2016-17 సంవత్సరానికి గాను ఆదాయం పన్ను రిటర్నుల (ఐటీఆర్) ఈ ఫైలింగ్ మొదలైంది. వేతన జీవులు, వడ్డీ ఆదాయం పొందే వ్యక్తులకు వర్తించే ఐటీఆర్ 1ను(సహజ్), వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబం, ముందస్తుగా అంచనా వేయగలిగే ఆదాయం కలిగిన భాగస్వామ్య సంస్థలకు వర్తించే ఐటీఆర్ 4ఎస్ (సుగమ్) ఫారాలను వెబ్‌సైట్‌లో ఉంచింది.
ఐటీ శాఖ అధికారిక పోర్టల్ incometaxindiaefiling.gov.in/లో ఈ రెండు ఫారాలను యాక్టివేట్ చేసినట్లు, త్వరలోనే ఇతర విభాగాలకు చెందిన ఐటీఆర్‌లను సైతం యాక్టివేట్ చేయనున్నట్లు ఐటీ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఐటీఆర్‌లతోపాటు మదింపుదారుల కోసం ఐటీ శాఖ ప్రత్యేకంగా పన్ను క్యాలికులేటర్‌ను కూడా ఉంది.
ఆన్‌లైన్ కంప్యూటర్ ప్రోగ్రామ్ అయిన ఈ క్యాలికులేటర్ ద్వారా మదింపుదారులు ప్రస్తుత సంవత్సరానికి ఎంత పన్ను చెల్లించాల్సి ఉంటుందో లెక్కించేందుకు వీలుంటుంది. రిటర్నులు సమర్పించేవారు కనీస సమాచారం నింపగానే ఈ క్యాలికులేటర్ చెల్లించాల్సిన పన్ను మొత్తాన్ని లెక్కిస్తుంది.

మొదలైన ఈ ఫైలింగ్: తుది గడువును జూలై 31
గతేడాది ఈ-ఫైలింగ్ ప్రక్రియ జూలై 1, 2015న ప్రారంభమైంది. ఎందుకంటే గతసారి ఐటీ శాఖ ప్రవేశపెట్టిన 14 పేజీల ఐటీఆర్ వివాదాస్పదమైంది. బ్యాంక్ అకౌంట్ల వివరాలు, విదేశీ యాత్రల సమాచారం సైతం పొందుపర్చాలంటూ ఐటీ శాఖ కోరడంపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి.

మొదలైన ఈ ఫైలింగ్: తుది గడువును జూలై 31
దాంతో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆదేశాల మేరకు ఆ నిబంధనలను ఉపసంహరించుకొన్న ఐటీ శాఖ ఐటీఆర్ ఫారాలను సమూలంగా సవరించడంతోపాటు పూర్తిగా సరళీకరించింది. ఐటీ శాఖ అత్యున్న నిర్ణయాధికార మండలి ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు (సీబీడీటీ) గతనెల 30న ప్రస్తుత మదింపు సంవత్సరానికి చెందిన ఐటీఆర్‌లను నోటిఫై చేసింది.

మొదలైన ఈ ఫైలింగ్: తుది గడువును జూలై 31
ఐటీ రిటర్నులు దాఖలు చేసేందుకు తుది గడువును జూలై 31గా నిర్ణయించింది. ఐటీ అధికారులు, పన్ను చెల్లింపుదారులకు మధ్య ప్రత్యక్ష సంప్రదింపులను తగ్గించే దిశగా ఆదాయం పన్ను శాఖ మరో అడుగు ముందుకేసింది. పన్ను శాఖ అధికారికి మొదటి అప్పీలును ఎలక్ట్రానిక్ పద్ధతిలోనే సమర్పించేందుకు (ఈ-ఫైలింగ్) ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది.

మొదలైన ఈ ఫైలింగ్: తుది గడువును జూలై 31
అప్పీలు ఈ ఫైలింగ్ కూడా ఐటీఆర్ ఫైలింగ్ మాదిరిగానే డిజిటల్ సిగ్నేచర్ ద్వారా జరుపవచ్చని ఐటీ శాఖ తెలిపింది. ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ ద్వారా ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ కోడ్(ఈవీసీ)ను జనరేట్ చేసుకోవచ్చు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..



Click it and Unblock the Notifications