ముంబై: ఆదాయ పన్ను రిటర్న్(ఐటీఆర్)ల ఈ ఫైలింగ్ ప్రకియను మరింత సులభం చేసేందుకు కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) యోచిస్తోంది. ఇందు కోసం ముందుగానే పూర్తి చేసిన రిటర్న్ దరఖాస్తులను జారీ చేయాలని అనుకుంటోంది.
దీని అర్ధం ఏమిటంటే పన్ను చెల్లింపుదారుకు చెందిన గణాంకాలు ఆటోమేటిక్‌గా అప్‌లోడ్ అవుతాయి. వచ్చే ఆర్ధిక సంవత్సరం నుంచి వినియోగదారుకు మరింత స్నేహపూర్వకంగా ఉండే ఈ చర్యలను అమల్లోకి తీసుకురావాలని సిబీడీటీ భావిస్తోంది.

ఈ-ఫైలింగ్ మరింత ఈజీ: ముందే నింపిన ఫారాలు
ఎప్పటికప్పుడు టెక్నాలజీని ఉపయోగించుకుని మెరుగులు దిద్దుతున్న సీబీడీటీ గత ఆగస్టులో కొత్త ఈ-ఫైలింగ్ విధానాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దీని ద్వారా ఆధార్ సంఖ్య లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా ఏటీఎమ్ ద్వారా ఆన్‌లైన్‌లోనే తనిఖీ చేయడం ద్వారా రిటర్నుల రసీదును బెంగుళూరులోని సీపీపీకి పంపించాల్సిన అవసరం లేదు.

ఈ-ఫైలింగ్ మరింత ఈజీ: ముందే నింపిన ఫారాలు
ఐటీఆర్ దరఖాస్తులో ముందస్తుగానే నింపే గళ్ల సంఖ్యను పెంచే అవకాశాన్ని పరిశీలిస్తున్నామని సీబీడీటీ ఛైర్‌పర్సన్ అనితా కపూర్ పేర్కొన్నారు. అది పన్ను చెల్లింపుదారులకు మరింత సులువుగా ఈ ఫైలింగ్ చేయడానికి ఉపకరిస్తుందన్నారు.

ఈ-ఫైలింగ్ మరింత ఈజీ: ముందే నింపిన ఫారాలు
టెక్నాలజీ అభివృద్ధి చెందే కొద్దీ పన్ను చెల్లింపుదార్లకు మరిన్ని వెసులుబాటు కల్పిస్తున్నామని చెప్పారు. అదే సమయంలో ముందస్తుగా నింపే ఈ గళ్లను పన్ను చెల్లింపుదారు మార్పు చేసుకునే అవకాశం కూడా ఉందన్నారు.

ఈ-ఫైలింగ్ మరింత ఈజీ: ముందే నింపిన ఫారాలు
ఐటీఆర్ ఫైలింగ్ సులువుగా, త్వరగా అందుతోందన్నారు. గతేడాది 1.63 కోట్ల రిటర్నుల ఆన్‌లైన్‌లో దాఖలు చేయగా, ఈ ఏడాది 26.12 శాతం ఎక్కువగా 2.06 కోట్ల రిటర్నులు ఈ ఫైలింగ్ వెబ్ సైట్ ద్వారా ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగానికి చేరాయని తెలిపారు.


Click it and Unblock the Notifications