జులై 31తో వ్యక్తులు ఆదాయపు పన్ను రిటర్నులు సమర్పించే గడువు ముగుస్తుంది. పన్ను చెల్లింపుదార్లకు సులువుగా ఉండేందుకు వివిధ రకాల ఫారంలను అందుబాటులోకి తెచ్చింది. ఈ-ఫైలింగ్ చేసేటప్పుడు ఎవరు ఏ ఫారం వాడాలనే వివరాలు ఇన్‌కమ్ టాక్స్ వెబ్‌సైట్‌లో ఉన్నాయి. వాటిని సులభతర పద్దతిలో ఉపయోగించుకునేందుకు ఇవి చదవండి.

ఐటీఆర్-1
ముఖ్యంగా వేతనం లేదా పింఛను ఆదాయం ఉన్నవారు ఈ ఫారం వాడాలి.
- వేతనం లేదా పింఛను ద్వారా వచ్చే ఆదాయం
- ఒక ఇంటి నుంచి వచ్చే ఆదాయం ఉన్నవారు
- (గతేడాది వచ్చిన నష్టాన్నిఈ సంవత్సరంలో లెక్కించేట్లయితే దాన్ని మినహాయించాలి)
- ఇతర ఆదాయ మార్గాలు
- (లాటరీ, గుర్రపు పందేం నుంచి వచ్చిన ఆదాయాన్ని మినహాయించాలి)
మైనర్ పిల్లలు, జీవిత భాగస్వామి నుంచి ఆదాయం వస్తుంటే దాన్ని కలపాలి.

ఐటీఆర్- 2ఏ
- వేతనం లేదా పింఛను ద్వారా వచ్చే ఆదాయం
- ఇంటి నుంచి వచ్చే ఆదాయం
- వ్యవసాయ ఆదాయం రూ. 5000 పైన ఉంటే
- ఇతర ఆదాయ మార్గాలు
పై మూడింటితో పాటు ఒకటి కంటే ఎక్కువ ఇళ్ల నుంచి ఆదాయం సంక్రమిస్తుంటే
లాటరీ, గుర్రపు పందేల నుంచి వచ్చే ఆదాయం ఉంటే ఈ ఫారంను వాడాలి.

ఐటీఆర్-2
కింది రకాల ఆదాయాలు ఉన్నవారు ఈ ఫారం వాడాలి.
1. వేతనం లేదా పింఛను ఆదాయం కలవారు
2. ఇంటి నుంచి వచ్చే ఆదాయం ఉన్నవారు
3. విదేశీ ఆస్తుల ద్వారా లేదా విదేశీ ఆదాయం ఉన్నవారు
ఇతర ఆదాయ మార్గాలు(లాటరీ, గుర్రపు పందేల ద్వారా ఆదాయం వస్తుంటే దాన్ని కలపాలి)
ఐటీఆర్-1, ఐటీఆర్-2ఏ వర్తించే విషయంలో సందేహం ఉన్నవారెవరైనా ఈ ఫారాన్ని ఎంచుకోవచ్చు.
వ్యాపారం, వృత్తి ఆదాయాల మినహా మిగిలిన ఆదాయాలన్నింటికీ (మూలధన లాభాలతో సహా)ఈ ఫారం వర్తిస్తుంది.

ఐటీఆర్-3
ఐటీర్-2లో ఉన్న ఆదాయ మార్గాలతో పాటు భాగస్వామ్య సంస్థలో వాటా ద్వారా లాభాలు వస్తుంటే ఈ ఫారం వాడాలి.

ఐటీఆర్-4
ఐటీఆర్-3లో తెలిపిన ఆదాయాలతో పాటు సొంత వ్యాపారం లేదా వృత్తి ద్వారా ఆదాయం ఉన్నవారు ఈ ఫారం వాడాలి.
More From GoodReturns

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?



Click it and Unblock the Notifications