న్యూఢిల్లీ: దేశంలో బ్లాక్‌మనీ, మనీ లాండరింగ్ లాంటి చట్ట వ్యతిరేక వ్యవాహారాలకు చెక్ పట్టేందుకు కేంద్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆర్ధిక లావాదేవీలకు సంబంధించి నిబంధనలను మరింత కఠినతరం చేసింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి బ్యాంక్ ఖాతా తెరవాలంటే పాన్ కార్డును తప్పనిసరి చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన పథకం కింద్ బ్యాంక్ ఖాతా తెరిచే వారికి మాత్రం మినహాయింపు ఉంది. సహకార బ్యాంకుల్లో ఖాతా ప్రారంభించాలన్నా పాన్ నెంబర్‌ను తప్పనిసరిగా ఇవ్వాల్సిందే. హోటల్ బిల్లు లేదా విదేశీయాన విమాన టిక్కెట్టు కొనుగోలు కోసమైనా రూ.50,000 నగదు చెల్లింపులకు తప్పనిసరిగా పాన్ కార్డు నెంబర్‌ను సమర్పించాలి.

జనవరి 1 నుంచి బ్యాంక్ ఖాతాకు పాన్ నెంబర్ తప్పనిసరి
వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఈ కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. వచ్చే సంవత్సరం నుంచి రూ. 2 లక్షలకు మించిన ఏ లావాదేవీల చెల్లింపులకైనా (కార్డు ద్వారానైనా, నగదు రూపంలోనైనా) పాన్ కార్డు తప్పనిసరి. ప్రస్తుతం ఈ పరిమితి రూ.5 లక్షలుగా ఉంది.

జనవరి 1 నుంచి బ్యాంక్ ఖాతాకు పాన్ నెంబర్ తప్పనిసరి
చిన్న మదుపర్లకు మాత్రం ఈ విషయంలో కొంత ఊరట లభించింది. పోస్టాఫీస్ డిపాజిట్ పథకాల్లో రూ.50,000కు మించి సొమ్ము జమ చేసిన పక్షంలో పాన్ వివరాలివ్వాలన్న నిబంధన నుంచి కేంద్ర ప్రభుత్వం మినహాయింపునిచ్చింది.
రూ.10 లక్షల స్థిరాస్తి కొనుగోలుకూ పాన్ తప్పనిసరి. ఈ విషయంలోనూ గృహ కొనుగోలుదారులకు ఊరట లభించినట్లయింది. ఎందుకంటే గతంలో కేంద్ర ప్రభుత్వం రూ.5 లక్షల విలువ చేసే స్థిరాస్తి కొనుగోలు, విక్రయ వాదేవీలకు పాన్ తప్పనిసరి చేయాలని ప్రతిపాదించింది.

జనవరి 1 నుంచి బ్యాంక్ ఖాతాకు పాన్ నెంబర్ తప్పనిసరి
రూ.50 వేలకు మించిన క్యాష్ కార్డులు, ప్రీపెయిడ్ పథకాల కొనుగోలు చేయాలనుకునేవారు కూడా వచ్చే సంవత్సరం నుంచి పాన్ వివరాలను తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. అన్ లిస్టెడ్ కంపెనీల షేర్లను కొనుగోలు చేసేవారికీ కొంత ఊరట లభించింది. ప్రస్తుతం ఈ సంస్థలకు చెందిన రూ.50 వేల షేర్లు కొనుగోలు చేయాలంటే పాన్ కావాల్సిందే. వచ్చే ఏడాది నుంచి ఈ నిబంధనను రూ.లక్షకు పెంచుతున్నట్లు కేంద్రం వెల్లడించింది.

జనవరి 1 నుంచి బ్యాంక్ ఖాతాకు పాన్ నెంబర్ తప్పనిసరి
కొత్త మార్గదర్శకాలను విడుదల చేసిన సందర్భంగా రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా మాట్లాడుతూ.. ఆభరణాలు, బులియన్ కొనుగోళ్లు బ్లాక్‌మనీని కూడబెట్టుకునేందుకు ప్రధాన మార్గంగా మారిందన్నారు. ప్రస్తుతం రూ.5 లక్షల లావాదేవీలపై పాన్ నెంబర్ సమర్పించడం తప్పనిసరి అన్న నిబంధన పరిమితిని వచ్చే ఏడాది నుంచి రూ.2 లక్షలకు కుదిస్తున్నట్లు ఆయన చెప్పారు.

జనవరి 1 నుంచి బ్యాంక్ ఖాతాకు పాన్ నెంబర్ తప్పనిసరి
అయితే ఇది మధ్యంతర చర్యేనని, పరిమితిని రూ.లక్షకు కుదించాలన్నదే ప్రభుత్వ అంతిమ లక్ష్యమని అధియా స్పష్టం చేశారు. అంతేకాదు ప్రస్తుతం బ్యాంకుల్లో రూ.50వేలకు మించి నగదు డిపాజిట్ చేయడం లేదా బ్యాంక్ డ్రాఫ్ట్, పే ఆర్డర్, బ్యాంకర్ చెక్ కొనుగోలుపై పాన్ సమర్పించాలన్న నిబంధనను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ఆయన చెప్పారు.


Click it and Unblock the Notifications