పన్ను చెల్లింపుదారులకు శుభవార్త. ఇకపై 7 నుంచి 10 రోజుల్లో వ్యవధిలోనే ఇన్‌కమ్ ట్యాక్స్ రిఫండ్స్ చేతికి అందనుంది. సరికొత్త టెక్నాలజీని వినియోగించడం ద్వారా ఇమ్‌కమ్ టాక్స్ రిఫండ్స్‌ను తక్కువ కాలంలోనే పన్ను చెల్లింపుదారులకు అందజేసే అవకాశం ఏర్పడనుంది. దీని వల్ల టాక్స్ రిఫండ్స్ కోసం నెలల తరబడి ఎదురు చూసే తిప్పలు తప్పనున్నాయి.
ఆధార్ సంఖ్య, బ్యాంకు ఖాతా, ఆన్‌లైన్‌లో దాఖలైన ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్)లను పరిశీలించి, అర్హులైన వారికి 7-10 రోజుల్లోనే రిఫండ్ ఇస్తున్నట్లు ఆదాయపు పన్ను శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
గతంలో ఆదాయపు పన్ను శాఖ నుంచి రిఫండ్ అందాలంటే కొన్ని నెలల సమయం పట్టేది. ఐటీఆర్‌ల పరిశీలన కోసమే బెంగుళూరులోని సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్‌లో కొందరు అధికారులను నియమించి, ప్రక్రియను వేగవంతం చేసేవారు.

వారం రోజుల్లో ట్యాక్స్ రిఫండ్: ఆధార్ వల్లే
అయితే తాజాగా, ఆధార్ కార్డు లేదా బ్యాంకు డేటా బేస్ ఆధారంగా ఆదాయం పన్ను రిటర్ను (ఐటిఆర్)ను పరిశీలించే విధానాన్ని ఆదాయం పన్ను శాఖ అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. దీని మూలంగా టాక్స్ రిటర్నులను ప్రాసెస్ చేయడంతోపాటు బ్యాంకు ఖాతాలకు రిఫండ్స్‌ను పంపడానికి 15 రోజులకన్నా తక్కువ సమయం పడుతోంది.

వారం రోజుల్లో ట్యాక్స్ రిఫండ్: ఆధార్ వల్లే
ఇప్పటి వరకూ ఐటీ రిఫండ్లకు నెలల వ్యవధి, మరికొన్ని కేసుల్లో అయితే సంవత్సరాలు కూడా పడుతుండటంతో ఎలక్ర్టానిక్ విధానంలో ఇ-ఫైలింగ్ వెరిఫికేషన్ వ్యవస్థ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఐటీ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

వారం రోజుల్లో ట్యాక్స్ రిఫండ్: ఆధార్ వల్లే
దీంతో రానున్న వారం రోజులు లేదా గరిష్ఠంగా పది రోజుల్లోనే రిఫండ్స్ ఇచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. సెప్టెంబర్ 7 నాటికి వ్యక్తిగత పన్ను చెల్లింపుదార్లు 2.06 కోట్ల మంది ఆన్ లైన్‌లో ఆదాయాపు పన్ను రిటర్నులు దాఖలు చేశారని ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది.

వారం రోజుల్లో ట్యాక్స్ రిఫండ్: ఆధార్ వల్లే
గతేడాది ఇదే సమయంలో 1.63 కోట్ల మంది ఐటీ రిటర్ను దాఖలు చేశారు. గతేడాదితో పోలిస్తే 26.12 శాతం పెరిగి 2.06 కోట్లకు చేరుకున్నట్లు ఐటీ శాఖ వెల్లడించింది. వీటిల్లో 2015-16 సంవత్సరాగనికి గాను 45.18 లక్షల రిటర్న్‌లను బెంగుళూరులోని సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్ (సీపీసీ) పరిష్కరించి, 22.14 లక్షల మందికి రిఫండ్‌లు కూడా అందించిందని ఆర్ధిక శాఖ వెల్లడించింది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications