పన్ను ఆదా: ఫిక్సడ్ డిపాజిట్లపై తెలుసుకోవాల్సినవి (ఫోటోలు)
న్యూఢిల్లీ: మార్చి వచ్చిదంటే చాలు. అందరి దృష్టి పన్ను ఆదా చేసుకోవడంపైనే ఉంటుంది. వాస్తవానికి పన్ను ఆదా కోసం పెట్టుబడి చేయడం అనేది ముందు నుంచే చేయాల్సిన పని. కానీ చివరి నిమిషంలో పరుగులు తీస్తూ ఉంటారు. బ్యాంకులకు సంబంధించిన కొన్ని ఫిక్సడ్ డిపాజిట్లు ఆదాయ పన్ను చట్ట ప్రకారం సెక్షన్ 80సి కింద వస్తాయి.
ఆ సెక్షన్‌లో పెట్టుబడులకు పన్ను మినహాయింపు లభిస్తుండటంతో అవేంటో తెలుసుకుందాం. పన్ను ఆదా చేసుకోవడానికి గత కొన్ని సంవత్సరాలుగా బ్యాంకులు అందిస్తున్న కొన్ని ఫిక్సడ్ డిపాజిట్లు గురించి తెలుసుకుందాం.

బ్యాంకు ఫిక్సడ్ డిపాజిట్ ద్వారా పన్ను ఆదా
సెక్షన్ 80సి కింద బ్యాంకులో ఫిక్సడ్ డిపాజిట్లు ఇద్దరు సంయుక్తంగా కట్టినట్లైతే... కేవలం మొదటి వ్యక్తి మాత్రమే పన్ను ఆదా పొందగలుదుతాడు. రెండో వ్యక్తికి ఫిక్సడ్ డిజాపిట్ పథకం పన్ను ఆదా కిందకు వర్తించదు. కాబట్టి బ్యాంకులో ఫిక్సడ్ డిపాజిట్లు కట్టేటప్పుడు విడి విడిగా కట్టడం మంచింది.

సర్టిఫికెట్‌ను సరిచూసుకోవాలి
మీరు కట్టిన ఫిక్సడ్ డిపాజిట్ పన్ను ఆదా కిందకు వర్తిస్తుందో లేదో చూడాలి. కొన్ని సార్లు బ్యాంకుల తప్పిదాల వల్ల పన్ను ఆదా అవ్వనటుపంటి ఫిక్సడ్ డిపాజిట్ లోకి చేరుతుంది.

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్
ఇందులో చేసిన పెట్టుబడులపై మాత్రమే పన్ను మినహాయింపు ఉంటుంది. పెట్టుబడి పెట్టిన రాబడులపై పన్ను చెల్లించాలి. వడ్డీ రాబడులని తిరిగి మళ్లీ పెట్టుబడి పెడితే పన్ను మినహాయింపు లభిస్తుంది.

ఆటో స్వీప్
ఆటో స్వీప్ ఈ ఖాతాలు సేవింగ్స్ అకౌంట్‌కు లింక్ చేయడం సాధ్యం కాదు. కాబట్టి, మీరు మీ స్థిర డిపాజిట్ ఖాతా నుండి ఆటో స్వీప్ బ్యాంకు ఆశించకండి.

5 సంవత్సరాల ముందు డబ్బు ఉపసంహరించుకోవాలను కోవడం సాధ్యం కాదు
5 సంవత్సరాల కాలం మీరు కూడా అత్యవసర విషయంలో డబ్బు వెనక్కి కాదు. మొదటి హోల్డర్ మరణం తర్వాతనే మీరు ఆ డబ్బుని వెనక్కి తీసుకోవచ్చు.

పాన్ నెంబర్ చెక్ చేసుకోండి
ఫిక్సడ్ డిపాజిట్లపై కొన్ని బ్యాంకులు పాన్ నెంబర్‌ను ముద్రిస్తాయి. మరికొన్ని బ్యాంకులు పాన్ నెంబర్‌ను ముద్రించవు.


Click it and Unblock the Notifications