భారత్‌లో మొబైల్ వినియోగించే వారి సంఖ్య భారీగా పెరిగింది. ఇటీవల కాలంలో చెల్లింపులన్నీ ఆన్‌లైన్‌లో మొబైల్ ద్వారా జరుపుతున్నారు. ఈ క్రమంలో మొబైల్ లావాదేవీల్లో వినియోగదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోందని ఒక నివేదిక తెలిపింది.
దాదాపు 53 శాంతం మంది ఎమ్ఎఫ్ఎస్ లావాదేవీలపై సందేహం వ్యక్తం చేసినట్లు అమెరికాకు చెందిన పరిశోధన సంస్ధలు ఓవమ్-యామ్‌డాక్ విడుదల చేసిన నివేదిక పేర్కొంది. అంతేకాదు భారత్, ఫిలిప్పిన్స్, ఇండోనేషియా వంటి అధిక జనాభా ఉన్న దేశాల్లో చాలా మందికి బ్యాంకు ఖాతాలే లేవని వెల్లడించింది.
ఇటీవల కాలంలో మధ్యతరగతి కుటుంబాల్లో నగదు బదిలీ, ఆన్‌లైన్ షాపింగ్, బిల్లుల చెల్లింపు, సులభతరమైన ఆర్ధిక సేవలు కోరుకుంటున్నారని యామ్‌డాక్ సేల్స్ విభాగ అధిపతి శరత్ దోర్బాలా వివరించారు. ప్రాథమిక బ్యాంకింగ్ సేవలు అందించడంతో పాటు, సులభంగా చెల్లింపులు జరిపేలా చర్యలు చేపట్టాలని ఆయన పేర్కొన్నారు.

ముఖ్యంగా మీ వ్యక్తిగత వివరాలు, అంటే బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఆన్‌లైన్ బ్యాకింగ్ లావాదేవీల వివరాలు, క్రెడిట్ కార్డ్ వివరాలు ఇంకా ఇతర ఆర్ధిక లావాదేవీలకు సంబంధించిన వివరాలను ఫోన్‌లో స్టోర్‌చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచన చేయండి. అలానే, మీ ఆన్‌లైన్ అకౌంట్‌లను ప్రతిసారీ సైన్ అవుట్ చేయటం మరవద్దు.
మీ మొబైల్ డివైజ్ నుంచి ప్రతి 3 నెలలకు బ్యాకప్ తీసుకోండి. మీ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ఇన్స్యూరెన్స్ ను ప్రతి సంవత్సరం రిన్యువల్ చేసుకోవడం మరవద్దు. తరచూ స్కానింగ్ చేయండి. ట్రాకింగ్ సర్వీసులు, రికవరీ అప్లికేషన్ లను ఎనేబుల్ చేసి ఉంచినట్లయితే మి మొబైల్ డివైస్ మరింత సురక్షితంగా ఉన్నట్లే. మీరు వాడే అకౌంట్లకు సంబంధించి తరచూ పాస్‌వర్డ్‌లను మార్చుకోండి.
మార్చిన పాస్‌వర్డ్‌లను బండగా గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా మీరు వాడే ఇంటర్నెట్ బ్రౌజర్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోండి. యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌లను ఎప్పటికప్పుడు నిక్సిప్తం చేసుకోండి. బ్లూటూత్, వై-ఫై వంటి కనెక్టువిటీ ఆప్షన్‌లను అవసరమైన సమయంలో మాత్రమే ఆన్‌చేసి వాడుకోండి.
మొబైల్ బ్యాంకింగ్ వల్ల ప్రయోజనాలు:
ఖాతా వివరాలు ఎక్కడైనా, ఎప్పుడైనా తెలుసుకోవచ్చు. మొబైల్ బ్యాంకింగ్ వినియోగదారులకు వెబ్ బ్రౌజర్లతో పనిలేదు. ఎంపిన్ (మొబైల్ పిన్ నంబర్), ఓటీపీ (వన్‌టైమ్ పాస్‌వర్డ్) ఫీచర్లతో లావాదేవీలు సురక్షితంగా జరుపుకోవచ్చు. ఫోన్ పోయిన పక్షంలో వెంటనే బ్యాంకు లేదా మొబైల్ ఆపరేటర్‌కు సమాచారం ఇవ్వాలి. ఫోన్ పోగొట్టుకున్నా, లేదా అది దొంగతనానికి గురైనా మొబైల్ ఆపరేటర్ లావాదేవీలు చేయకుండా అరికట్టవచ్చు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications