలో ఎన్నో సురక్షితమైన పెట్టుబడులు ఉంటాయి. అలాంటి వాటిలో 2018లో ఉత్తమ రక్షణ కలిగిన 10 పెట్టుబడి మార్గాలను చూద్దాం.

1. పీపీఎఫ్
వేతన జీవులు చాలా మంది ఇష్టపడే పెట్టుబడి సాధనం పీపీఎఫ్. పీపీఎఫ్‌ని ఎంచుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి వడ్డీ ఆదాయానికి పన్ను ఉండదు. రెండోది 80సీ కింద పన్ను మినహాయింపు ప్రయోజనాలు లభిస్తాయి. ఇంకో విధంగా పదవీ విరమణ నిధిని ఏర్పాటు చేసుకోవచ్చు. పీపీఎఫ్ మార్గంలో పెట్టుబడి పెడితే పదిహేనేళ్ల వరకూ వెనక్కు తీసుకోవడానికి ఉండదు. అయితే కొన్ని ప్రత్యేక కారణాలు ఉంటే 7వ ఏట నుంచి పాక్షిక ఉపసంహరణకు అనుమతిస్తారు.

2. రికరింగ్ డిపాజిట్(ఆర్‌డీ)
రికరింగ్ డిపాజిట్ చేయడం మూలంగా నెలవారీ క్రమమైన ఆదాయాన్ని పొందవచ్చు. రికరింగ్ డిపాజిట్ వడ్డీపై సైతం టీడీఎస్ కట్ చేస్తారు. ఆర్‌డీ సైతం దాదాపు బ్యాంకు డిపాజిట్ లాగే ఉంటుంది. 10 వేల మొత్తాల్లో టీడీఎస్‌ను లెక్కిస్తారు. పోస్టాఫీసు ఆర్‌డీ ప్రస్తుతం వడ్డీ రేటు 7.1%గా ఉన్నది.

3. బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు
బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లకు మీకు 6.6 నుంచి 7.5 శాతం వడ్డీ వస్తుంది. సంవత్సరం కాలం కంటే ఎక్కువ కాలం పెట్టుబడి పెట్టేట్లయితేనే ఎఫ్‌డీల వైపు చూస్తే మంచి రాబడి వస్తుంది. పన్ను శ్లాబును బట్టి రూ. 10 వేల కంటే ఎక్కువ వడ్డీ వచ్చినప్పుడు పన్ను కట్టాల్సి వస్తుంది. పన్ను పరిధిలోకి రాని వారు ఫారం 15జీ లేదా 15 హెచ్‌ను సమర్పించాలి.అలా చేస్తే మూలం వద్ద పన్ను మినహాయించరు.

4. డెట్ మ్యూచువల్ ఫండ్లు
డెట్ మ్యూచువల్ ఫండ్లు బ్యాంకు డిపాజిట్ల కంటే మంచి రాబడులనే అందిస్తున్నాయి. ఈక్విటీల్లో సైతం కొంత డబ్బు పెట్టుబడి పెడుతున్నందువల్ల డెట్ మ్యూచువల్ ఫండ్లు బాగానే రాణిస్తున్నట్లుగా చెప్పొచ్చు. డెట్ మ్యూచువల్ ఫండ్ల వల్ల ప్రయోజనం ఏంటంటే మామూలు బ్యాంకు డిపాజిట్ల కంటే ఎక్కువ రాబడి పొందుతూ కావాల్సిన సమయంలో కొంత డబ్బు వెనక్కు తీసుకోవచ్చు.

5. సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్స్
సీనియర్ సిటిజన్స్‌కు వివిధ రంగాల్లో ప్రయోజనాలు కల్పించేందుకు ప్రభుత్వ చాలా చర్యలు తీసుకుంటూ ఉంటుంది. అలాంటి వాటిలో ఈ స్కీమ్స్ ఒకటి. ప్రతి త్రైమాసికానికి వీటి వడ్డీ రేట్లను భారత ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. ప్రస్తుతం వీటి వడ్డీ రేట్లు 8.4 శాతంగా ఉన్నాయి.

6. సుకన్య సమృద్ది పథకం
అమ్మాయిల వివాహం, ఉన్నత విద్య కోసం డబ్బు కూడబెట్టాలనుకునే వారికి సుకన్య సమృద్ది పథకం బాగా ఉంటుంది. బేటీ బచావో-బేటీ పడావో అనే నినాదంతో ప్రభుత్వం ప్రారంభించిన పలు చర్యల్లో ఇది ఒకటి. సుకన్య సమృద్ది ఖాతాను బ్యాంకుల్లో, పోస్టాఫీసు కార్యాలయాల్లో తెరవొచ్చు. 80 సీ మినహాయింపులు ఉన్నాయి.

7. నెలవారీ ఆదాయ పథకాలు
పోస్టాఫీసు నెలవారీ ఆదాయ పథకం ప్రతి నెలా ఒక నిర్ణీత మొత్తం కావాలనుకునే వారికి బాగా ఉంటుంది. ఈ పథకం పేరిట గరిష్టంగా ఒక ఖాతాలో ఒకేసారి రూ.4.5 లక్షల వరకూ పెట్టుబడి పెట్టొచ్చు. ఉమ్మడి ఖాతాలో అయితే రూ.9 లక్షలు. ఈ నెలవారీ ఆదాయ పథక మెచ్యూరిటీ పీరియడ్ 5 ఏళ్లు గతేడాది జులై 1 నుంచి ఈ పథకం సంబంధించిన వడ్డీ రేటు 7.5%గా ఉంది.
More From GoodReturns

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications