స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులపై కొత్త ధోరణి ఊపందుకుంది. ఐటీ కంపెనీల స్టాక్స్‌పై మ్యూచువల్ ఫండ్స్ (ఎంఎఫ్‌లు) సానుకూల ధోరణితో కొనసాగుతున్నాయి. జనవరిలో గతంలో ఎన్నడూ లేనంతగా రూ. 43,115 కోట్లను సాప్ట్‌వేర్ కంపెనీల స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టారు.
రాబడి కోసం మ్యూచువల్ ఫండ్స్ వైపు దృష్టి
గత సెప్టెంబరులో ఐటీ కంపెనీల స్టాక్స్ విభాగంలోకి మళ్లించిన రూ.43,053 కోట్లు పెట్టుబడులే ఇప్పటివరకు అత్యధికం కావడం విశేషం. ఇక డిసెంబరులో రూ.41,998 కోట్లను, గతేడాది జనవరిలో రూ.35,463 కోట్లను మ్యూచువల్ ఫండ్స్ ఈ షేర్ల విభాగంలో పెట్టుబడులు రూపంలో పెట్టారు.
అయితే ఇటీవల రూపాయి క్షీణిస్తుండటం ఐటీ కంపెనీలకు కలిసొచ్చే అంశం కావడమే ఐటీ షేర్లపై ఇన్వెస్టర్లు పెట్టుబడికి కారణమని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఐటీ కంపెనీల ఆదాయంలో 85 శాతం వాటా ఎగుమతులు ద్వారానే వస్తుందన్న సంగతి తెలిసిందే.

భారత్‌లో ఎక్కువగా ఎగుమతులు అమెరికా, బ్రిటన్‌కే ఎక్కవగా ఉంటాయి. అందువల్ల రూపాయితో పోలిస్తే డాలర్ ఎంతగా బలపడితే ఐటీ కంపెనీల లాభం మరింతగా పెరుగుతుంది. గతేడాదితో పోలిస్తే సాప్ట్‌వేర్ కంపెనీలు స్టాక్స్‌పై ఫండ్ మేనేజర్లు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టారు.
మ్యూచువల్ ఫండ్ అకౌంట్ ఓపెన్ చేయడం ఎలా?
ఇదిలా ఉంటే బ్యాంకుల తర్వాత మ్యూచువల్ ఫండ్స్ అధికంగా ఐటీ రంగానికే ప్రాధాన్యతను ఇస్తున్నాయి. జనవరిలో ఇన్వెస్టర్లు బ్యాంకింగ్ రంగ షేర్లల్లో రూ.78,644 కోట్లను ఫండ్‌ల రూపంలో మళ్లించారు. ఆ తర్వాత ఔషధ షేర్ల విభాగంలోకి రూ.33,785 కోట్లు, వాహన షేర్ల విభాగంలోకి రూ.26,653 కోట్లు, ఆర్థిక సేవల విభాగంలోకి రూ.23,131 కోట్లను మళ్లించారు.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications