ఉద్యోగం డబ్బు సంపాదించడానికేనా? (ఫోటోలు)
సమాజంలో బ్రతికేందుకు, మన కనీస అవసరాలు తీరాలంటే డబ్బు కావాలి. అయితే ఈ డబ్బు సంపాదించేందుకు అనేక మార్గాలున్నాయి. అందులో ఒక మార్గం ఉద్యోగం. ఉద్యోగం అనేది డబ్బుసంపాదనకేనా? అంటే కొంత మంది అవునని, మరికొంత మంది కాదని చెబుతున్నారు.
మన దేశంలో డబ్బు కోసం పని చేస్తున్న ఉద్యోగుల కన్నా పనిని ప్రేమించి ఇష్టంతో ఉద్యోగాలు చేస్తున్న వారే ఎక్కువ మంది ఉన్నారంట. ఆన్‌లైన్ జాబ్ పోర్టల్ మోనిస్టర్ డాట్ కామ్ నిర్వహించిన సర్వేలో ఈ విషయం బయటపడింది. ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 17 శాతం మంది తాము డబ్బు కోసమే ఉద్యోగాలు చేస్తున్నట్లు తెలిపారు.
మిగతా 73 శాతం మంది మాత్రం ఉద్యోగంపైన ఇష్టంతో చేస్టున్నట్టు చెప్పారని ఆ సంస్ధ ఒక నివేదికలో తెలిపింది. ఈ విషయంపై మోనిస్టర్ డాట్ కామ్ ఎండీ సంజమ్ మోడీ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో ఉద్యోగుల్లో రెండు రకాల ధోరణులున్నాయని, డబ్బు సంపాదనపై ఆసక్తి కొందరిది కాగా ఇష్టంతో పని చేస్తున్న వారు రెండో రకానికి చెందిన వారని అన్నారు.
ఈ విషయమై తాము సర్వే నిర్వహించగా 17 శాతం మంది మాత్రమే తాము డబ్బు కోసమే ఉద్యోగాలు చేస్తున్నట్టు చెప్పారని ఆయన పేర్కొన్నారు. ఇది ఇలా ఉంటే చదువుకు సంబంధించిన ఉద్యోగం చేస్తున్నారా అన్న ప్రశ్నకు 56 శాతం మంది కాదు అని తెలపగా, 13 శాతం మంది మాత్రమే అవునని సమాధానం చెప్పారు.

ఉద్యోగం డబ్బు సంపాదించడానికేనా?

Click it and Unblock the Notifications