దేశంలో నష్టభయం లేని 7 రకాల పెట్టుబడులు
మన దేశంలో మధ్య తరగతి జనాభా ఎక్కువ. అయితే ద్రవ్యోల్బణం కారణంగా ప్రతి ఒక్కరూ చూసుకుని ఖర్చు చేయాల్సి వస్తున్నది. దీర్ఘకాలాన్ని దృష్టిలో అనవసర ఖర్చులు తగ్గించుకుని సంపాదన తొలిదశ నుం
ఎక్కడైతే చాలా తక్కువ లేదా నష్టభయం అసలు ఉండదో అదే సురక్షితమైన పెట్టుబడి. ఇది పదవీ విరమణ చేసిన వారికి లేదా రిస్క్ తీసుకోవడం ఇష్టపడని వారికి సాధారణంగా సరిపోతుంది. రిస్క్ అనేది లేకపోతే, రాబడి ఆశాజనకంగా ఉండదు అనేది సాధారణమైన దురభిప్రాయం. ఇది నిజం కాదు, మంచి ప్రతిఫలాన్ని ఇచ్చి, పన్ను ప్రయోజనాలను పొందే అనేక రకాల పెట్టుబడి ఎంపికలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కిటుకు ఏమిటంటే మీకు ఏది సరిగా సరిపోతుంది, ఏది మానేయాలి అనేది గుర్తించడమే. కొంతమంది నిజానికి మంచి ప్రతిఫలాలు ఆశిస్తారు, ఇతరులు మధ్యస్తంగా ఉంటే మంచిది అనుకుంటారు.
భారతదేశంలో అనేక రకాల నష్టభయం లేని పెట్టుబడి ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. అన్ని వివిధ రకాల లక్షణాలు కలిగి ఉంటాయి. కొన్ని ఇతర వాటికంటే మరింత ఆకర్షణీయంగా ఉండొచ్చు. ఇక్కడ కొన్ని మీకు అవసరమైనవి తెలుసుకోండి.

ఫిక్స్‌డ్ డిపాజిట్లు:
మీరు నష్టభయం లేని పెట్టుబడి గురించి ఆలోచిస్తే మీకు ముందు గుర్తుకు వచ్చేది ఫిక్స్‌డ్ డిపాజిట్. ఇవి పొదుపు ఖాతాతో పోలిస్తే మంచి ఫలితాలను ఇస్తాయి, వడ్డీరేటు దాదాపు 7-8% వరకు ఉంటుంది. ఈ డిపాజిట్లు పూర్తి పన్ను విధించబడేవని మీరు గుర్తుంచుకోవాలి. అంటే, మీరు అధిక టాక్స్ పరిధిలో ఉంటే, మీ ప్రతిఫలం తక్కువగా ఉంటుంది.

2.రికరింగ్ డిపాజిట్లు:
నెలవారీ ఆదాయం స్థిరంగా ఉన్నవారికి ఇది ఒక మంచి ఎంపిక. ఇవి ఎఫ్‌డీలకు పూర్తి భిన్నం కావు; ఒక పద్ధతి ప్రకారం ప్రతి నెలా చిన్న మొత్తాల్లో పెట్టుబడి పెట్టడం. ఈ మొత్తం డబ్బు కొంతకాలానికి ఎక్కువ మొత్తం అవుతుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్లలానే ఇవి కూడా పన్ను విధించబడేవే.

3. పోస్టాఫీస్ డిపాజిట్లు:
ఇవి 5 సంవత్సరాల వరకు వివిధ కాలపరిమితిని ఎంచుకునే విధంగా అందుబాటులో ఉంటాయి. దీర్ఘకాలం ఉంటే, వడ్డీ రేటు అంతా బాగుంటుంది. 5 సంవత్సరాల కాలపరిమితికి 7.8% వడ్డీరేటు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉంది. 5 సంవత్సరాల పరిధిలోని ప్రతి డిపాజిట్ స్కీము టాక్స్ ప్రయోజనాలను పొందడం అనేది పోస్టాఫీస్ దేపాజిట్లలో పొందే మరో ప్రయోజనం. సురక్షితమైన పోస్టాఫీసు డిపాజిట్లు

4. ఫిక్సెడ్ మెచ్యూరిటీ ప్లాన్లు:
ఫిక్సెడ్ మెచ్యూరిటీ ప్లాన్ (FMP) అనేది స్థిరమైన కాలపరిమితితో ఉండే క్లోజ్-ఎండెడ్ స్కీమ్, ఇది ఒక నెల నుండి ఐదు సంవత్సరాల వరకు ఉంటుంది. ఒక FMP మీ డబ్బుని సెక్యూరిటీలు, డెట్స్ మీద పెట్టుబడి పెడుతుంది. దీనికి ఒక స్థిరమైన మెచ్యూరిటీ తేదీ ఉంటుంది. కానీ మీరు పెట్టుబడి పెట్టేటప్పుడు కేవలం AAA-రేటుతో కూడిన FMP స్కీముల మీదే జాగ్రత్తగా పెట్టుబడి పెట్టండి.

