భారతీయులు మ్యూచువల్ ఫండ్స్, షేర్ల కంటే ఫిక్స్‌డ్ డిపాజిట్లవైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ తాజా సర్వేలో వెల్లడయింది. బ్యాంక్ డిపాజిట్లలో తమ డబ్బును
భారతీయులు మ్యూచువల్ ఫండ్స్, షేర్ల కంటే ఫిక్స్‌డ్ డిపాజిట్లవైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ తాజా సర్వేలో వెల్లడయింది. బ్యాంక్ డిపాజిట్లలో తమ డబ్బును ఉంచేందుకు 95 శాతానికి పైగా భారతీయులు మొగ్గుచూపుతుండగా, 10 శాతం కంటే తక్కువ మందే మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబులు పెడుతున్నారని సెబీ ఇన్వెస్టర్ సర్వే 2015 పేర్కొంది. ఈ సర్వే కోసం 2 లక్షలకు పైగా కుటుంబాలను ఎంపిక చేశారు. చివరకు 50,453 కుటుంబాలపై తుది సర్వే నిర్వహించారు. 2015లో ప్రారంభమైన ఈ సర్వే 2016లో ముగిసింది. నీల్సన్ ఇండియా సంస్థ నిర్వహించిన ఈ సర్వే వివరాలను బుధవారం వెల్లడించారు.సర్వే ముఖ్యాంశాలు మీ కోసం...

పెట్టుబడుల్లో దేని స్థానం ఎక్కడ?
ఎఫ్‌డీల తర్వాత పెట్టుబడులకు జీవిత బీమా పాలసీలకు రెండో ప్రాధాన్యతను భారతీయులు ఇస్తున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో బంగారం, వెండి వంటి విలువైన లోహాలు, పోస్టా ఆఫీస్ సేవింగ్స్ పథకాలు, రియల్ ఎస్టేట్‌లు ఉన్నాయి. పెట్టుబడి ప్రాధాన్యాలకు సంబంధించి ఈ ఐదు సాధనాల తర్వాతే ఆరోస్థానంలో మ్యూచువల్ ఫండ్స్(9.7%), ఏడో స్థానంలో స్టాక్ మార్కెట్(8.1%) పెట్టుబడులు ఉన్నాయి.

సిప్ మార్గంలో పెట్టుబడులు పెడుతున్నవారు 60% మంది
* 3.37 కోట్ల ఇన్వెస్టర్ కుటుంబాలు భారత్‌లో ఉన్నాయి. వీటిల్లో 2.37 కోట్లు పట్టణ ప్రాంతాల్లో, 1 కోటి మంది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు.
మొత్తం ఇన్వెస్టర్ కుటుంబాల్లో 66 శాతం కుటుంబాలు(2.2 కోట్ల కుటుంబాలు) ఇన్వెస్ట్‌మెంట్స్‌కు, మ్యూచువల్ ఫండ్స్‌కు ప్రాధాన్యత ఇస్తున్నాయి. మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడిదారుల్లో 60% మంది సిప్ మార్గాన్నే ఎంచుకుంటున్నారు.

సర్వేలో ఆసక్తికరమైన అంశాలు
* 1.9 కోట్ల కుటుంబాలు ఈక్విటీల్లో, 77 లక్షల కుటుంబాలు బాండ్లలో పెట్టుబడులు పెట్టాయి.
* 30 లక్షల కుటుంబాలు ఈక్విటీ, కరెన్సీ డెరివేటివ్స్‌లో, 21 లక్షల కుటుంబాలు కమోడిటీ ఫ్యూచర్స్‌లో ఇన్వెస్ట్ చేశాయి.
* వివిధ మార్గాల్లో పెట్టుబడులు పెడుతున్న వారిలో 75% మంది గత 5 సంవత్సరాల్లోనే ఈక్విటీల్లోకి మొదటిసారి ప్రవేశించారు.

గ్రామీణులకు షేర్లపై అవగాహన తక్కువ
* ఇక గ్రామీణ ప్రాంతాల్లో సర్వే చేసిన వారిల్లో ఒక్క శాతం మంది కూడా షేర్లలో మదుపు చేయడం లేదు. ఫండ్స్, షేర్ల గురించి అవగాహన ఉన్నవారి శాతం నిరాశపరిచే విధంగా 1.4% ఉంది.
* సర్వేలో పాల్గొన్న గ్రామీణ జనాభాలో 95 శాతం మందికి బ్యాంక్ ఖాతాలున్నాయి. 47 శాతం మంది జీవిత బీమా పాలసీలు తీసుకున్నారు. 29% మందికి తపాలా డిపాజిట్లు ఉన్నాయి. 11 శాతం మంది విలువైన లోహాల్లో(బంగారం,వెండి) పెట్టుబడులు పెట్టారు.

లావాదేవీలకు మొబైల్‌యే ఎక్కువ
స్టాక్ లావాదేవీలను ఇంటర్నెట్‌లో సొంతంగా నిర్వహిస్తున్న వారు 22% మందే. ఎక్కువ శాతం మంది మధ్యవర్తులపై ఆధారపడుతున్నారు. తమ బ్రోకరేజీ సంస్థలకు ఫోన్ చేసి, ఆర్డర్లు పెట్టేవారి శాతం 78గా ఉంది. మార్కెట్ లావాదేవీలకు అవసరమైన సమాచారాన్ని తెలుసుకునేందుకు సామాజిక మాధ్యమాలను వాడుతున్న వారు 40% మంది. కొత్త ఖాతాదారులను సంపాదించేందుకు ముఖాముఖి సంప్రదించే మధ్యవర్తిత్వ సంస్థలు 52 శాతంగా ఉండగా, ప్రసార మాధ్యమాల ద్వారా చేరుకుంటున్నవారు 51%, ఫోన్‌కాల్స్ ద్వారా 50% మంది ఉన్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్‌డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications