బెంగుళూరు: నే షనల్ పే మెంట్స్ కార్పొరేషన్(ఎన్‌పిసిఎల్) ఇటీవలే ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రూపే కార్డు అంతర్జాతీయ పేమెంట్ దిగ్గజాలైన వీసా, మాస్టర్ కార్డులతో తలపడేందుకు రంగం సిధ్దమైంది. రూపే కార్డు అనేది మన దేశీయ పేమెంట్ గేట్ వే.
ఇది మన దేశీయ విపణిలోకి రానంత వరకు భారత ప్రజలకు వీసా కార్డు, మాస్టర్ కార్డులే దిక్కు. ఈ రూపే కార్డు రాకతో దేశీయ పేమెంట్ గేట్‌వే మరింత చౌక ధరలకు కస్టమర్లకు అందుబాటులోకి వచ్చింది. దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, కొన్ని ప్రైవేటు బ్యాంకులు కూడా రూపే కార్డులు జారీ చేస్తున్నాయి.
ఈ రూపే కార్డులకు మరింత ప్రాచుర్యం కల్పించి, అంతర్జాతీయ పేమెంట్ దిగ్గజాలైన వీసా, మాస్టర్ కార్డులకు గట్టి పోటీ ఇచ్చే లక్ష్యంతో ఇప్పుడు రూపే కార్డును ఉపయోగించి చేసే కొనుగోళ్లన్నింటిపైనా కస్టమర్లకు ఒక శాతం నగదు వాపస్ ఇవ్వనున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది.

దీంతో రూపే కార్డును ఉపయోగించి దేశంలోని ఎటిఎంలు, పాయింట్ ఆఫ్ సేల్స్, ఆన్‌లైన్ లావాదేవీలు ఏవి నిర్వహించినా ఆ లావాదేవీ మొత్తంలో ఒక శాతం మొత్తాన్ని ప్రోత్సాహకంగా కస్టమర్ అకౌంట్‌కు వాపస్ చేయనున్నారు.
రూపే కార్డు అంతర్జాతీయ ఇవిఎం (యూరోపే, వీసా, మాస్టర్ కార్డ్) ప్రమాణాలకు దీటుగా చిప్ టెక్నాలజీతోనే మార్కెట్‌లోకి వచ్చింది.
కేంద్ర ప్రభుత్వానికి కలిగే ప్రయోజనాలు: రూపే కార్డు ప్రాసెసింగ్ మన దేశంలోనే జరుగుతుంది కాబట్టి, ప్రాసెసింగ్ వ్యయాలు తగ్గడంతో పాటు, చాలా త్వరగా పూర్తవుతాయి. ఈ కార్డు ద్వారా ఆర్థిక లావాదేవీల క్లియరింగ్, సెటిల్‌మెంట్ నిర్వహిస్తే, బ్యాంకులు చెల్లించాల్సిన ఫీజులో 40 శాతం మేర తగ్గుతుంది. ఆన్‌లైన్‌లో రూపే కార్డుల వాడకాన్ని మరింత సురక్షితం చేస్తూ గత ఏడాది జూన్‌లో ఎన్‌పిసిఐ పే సెక్యూర్‌ను ప్రారంభించింది.
ఆన్‌లైన్ షాపింగ్, ఆన్‌లైన్‌లో లావాదేవీలు నిర్వహించే సమయంలో క్రెడిట్, డెబిట్ కార్డు వివరాలు గోప్యంగా ఉంచేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఎటిఎంలో ఉపయోగించే పిన్ నెంబర్‌తోనే రూపే కార్డు ఆన్‌లైన్ లావాదేవీలు నిర్వహించవచ్చు. ఎటిఎం లావాదేవీలు నిర్వహించుకోవడానికి వీలుగా బ్యాంకులు రూపే ప్లాట్‌ఫాంపై కిసాన్ క్రెడిట్ కార్డులు జారీ చేస్తున్నాయి.
కిసాన్ కార్డుల కింద రైతులు పొందిన మొత్తం వ్యవసాయ రుణాన్ని ఒక్కసారిగా కాకుండా, అవసరాలకు అనుగుణంగా వివిధ దశల్లో విత్‌డ్రా చేసుకునే అవకాశాన్ని ఈ కార్డులు కల్పిస్తున్నాయి. దీని ఫలితంగా రైతులకు అనవసర వడ్డీ భారం తప్పుతుంది. దేశవ్యాప్తంగా 1.6 లక్షల పైగా ఎటిఎంల్లో, 9.45 లక్షల పైగా పాయింట్ ఆఫ్ సేల్స్‌లో, 10,000 ఆన్‌లైన్ వేదికల్లో రూపే కార్డుని వినియోగించవచ్చు.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications