మ్యూచువల్ ఫండ్స్ మీద ఇప్పుడిప్పుడే అవగాహన పెరుగుతూ వస్తోంది. ఈక్విటీ, డెట్ మ్యూచువల్ ఫండ్లు అని మీరు చాలా చోట్లే విని ఉంటారు. అయితే ఒక్కో ఫండ్‌కు సంబంధించి కొన్ని ప్రాథమిక అంశాలు ఉంటాయి. మొదటిసారి పెట్టుబడి పెట్టేవారికి కొన్ని పదాలు అర్థం కావు. అలాంటి వారి కోసమే తరుచూ వాడే పదాలు, వాటి వివరణ ఇక్కడ జరిగింది.

ఎన్ఏవీ:
షేరుకు విలువ ఉన్నట్లు మ్యూచువల్ ఫండ్‌కు ఒక విలువ ఉంటుంది. ఒక పెద్ద ఫండ్‌ను కొన్ని యూనిట్లుగా విభజిస్తారు. ప్రతి యూనిట్ విలువను ఎన్ఏవీ అంటారు. ఈ ధర వద్ద పెట్టుబడిదారులు కొనడం, అమ్మడం చేస్తారు. దాదాపు ప్రతి రోజు ఎన్ఏవీ విలువను లెక్కిస్తారు.

ఫోలియో నంబరు:
మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌ను గుర్తించేందుకు ఫండ్ హౌస్ ఒక్కో ఫండ్‌కు ఒక ఫోలియో నంబరును కేటాయిస్తుంది. ఒక్కో ఫండ్ హౌస్ వద్ద ఎన్ని ఫోలియోలు కలిగి ఉండాలన్న దానిపై పరిమితి లేదు.

ఎంట్రీ లోడ్ అండ్ ఎగ్జిట్ లోడ్( ప్రవేశ రుసుము, నిష్క్రమణ రుసుము)
ఇంతకు ముందు మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడులు పెట్టాలంటే ప్రవేశ రుసుము ఉండేది. ప్రస్తుతం సెబీ మార్గదర్శకాల ప్రకారం ఎటువంటి రుసుములు లేవు. లావాదేవీల రుసుములు మాత్రం ఉంటాయి.
మనం పెట్టుబడి పెట్టే పథకాన్ని బట్టి ఎగ్జిట్‌లోడ్ ఉంటుంది. నిర్దేశించిన తేదీ కంటే ముందే మ్యూచువల్ ఫండ్ పథకం నుంచి నిష్క్రమించినా, లేదా కొంచెం డబ్బును వెనక్కు తీసినా ఎగ్జిట్ లోడ్ రూపంలో రుసుములు వసూలు చేస్తారు.

రుసుములు
మొదటిసారి పెట్టుబడి పెట్టేవారికి సిప్ సబ్‌స్క్రైబ్ చేసుకునే వారికి పెట్టుబడి విలువ రూ. 10 వేలు దాటితే రూ. 150 రుసుము ఉంటుంది. ఇది వరకూ పెట్టుబడులు కలిగి ఉన్నవారికి రూ. 100 లావాదేవీ రుసుము ఉంటుంది. మ్యూచువల్ ఫండ్ అకౌంట్ స్టేట్‌మెంట్‌లో సబ్‌స్ర్ర్కిప్షన్ అమౌంట్, లావాదేవీ రుసుము, నికర పెట్టుబడి వివరాలు ఉంటాయి. ఇంకా సెక్యూరిటీ లావాదేవీ పన్ను, సేవా పన్ను వంటివి సైతం పరోక్షంగా పెట్టుబడిదారు నుంచే వసూలు చేస్తారు.

డివిడెండ్ ఆప్షన్:
ఫండ్ కంపెనీ డివిడెండును డిక్లేర్ చేసినప్పుడు మీరు దీన్ని అందుకోవచ్చు. ఫండ్ ఫేస్ వాల్యూను బట్టి డివిడెండ్ చెల్లింపు జరుగుతుంది. ఫండ్ ఎన్ఏవీ రూ. 30 ఉన్న సంస్థ 30% డివిడెండును ప్రకటిస్తే మీకు రూ. 3 అందుతుంది. డివిడెండు చెల్లింపు తర్వాత ఎన్ఏవీ విలువ తగ్గుతుంది. క్రమమైన ఆదాయం కావాలనుకునే వారు ఈ ఆప్షన్ ఎంచుకోవచ్చు.

గ్రోత్ ఆప్షన్:
డివిడెండు అనేది మీకు వచ్చే అదనపు ఆదాయంలా కనిపించినా అలా ఏమీ జరగదు. మీ పెట్టుబడి రాబడిలోంచే కొంత భాగాన్ని మీకు చెల్లిస్తారు. గ్రోత్ ఆప్షన్ ఎంచుకుంటే మీకు వచ్చే డివిడెండును సైతం పెట్టుబడిలో కలిపి ఎన్ఏవీ లెక్కిస్తారు. ఎక్కువ ఆదాయం దీర్ఘకాలంలో మంచిదనుకునే వారు ఈ ఆప్షన్‌ను ఎంచుకోవడం మంచిది. యుక్త వయసులో ఉన్నవారు పెట్టుబడులు పెట్టేటప్పుడు గ్రోత్ ఆప్షన్ సూచనీయం.

సిప్:
బ్యాంకు రికరింగ్ డిపాజిట్‌లో క్రమంగా ఇన్వెస్ట్ చేసినట్టే సిప్‌లో సైతం కొంచెం కొంచెం డబ్బు పెట్టుబడి పెడతాం. మ్యూచువల్ ఫండ్ పథకంలో రెగ్యులర్ ఇంటర్వెల్స్‌లో ఒక నిర్ణీత సొమ్మును జమ చేస్తూ ఉంటారు. ఇది రోజువారీ, వారం వారీ, నెలవారీ, త్రైమాసికానికి ఒకసారి ఎలాగైనా మీ అనుకూలతను బట్టి ఎంచుకోవచ్చు. మీ బ్యాంకు ఖాతా నుంచి ఆయా తేదీల్లో డబ్బు ఆటోమేటిక్‌గా డెబిట్ అవుతుంది.

సిస్టమ్యాటిక్ ట్రాన్స్‌ఫర్ ప్లాన్(ఎస్టీపీ)
మీరు క్రమంగా ఒక డెట్ ఫండ్‌లో పెట్టుబడులు పెడుతున్నారు. అందులో నుంచి వేరే ఫండ్‌లోకి పెట్టుబడులు మార్చాలనుకుంటున్నారు. అప్పుడు మీకు ఎస్టీపీ ఉపయోగపడుతుంది. ప్రతి నెలా ఒక తేదీలో కొంత సొమ్మును ఒక ఫండ్ నుంచి మరో ఫండ్‌లోకి మార్చుకునే ఏర్పాటు ఎస్టీపీ. ఎక్కువ డబ్బును ఒకేసారి పెట్టుబడి పెట్టాలనుకున్నప్పుడు మొదట ఒక డెట్ ఫండ్లో మొత్తాన్ని ఉంచి, అందులోంచి ఎస్టీపీ ద్వారా కావాలనుకున్న ఫండ్లోకి డబ్బును బదలాయించుకోవచ్చు.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications