న్యూఢిల్లీ: సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేకంగా భారతదేశ ప్రభుత్వం కొన్ని పథకాలను కొన్నింటిని ప్రవేశపెట్టింది. వీటిని ప్రవేశపెట్టడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే ఈ పథకాలను అందించడం వల్ల వారు కొన్ని ప్రయోజనాలు పొందుతారు. ఇందులో పన్ను ప్రయోజనాలు, ప్రయాణ ప్రయోజనాలతో పాటు ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన సౌకర్యాలు ఉన్నాయి. సీనియర్ సిటిజన్స్‌కు సహాయం చెయ్యడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటో చూద్దాం.

ఇన్‌కమ్ టాక్స్
ఇన్‌కమ్ టాక్స్ చట్ట ప్రకారం సీనియర్ సిటిజన్స్ సంవత్సర ఆదాయం రూ 2.5 లక్షలుగా కలిగి ఉన్నారో వారు పన్ను పరిధి లోకి రారు. అదే సాధారణ సిటిజన్స్‌కు ఆదాయపు పన్ను పరిమితి రూ. 2 లక్షలు.

వడ్డీ రేట్లు
వడ్డీ రేట్ల విషయానికి వస్తే సాధారణ పౌరులతో పోల్చితే సీనియర్ పౌరులు డిపాజిట్ చేసిన డబ్బుకి ఎక్కువ వడ్డీని((up to 50 bps) బ్యాంకులు చెల్లిస్తున్నాయి. కొన్ని ప్రత్యేకమైన సందర్బాల్లో బ్యాంకుల్లో డబ్బుని డిపాజిట్ చేస్తే 0.50 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి.

టిడిఎస్
సాధారణంగా సిటిజన్స్ సంపాదించిన వడ్డీ ఆదాయంపై మరియు నిల్వలపై మూలం (TDS) తీసివేయబడుతుంది. ఐతే సీనియర్ సిటిజన్స్ మాత్రం Form 15H సమర్పించి పన్ను మినహాయింపు పొందవచ్చు.

ఇన్సూరెన్స్
80D విధానం క్రింద ఒక సీనియర్ సిటిజెన్ వైద్య భీమా కోసం చెల్లించే ప్రీమియం పరిమితి రూ 20,000 వరకు ఉండొచ్చు.

బిజినెస్
సీనియర్ సిటిజన్స్ సొంతంగా వ్యాపారం చేస్తుంటే వారు ముందుగా అడ్వాన్స్ టాక్స్ చెల్లించే అవసరం ఉండదు.

చాలా సీనియర్ సిటిజన్స్
80 సంవత్సరాల వయసు పైబడిన సీనియర్ సిటిజన్స్‌కు కేంద్ర ప్రభుత్వం రూ. 5,00,000 లక్షల ఇన్‌కమ్ టాక్స్ అధిక మినహాయింపు పన్ను పరిధిని కల్పించింది.

భారతీయ రైల్వేలు
సీనియర్ సిటిజన్స్ కోసం భారతీయ రైల్వేలో ఉన్న అన్ని రకాలైన రైళ్ల కోచ్‌లు మరియు ఏ తరగతులలోనైనా ప్రయాణించేందుకు అద్దెలో 30 శాతం రాయితీని అందిస్తుంది.


Click it and Unblock the Notifications