వియత్నాంకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ (VinFast), భారత టూ-వీలర్ మార్కెట్‌లో సరికొత్త విప్లవానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే తమిళనాడులోని తూత్తుకుడిలో భారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసిన ఈ సంస్థ, ఇప్పుడు ఒకేసారి 4 కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను పరిచయం చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. కేవలం స్కూటర్లను అమ్మడమే కాకుండా, ఛార్జింగ్ సమస్యకు పరిష్కారంగా దేశవ్యాప్తంగా భారీ బ్యాటరీ స్వాపింగ్ నెట్‌వర్క్‌ను కూడా సిద్ధం చేస్తోంది.
భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఛార్జింగ్ సమస్య. ఈ సమస్యకు చమరగీతం పాడుతూ విన్‌ఫాస్ట్ సంస్థ బ్యాటరీ స్వాపింగ్ (Battery Swapping) టెక్నాలజీతో ముందుకు వచ్చింది. అంటే, మీ స్కూటర్లో బ్యాటరీ అయిపోతే గంటల కొద్దీ ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం లేదు.

కేవలం విన్‌ఫాస్ట్ బ్యాటరీ స్టేషన్‌కు వెళ్లి, ఖాళీ బ్యాటరీని ఇచ్చేసి, ఫుల్ ఛార్జ్ ఉన్న బ్యాటరీని సెకన్ల వ్యవధిలో మార్చుకుని వెళ్లిపోవచ్చు. దీనికోసం కంపెనీ 2026 మొదటి త్రైమాసికంలోనే దేశవ్యాప్తంగా 34 ప్రధాన నగరాల్లో 45,000 బ్యాటరీ స్వాప్ క్యాబినెట్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
విన్‌ఫాస్ట్ ప్రవేశపెట్టిన ఈ 4 మోడళ్లలో ఒక్కొక్కటి ఒక్కో ప్రత్యేకతను కలిగి ఉంది. ఇందులో వైపర్ (Viper) అనేది ఫ్లాగ్‌షిప్ మోడల్. ఇది 3000 వాట్ల పవర్ ఫుల్ మోటార్‌తో వస్తుంది. ఇది గరిష్టంగా గంటకు 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. అలాగే బిలిజ్ 2 (Feliz II) కూడా అదే స్థాయి పవర్ కలిగి ఉండగా, ఇవో (Evo) మోడల్ 2450 వాట్ల మోటార్‌తో సిటీ ప్రయాణాలకు అనువుగా ఉంటుంది.
ఇవే కాకుండా లైసెన్స్ అవసరం లేని, తక్కువ వేగంతో వెళ్లే ఒక స్పెషల్ స్కూటర్ కూడా చిన్న పిల్లల కోసం లేదా తక్కువ దూరాలకు వెళ్లే వారి కోసం కంపెనీ తీసుకొస్తోంది. ఈ స్కూటర్లలో 1.5 kWh సామర్థ్యం గల రెండు LFP బ్యాటరీలను అమర్చారు. ఇవి అత్యంత సురక్షితమైనవి, వేడిని తట్టుకోగలవు.

రెండు బ్యాటరీలు ఫుల్ ఛార్జ్‌తో ఉంటే, ఇవో స్కూటర్ ఏకంగా 165 కిలోమీటర్ల రేంజ్‌ను ఇస్తుంది. వైపర్, బిలిజ్ 2 మోడళ్లు సుమారు 156 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తాయి. పెట్రోల్ బంకుల్లోనే ఈ బ్యాటరీ మార్పిడి కేంద్రాలను ఏర్పాటు చేయడం వల్ల కస్టమర్లకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది.
ఫీచర్ల విషయానికి వస్తే విన్‌ఫాస్ట్ ఎక్కడా తగ్గలేదు. ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ లైట్లు, లొకేషన్ ట్రాకింగ్, రిమోట్ సెర్చ్, దొంగతనం జరగకుండా యాంటీ-థెఫ్ట్ ప్రొటెక్షన్ వంటి ఆధునిక ఫీచర్లు ఎన్నో ఉన్నాయి.
వైపర్ మోడల్‌లో వెనుక వైపు డ్యూయల్ షాక్ అబ్జార్బర్లు ఉండటం వల్ల ప్రయాణం చాలా స్మూత్‌గా ఉంటుంది. స్మార్ట్ ఫోన్ ద్వారా కారును కంట్రోల్ చేసే Phone As A Key (PAAK) టెక్నాలజీని కూడా ఇందులో ప్రవేశపెట్టారు. మొత్తానికి ఓలా, ఏథర్, టీవీఎస్ వంటి సంస్థలకు విన్‌ఫాస్ట్ గట్టి పోటీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
Credit: Drivespark
More From GoodReturns

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్‌లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications