మరణించిన వ్యక్తి ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడం ఎలా?
మరణించిన వ్యక్తి స్ధానంలో ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైల్ చేయాలంటే లీగల్ వారసుడు రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ఇన్‌కమ్ ట్యాక్స్ చట్ట ప్రకారం మరణించిన వ్యక్తి యొక్క పన్ను బకాయిలు, ఆదాయం పన్ను రిటర్న్ దాఖలు చేయాలంటే చట్టపరమైన ప్రతినిధి లేదా కార్యనిర్వాహణాధికారి ఉండాలి.
మరణించిన వ్యక్తికి రీఫండ్ రూపంలో రిటర్న్‌లు రావాల్సి ఉండే అవి చట్టపరమైన ప్రతినిధి లేదా కార్యనిర్వాహణాధికారి బ్యాంకు అకౌంట్లలో జమ అయ్యేందుకు ఎలాంటి పద్ధతిని అవలంభించాలో పాఠకులకు ప్రత్యేకంగా అందిస్తున్నాం.

లీగల్ వారసుడు నమోదుకు ఈ కింది దశలను చేస్తే సరి:
స్టెప్ 1: ఈ ఫైలింగ్ సైట్ (https://incometaxindiaefiling.gov.in/) లోకి లాగిన్ అవ్వాలి.
స్టెప్ 2: మీ అకౌంట్‌పై క్లిక్ చేయాలి.
పాన్ కార్డు, పుట్టినరోజు, ఇంటి పేరు, మొదటి పేరులతో పాటు మరణధృవీకరణ పత్రం లాంటి అవసరమైన వివరాలను జత చేయాలి.
స్టెప్ 3: 1 ఎమ్‌బికి తక్కువగా ఉండే విధంగా జిప్ పైల్‌ను అప్‌లోడ్ చేయాలి. ఈ క్రింది సర్టిఫికెట్స్‌ను జత చేయాలి.
* మరణ ధృవీకరణ పత్రం
* చనిపోయిన వ్యక్తి యొక్క పాన్ కార్డు
* లీగల్ వారసుడి పాన్ కార్డు సంతకంతో కూడినది
* లీగల్ వారసుడి ఎవరు అనేది సూచించే పత్రం
* నోటరీ పబ్లిక్‌తో కూడిన అఫిడవిట్
పైన పేర్కొన్న సర్టిఫికెట్స్‌లో ఏదో ఒకటి లీగల్ వారసుడిని గుర్తించే పత్రంగా ఉపయోగించవచ్చు.
* లీగల్ వారసుడి సర్టిఫికెట్‌ను కోర్టు ఇస్తుంది.
* లోకల్ రెవిన్యూ అధికారులు కూడా ఇచ్చే అధికారం ఉంది.
స్టెప్ 4 : సబ్‌మిట్‌పై క్లిక్ చేయండి. మీ అభ్యర్దన ఇ-ఫైలింగ్ పంపబడుతుంది.
స్టెప్ 5: మీరు అభ్యర్ధనను ఇ-ఫైలింగ్ అధికారి సమీక్ష చేసి ఆమోదించడానికి వీలుందా లేదా అనేది పరిశీలించి ధృవీకరిస్తారు.


Click it and Unblock the Notifications