ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్‌లు దాఖలు చేసేందుకు పొడిగించిన తుది గడువు సెప్టెంబర్ 7వ తేదీతో పూర్తయింది. అయినా సరే మనలో చాలా మంది ఇంకా ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్‌లు దాఖలు చేసి ఉండకపోవచ్చు. దీంతో ఐటీ డిపార్ట్‌మెంట్ నుంచి ఎలాంటి పరిణామాలను ఎదుర్కొవాల్సి వస్తుందోనని భయపడుతుంటారు.
గడువులోగా ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్‌లు దాఖలు చేయనందుకు జరిమానా విధిస్తూ ఏమైనా లేఖలు అందుకోవాల్సి వస్తుందనే భయం చాలా మందిలో ఉంది. అయితే ఇప్పుడు ఈ భయాలు అక్కర్లేదు. ఇలాంటి వారెవరైనా ఉంటే ఎలాంటి జరిమానా లేకుండా వచ్చే ఏడాది మార్చి 31లోగా ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్‌లు దాఖలు చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది.
ఆ తేదీ కూడా దాటిపోతే మాత్రం 2017 మార్చి 31లోగా 5,000 రూపాయల జరిమానాతో రిటర్న్ దాఖలు చేసే వెసులుబాటు ఉంది. కాకపోతే ఆలస్యానికి గల కారణాన్ని దానిపై స్పష్టంగా రాయాల్సి ఉంటుంది. అయితే జరిమానా విధించడం అసెస్‌మెంట్ అధికారి విచక్షణాధికారానికి లోబడి ఉంటుంది. అన్ని పన్నులు సక్రమంగా చెల్లించి ఉంటే అసెస్‌మెంట్ అధికారుల జరిమానా విధించకపోయే అవకాశం కూడా ఉంటుంది.

ఐటీ రిటర్న్‌లు దాఖలు చేయలేదా?
మొదటి గడువు దాటి రిటర్న్‌లు దాఖలు చేసినప్పటికీ సరైన సమయంలో రిటర్న్‌లు దాఖలు చేసిన వారితో పోల్చితే కొన్ని ప్రాథమిక హక్కులు కోల్పోతారు. ముఖ్యంగా గడువు లోగా రిటర్న్ దాఖలు చేసిన వారికి పై ఏడాది మార్చి 31వ తేదీ లోగా లేదా రిటర్న్ అసె్‌సమెంట్ పూర్తయ్యేలోగా ఎన్నిసార్లైనా దానిలో సవరణలు చేసుకునే అవకాశం ఉంటుంది.

ఐటీ రిటర్న్‌లు దాఖలు చేయలేదా?
పన్ను రాయితీలు, మినహాయింపులేవైనా పాత రిటర్న్‌లో క్లెయిమ్ చేసుకోలేకపోయి ఉంటే సవరణల్లో అవి క్లెయిమ్ చేసుకోవచ్చు. రిటర్న్‌లో పొరపాట్లు ఏవైనా దొర్లినా వాటిని దిద్దుకోవచ్చు. కాని ఆలస్యంగా రిటర్న్ దాఖలు చేస్తే ఆ వెసులుబాటు కోల్పోవాల్సి వస్తుంది.

ఐటీ రిటర్న్‌లు దాఖలు చేయలేదా?
గడువులోగా రిటర్న్ దాఖలు చేసిన వారు పెట్టుబడులపై స్వల్పకాలిక, దీర్ఘకాలిక నష్టాలేవైనా వాటిల్లినా వాటిని భవిష్యత్తులో ఆర్జించే ప్టెబడి లాభాల్లో సర్దుబాటు చేసుకునే వీలుంటుంది. రాబోయే ఎనిమిది ఆర్థిక సంవత్సరాల వరకు ఇలాంటి సర్దుబాటు అవకాశం ఉంది.

ఐటీ రిటర్న్‌లు దాఖలు చేయలేదా?
ఉదాహరణకి 2014-15లో ఇలాంటి నష్టాలేవైనా ఏర్పడి ఉండే 2022-23 ఆర్థిక సంవత్సరంలో దాఖలు చేసే రిటర్న్ వరకు వీటిని సద్దుబాటు చేసుకోవచ్చు. ఆలస్యంగా రిటర్న్ దాఖలు చేసిన వారికి ఈ ప్రయోజనం కూడా వర్తించదు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications