ఆన్‌లైన్‌లో పన్ను రిటర్నుల దాఖలు(ఈ-ఫైలింగ్) ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు ఐటీశాఖ కొత్త పద్ధతిని ప్రవేశపెట్టింది. (ఐటీఆర్)లు ఆన్ లైన్‌లో దాఖలు చేసిన వారు, మళ్లీ అకనాలెడ్జ్‌మెంట్‌ను పోస్టు ద్వారా బెంగుళూరులోని ఆదాయపు పన్ను శాఖ సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్ (సీపీసీ)కి పంపించాల్సి వస్తోంది.
ఇకపై రూ. 5 లక్షల వరకు వార్షికాదాయం కలిగి, రిఫండ్ కోరని వారు, కాగితం ధ్రువీకరణ (ఐటీఆర్) పంపాల్సిన అవసరం లేకుండా వన్‌టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ) ఆధారిత ఈ ఫైలింగ్ ను ఇన్‌కమ్ ట్యాక్స్ శాఖ ప్రారంభించింది.
ఈ వన్‌టైం పాస్‌వర్డ్ (ఓటీపీ) ఆధారిత ఈ-ఫైలింగ్‌ను మొబైల్ నంబర్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఆధార్ నంబర్, ఏటీఎం లేదా ఈ-మెయిల్ ద్వారా ఈ పాస్‌వర్డ్‌ను యాక్సెస్ చేయవచ్చు. అయితే ఓటీపీతో ఐటీఆర్ అవకాశం అందరికీ వర్తించదు. దరఖాస్తుదారు వ్వవహారాలు, ఖాతాను బట్టి, ప్రతి ఒక్కరికీ ఇది మారుతుంది.

ఆన్‌లైన్: ఈ ఫైలింగ్‌కు వన్‌టైమ్ పాస్‌వర్డ్
ఈ-ఫైలింగ్ చేసే వారు అందుకు రుజువుగా ఆదాయం పన్ను శాఖకు బెంగళూరులో ఉన్న సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్‌కు సంతకంతో కూడిన ఐటీఆర్-5ని రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపాల్సి ఉంటుంది. ఐటీ శాఖకు చెందిన సర్వోన్నత నిర్ణయాధికార మండలి ప్రత్యక్ష పన్నుల కేంద్రీయ బోర్డు(సీబీడీటీ) సోమవారం విడుదల చేసింది.

ఆన్‌లైన్: ఈ ఫైలింగ్‌కు వన్‌టైమ్ పాస్‌వర్డ్
నోటిఫికేషన్ ప్రకారం రూ.5 లక్షలు లేదా అంతకంటే తక్కువ ఆదాయం కలిగినవారు, రీ-ఫండ్ క్లెయిమ్ అవసరం లేనివారు ఈ-ఫైలింగ్ కోసం ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ కోడ్‌ను(ఈవీసీ) జనరేట్ చేసుకోవచ్చు. వారి ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్‌ను(ఐటీఆర్) ఐటీ శాఖ వద్ద రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నంబర్ లేదా ఈ-మెయిల్ ద్వారా చెల్లుబాటు చేసుకునేందుకు వీలుంటుంది.

ఆన్‌లైన్: ఈ ఫైలింగ్‌కు వన్‌టైమ్ పాస్‌వర్డ్
అయితే రూ.5 లక్షల వరకు ఆదాయం కలిగిన వారిలోనూ వన్‌టైం పాస్‌వర్డ్ వసతిని ఉపయోగించుకునే విషయంలో షరతులు వర్తిస్తాయి. పన్ను చెల్లింపుదారుల పాన్ నంబర్, గత చరిత్ర ఆధారంగా షరతులు వర్తిస్తాయా లేదా అనే అంశాన్ని ఐటీ శాఖ నిర్ణయించనున్నది.

ఆన్‌లైన్: ఈ ఫైలింగ్‌కు వన్‌టైమ్ పాస్‌వర్డ్
రిస్క్ ఎక్కువని ఐటీ శాఖ భావిస్తున్న పన్ను చెల్లింపుదారులు మొబైల్, ఈ-మెయిల్ ద్వారా కాకుండా ఆధార్ డేటాబేస్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం ద్వారా పాస్‌వర్డ్‌ను యాక్సెస్ చేయాల్సి ఉంటుందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ వసతిని యాక్టివేట్ చేసుకున్నవారికి పంపించే పాస్‌వర్డ్ 72 గంటలపాటు చెల్లుబాటవుతుంది.

ఆన్‌లైన్: ఈ ఫైలింగ్‌కు వన్‌టైమ్ పాస్‌వర్డ్
కానీ ఆధార్ ఆధారిత వెరిఫికేషన్ ప్రక్రియలో మాత్రం యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) వద్ద నమోదు చేసుకున్న మొబైల్ నంబర్‌కు మాత్రమే పాస్‌వర్డ్‌ను పంపడం జరుగుతుందని, అదికూడా 10 నిమిషాలు లేదా యూఐడీఏఐ నిర్దేశించిన సమయం పాటు మాత్రమే చెల్లుబాటవుతుందని ఐటీ శాఖ తెలిపింది.

ఆన్‌లైన్: ఈ ఫైలింగ్‌కు వన్‌టైమ్ పాస్‌వర్డ్
అదే ఏటీఎం ద్వారా బ్యాంకింగ్ కార్యకలాపాలు జరిపేవారు తమ ఏటీఎం పిన్ ద్వారా పాస్‌వర్డ్‌ను పొందవచ్చు. వన్‌టైం పాస్‌వర్డ్ పది అంకెల అల్ఫా న్యూమరిక్ అని, దీన్ని ఈ-ఫైలింగ్ సమయంలో పన్ను చెల్లింపుదారులు రిటర్నులో పొందుపర్చాల్సి ఉంటుందని ఐటీ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది.

ఆన్‌లైన్: ఈ ఫైలింగ్‌కు వన్‌టైమ్ పాస్‌వర్డ్
మదింపు సంవత్సరం, ఫైలింగ్ టైపు(ఒరిజినల్ లేదా రివైజ్డ్) అంశంతో సంబంధం లేకుండా ఒక పాస్‌వర్డ్ ఒక రిటర్ను దాఖలును ధ్రువపర్చేందుకు ఉపయోగపడుతుంది. పన్ను చెల్లింపుదారులు పలు మార్గాల్లో, పలు మార్లు పాస్‌వర్డ్ పొందవచ్చు. మదింపుదారులు https://incometaxindiaefiling.gov.in లోకి లాగిన్ కావడం ద్వారా రిటర్నులు దాఖలు చేయవచ్చు.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..



Click it and Unblock the Notifications