నేరుగా రంగంలోకి జగన్ - అనూహ్య నిర్ణయం..!!
మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా చోటు చేసుకుంటున్న ఘటనల పైన పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు. అంబటి రాంబాబు... జోగి రమేశ్ నివాసాల పైన జరిగిన దాడులు.. నేపథ్యం పైన చర్చించారు. ఇప్పటికే ఈ దాడుల పైన కేంద్ర హోం శాఖ ను ట్యాగ్ చేస్తూ జగన్ ట్వీట్ చేసారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పైన విమర్శలు చేసారు. కాగా,ఇప్పుడు జగన్ మరో నిర్ణయంతో సిద్దమయ్యారు.
మాజీ ముఖ్యమంత్రి జగన్ పార్టీ నేతలతో కీలక చర్చలు చేసారు. కొద్ది రోజులుగా చోటు చేసుకొంటు న్న పరిణామాల పైన చర్చించారు. అంబటి రాంబాబు, జోగి రమేశ్ నివాసాల పైన టీడీపీ కేడర్ దాడులను ఖండించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యంగా కీలక వ్యాఖ్యలు చేసారు. పార్టీ నేతలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను ఫోన్ లో పరామర్శించారు. జోగి రమేశ్ తోనూ మాట్లాడారు. ఇదే సమయంలో పార్టీ నేతలతో కీలక భేటీ ఏర్పాటు చేసారు. ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీ పరంగా ఎలాంటి కార్యాచరణ ఖరారు చేయాల నే అంశం పైన చర్చించనున్నారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండటంతో కేంద్రా నికి ఎంపీలతో ఫిర్యాదు చేయించాలని డిసైడ్ అయ్యారు. దాడులకు నిరసనగా పార్టీ పరంగా నిరస న చేపట్టే ఆలోచనతో ఉన్నారు. దీని పైన పార్టీ నేతల సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు ముఖ్య నేతలతో సమావేశానికి జగన్ నిర్ణయించారు.
నాగబాబు పైన పవన్ సీరియస్, ఆ మీటింగ్స్ కు వెళ్లద్దు - ఆ ఇద్దరికీ ఘాటు హెచ్చరిక..!!

దాడుల పై నిరసన
కాగా, అంబటి రాంబాబు... జోగి రమేశ్ నివాసాలకు వెళ్లాలని జగన్ డిసైడ్ అయ్యారు. బుధవారం గుంటూరు కు వెళ్లనున్న జగన్ అంబటి రాంబాబు ఇంటిని పరిశీలిస్తారు. అంబటి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. ఇప్పటికే వారికి అండగా ఉంటానని జగన్ హామీ ఇచ్చారు. ఇక, అంబటి ప్రస్తుతం రాజమండ్రి జైలులో ఉన్నారు. ఇక.. మరో నేత జోగి రమేశ్ ఇంటికి జగన్ వెళ్లాలని నిర్ణయించారు. శుక్రవారం ఇబ్రహీంపట్నం లోని జోగి రమేశ్ ఇంటికి వెళ్లి జోగి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. వారికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇవ్వనున్నారు. వరుసగా వైసీపీ నేతల ఇళ్ల పైన జరిగిన దాడుల పై జగన్ కేంద్రానికి లేఖ రాయనున్నట్లు తెలుస్తోంది. పూర్తి ఆధారాలను జత చేస్తూ... కేంద్రానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక.. పార్టీ ముఖ్య నేతలతో భేటీ తరువాత ఈ దాడుల విషయంలో జగన్ కార్యాచరణ ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.
Credit: Oneindia


Click it and Unblock the Notifications