5. డెట్ మ్యూచువల్ ఫండ్స్:

6.కంపెనీ డిపాజిట్లు:
బాంక్ డిపాజిట్ల తో పోలిస్తే కంపెనీ డిపాజిట్లు కొద్దిగా అధిక రిస్క్‌తో కూడుకున్నవే, కానీ ఇవి అధిక వడ్డీ రేట్లను, ప్రతిఫలాలను అందిస్తాయి. ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్నప్పుడు కొంచెం అధిక వడ్డీలు కావాలని అనుకుంటే, AAA-రేట్లతో కూడిన కంపెనీ డిపాజిట్లను ఎంచుకోవడం మేలు. ఎక్కువ కాలం కోసం చూస్తుంటే ఈ డిపాజిట్లలో పెట్టుబడులు పెట్టడం చాలా మంచిది.

7. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్:
ఇవి దీర్ఘ కాలపు డిపాజిట్ స్కీములు, ఇవి చాలా సురక్షితమైనవి, వడ్డీ రెట్లు కూడా ఆకర్షణీయంగా దాదాపు 8-9% వరకు ఉంటాయి. మీరు సంవత్సరానికి వీటిపై కనీసం 500 రూపాయల నుండి గరిష్టంగా 1,50,000 రూపాయల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. మీకు వీటిపై రుణాలు, విత్ డ్రాలు, అకౌంట్ పోదిగించుకోవడం వంటి ప్రయోజనాలు కూడా పొందవచ్చు. ఇవి ప్రస్తుతం ఉన్న పెట్టుబడి మార్గాల్లో మంచి ప్రతిఫలాలను ఇవ్వడమే కాకుండా పన్ను మినహాయింపు ప్రయోజనాలను సైతం కల్పిస్తున్నాయి. పీపీఎఫ్ దీర్ఘకాల పెట్టుబడులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది?

8. పింఛను పథకాలు
పిల్లల చదువులు, వివాహాలు వంటి బాధ్యతలన్నీ తీరిపోయి మలి సంధ్యలో మనశ్శాంతిగా జీవించాలంటే యుక్త వయసు నుంచే పొదుపు చేయాల్సిన అవసరం ఉంది. పదవీ విరమణ తర్వాత ఎక్కువ ఖర్చులు ఏమి ఉంటాయిలే అని అనుకోవడం పొరపాటు. వయసు పెరిగే కొద్దీ చాలా మందికి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు పింఛను మినహా పెద్దగా ఆర్థిక చేయూత ఉండదు. ప్రయివేటు వారికి పీఎఫ్ ఉంటే ఫర్వాలేదు. అది కూడా లేకపోతే ఇబ్బందులే. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏదో పింఛను పథకాల్లో పెట్టుబడి పెట్టడం సూచనీయం.

ముగింపు
ఆర్ధిక అవసరాల కోసం ప్రతివ్యక్తి పెట్టుబడులు చేయవలసిన అవసరం ఉంది. అది మీ సంపదను పెంపొందించడమే కాకుండా, మీకు నిత్యం జీతం లేదా ఆదాయం లేనపుడు ఇది మిమ్మల్ని రక్షించే గొప్ప మార్గం. పర్యవసానంగా, మీరు పదవీ విరమణ పొందినప్పటికీ ఇది మీకు విలువ కట్టలేని అద్భుతమైన ఎంపిక. మన దేశంలో మధ్య తరగతి జనాభా ఎక్కువ. అయితే ద్రవ్యోల్బణం కారణంగా ప్రతి ఒక్కరూ చూసుకుని ఖర్చు చేయాల్సి వస్తున్నది. దీర్ఘకాలాన్ని దృష్టిలో అనవసర ఖర్చులు తగ్గించుకుని సంపాదన తొలిదశ నుంచే పొదుపు చేయడం అందరికీ అవసరమని గుర్తెరిగితే భవిష్యత్తులో రేట్లు పెరిగినా ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సిన పనిలేదు. పొదుపు, పెట్టుబడిని నిర్లక్ష్యం చేస్తున్నారా... అలాంటి వారి కోసమే ఈ ప్రణాళిక


Click it and Unblock the Notifications