అన్ని ట్యాక్స్ సేవింగ్ పథకాల్లో ఈఎల్ఎస్ఎస్(ఈక్విటీ లింక్‌డ్ సేవింగ్ స్కీమ్)లు మిగిలిన వాటి కన్నా ఉత్తమ పనితీరును కనబరుస్తున్నాయి. ఈక్విటీ ఎక్స్‌పోజర్ కలిగి పన్ను ఆదా ప్రయోజనాలు కల్పించే మ్యూచువల్ ఫండ్లు ఇవి. ఆదాయపన్ను చట్టం 80సీ కింద పన్ను మినహాయింపు కలిగి పెట్టుబడులకు ఆకర్షణీయంగా ఉంటాయి. అయితే వీటిలో మూడేళ్ల లాక్ ఇన్ పీరియడ్ ఉంటుందనే అంశాన్ని గుర్తుంచుకోవాలి.
పన్ను మినహాయింపు ప్రయోజనాలు పొందాలనుకునే వ్యక్తులు వీటిని పరిగణించవచ్చు. ఇక్కడ రూ. 500 నుంచి పొదుపును ప్రారంభించవచ్చు. ఈక్విటీల పనితీరు ఆధారంగా రాబడులు వస్తాయి. దీర్ఘకాలంలో రాబడులకు వీటిని(ఈఎల్ఎస్ఎస్) ఎంచుకోవచ్చు. రేటింగ్‌ల ఆధారంగా, పనితీరు బట్టి 6 ఉత్తమ ఫండ్లను ఇక్కడ చూడొచ్చు.

బిర్లా సన్‌లైఫ్ ట్యాక్స్ రిలీఫ్ 96
దీనికి క్రిసిల్ అత్యధిక రేటింగ్ ఇవ్వగా, వాల్యూ రిసెర్చ్ ఆన్‌లైన్ 4 స్టార్ రేటింగ్ ఇచ్చింది. గత మూడేళ్లలో ప్రతి సంవత్సరం 30 శాతం రాబడులను ఇచ్చింది. ఈ ఫండ్‌పై ఎటువంటి ఎగ్జిట్ లోడ్ లేదు. ఇందులో పెట్టుబడి పెట్టే సిప్ కనీస విలువ రూ. 500. ఈ ఫండ్ పోర్ట్‌ఫోలియోలో ఐసీఐసీఐ బ్యాంకు, హనీవెల్ ఆటోమేషన్ ఉన్నాయి.

యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్
యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ సైతం ఈఎల్ఎస్ఎస్‌ల్లో చెప్పుకోదగ్గ రిటర్నులను ఇస్తోంది. క్రిసిల్, వాల్యూ రీసెర్చి ఆన్‌లైన్ దీనికి ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చాయి. గత మూడేళ్లలో రాబడి 30 శాతంగా ఉంటూ వస్తోంది. ఫండ్ ప్రారంభం నుంచి రాబడి 19.52 శాతంగా ఉంది. ఈ ఫండ్ పోర్ట్‌ఫోలియోలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, కొటక్ మహీంద్రా, సన్ ఫార్మా ఉన్నాయి.

టాటా ఇండియా ట్యాక్స్ సేవింగ్ ఫండ్
ఈక్విటీ లింక్‌డ్ ట్యాక్స్ సేవింగ్ పథకాల్లో ఒకటైన ఈ ఫండ్ లాక్ ఇన్ పీరియడ్ 3 ఏళ్లు. క్రిసిల్ ఈ ఫండ్‌కు ఉత్తమ రేటింగ్‌ని ఇచ్చింది. గత మూడేళ్లలో ఫండ్ 26 శాతం రాబడినిచ్చింది. దీర్ఘకాలంలో చూస్తే ఈ ఫండ్ బాగానే ఉండొచ్చు.

బిర్లా సన్ లైఫ్ ట్యాక్స్ ప్లాన్
బిర్లా సన్‌లైఫ్ ట్యాక్స్ ప్లాన్‌కు క్రిసిల్ నం.2 రేటింగ్ ఇచ్చింది. వాల్యూ రిసెర్చి ఆన్‌లైన్ 4 స్టార్ రేటింగ్ ఇచ్చింది. గత మూడేళ్లలో ఈ ఫండ్ 28 శాతం రాబడిని ఇచ్చింది. ఫండ్ ప్రారంభం నుంచి 21% రాబడి వచ్చింది. ఈ ఫండ్ పోర్ట్‌ఫోలియోలో సుందరం క్లేటన్, హనీవెల్ ఆటోమేషన్, కొటక్ మహీంద్రా బ్యాంకు ఉన్నాయి.

డీఎస్‌పీ బ్లాక్ రాక్ ట్యాక్స్ సేవర్ ఫండ్
డీఎస్‌పీ బ్లాక్ రాక్ ట్యాక్స్ సేవర్ ఫండ్‌కు క్రిసిల్ నం.2 రేటింగ్ ఇచ్చింది. వాల్యూ రిసెర్చి ఆన్‌లైన్ 4 స్టార్ రేటింగ్ ఇచ్చింది. ఫండ్ మొదలైనప్పటి నుంచి 14.5 శాతం రాబడిని, గత మూడేళ్లలో 28.44 శాతం రాబడినిచ్చింది. పోర్ట్‌ఫోలియోలో ఇన్ఫోసిస్, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంకు ఉన్నాయి.

ఫ్రాంక్లిన్ ఇండియా ట్యాక్స్‌షీల్డ్ ఫండ్
గత మూడేళ్లలో ఈ ఫండ్ 27 శాతం రాబడినిచ్చింది. ఫండ్ ఎన్ఏవీ రూ. 468 వద్ద ఉంది. ఫండ్ ప్రారంభ సమయం నుంచి 24.67 శాతం రాబడి వచ్చింది. ఫండ్ పోర్ట్‌ఫోలియోలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, టీసీఎస్, ఎస్‌బీఐ ఉన్నాయి.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications