ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఫిబ్రవరి 14 వచ్చేస్తోంది. వాలెంటైన్స్ డేను తమకు ఇష్టమైన వ్యక్తితో మరింత ప్రత్యేకంగా జరుపుకోవడానికి ప్రేమికులంతా ఇప్పటికే సిద్ధమవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న జంటలు ఈ ఒక్క రోజు కోసం ఏడాది పొడవునా ఎదురుచూస్తుంటారు. తమ ప్రేమను మాటల్లోనే కాదు, గుర్తుండిపోయే విధంగా వ్యక్తం చేయాలనే ఆలోచనతో ఈ రోజును ఒక పెద్ద పండుగలా జరుపుకుంటారు. వాలెంటైన్స్ డే అంటేనే గిఫ్ట్‌ల హడావిడి. ప్రేమగా ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటూ, అవతలి వ్యక్తి ముఖంపై చిరునవ్వు తెప్పించాలనే తపన ప్రతి ఒక్కరిలో ఉంటుంది. చాక్లెట్లు, పూలు, కార్డులు వంటి సాధారణ గిఫ్ట్‌లకు బదులుగా, ఈసారి కొంచెం డిఫరెంట్‌గా, మహిళలకు స్కూటర్ అద్భుతమైన బహుమతిగా నిలుస్తుంది. గిఫ్ట్‌గా ఇవ్వడానికి ప్రస్తుతం మార్కెట్లోని టాప్ 3 స్కూటర్లను ఒకసారి చూద్దాం.
Suzuki Access 125: సుజుకి యాక్సెస్ 125 ఎక్స్-షోరూమ్ ధర రూ.78,184 నుంచి మొదలై, టాప్ వేరియంట్ అయిన రైడ్ కనెక్ట్ TFT ABS ధర రూ.98,378 వరకు ఉంటుంది. ఈ ధర రేంజ్‌లో ఇంత స్టైల్, టెక్నాలజీ, సేఫ్టీ కలయిక చాలా అరుదు అని చెప్పొచ్చు. ఇందులో ఉన్న 124 సిసి ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్ 8.4 హెచ్‌పి పవర్‌తో పాటు 10.2 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తుంది.
మైలేజ్ విషయానికి వస్తే, లీటర్‌కు సుమారు 45 కి.మీ ఇస్తుంది. టెక్నాలజీ పరంగా 4.2 అంగుళాల TFT డిజిటల్ డిస్‌ప్లేలో రైడ్ కనెక్ట్ ఫీచర్ ద్వారా స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ లభిస్తుంది. కాల్ అలర్ట్స్, మెసేజ్ నోటిఫికేషన్స్, నావిగేషన్ వంటి సమాచారం రైడ్ చేస్తూనే చూసే వీలుంటుంది. భద్రత విషయంలో స్కూటర్ ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. LED లైటింగ్, USB చార్జింగ్ పోర్ట్ వంటి ఫీచర్లు దీన్ని మరింత మోడ్రన్‌గా మారుస్తాయి

Honda Activa 125: హోండా యాక్టివా 125 అంటే భారత మార్కెట్లో నమ్మకానికి మరో పేరు. దీని ఎక్స్-షోరూమ్ ధరలు రూ.89,652 నుంచి ప్రారంభమై రూ.94,096 వరకు ఉంటాయి. ఇందులో ఉన్న 123.9 సిసి సామర్థ్యం గల సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్ 8.4 హెచ్‌పి పవర్‌తో పాటు 10.5 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మైలేజ్ పరంగా లీటర్‌కు 47 కి.మీ. వరకు అందిస్తుంది.
యాక్టివా 125ను హోండా పూర్తిగా ప్రీమియం లుక్‌తో తయారు చేసింది. కాల్, SMS అలర్ట్స్‌తో పాటు నావిగేషన్ సపోర్ట్ ఉన్న ఫీచర్ రైడ్ సౌలభ్యం ఇస్తుంది. పూర్తి LED లైటింగ్ సెటప్ కారణంగా రాత్రివేళల్లో కూడా మంచి విజిబిలిటీతో పాటు హై-ఎండ్ ఫీల్ కనిపిస్తుంది. హోండా రోడ్‌సింక్ యాప్ ద్వారా బ్లూటూత్ కనెక్టివిటీతో పనిచేసే 4.2 అంగుళాల TFT డిజిటల్ డిస్‌ప్లే రైడర్‌కు అవసరమైన అన్ని సమాచారాన్ని స్పష్టంగా చూపిస్తుంది.

TVS Jupiter 110: టీవీఎస్ జూపిటర్ విడుదలైనప్పటి నుంచే మహిళల్లో ఆదరణ పొందుతోంది. రోజూ ఆఫీస్‌కు వెళ్లడం, పిల్లలను స్కూల్‌కు తీసుకెళ్లడం లేదా మార్కెట్ పనుల కోసం తిరగడం వంటి సందర్భాల్లో ఇది బాగా ఉపయోగపడుతుంది. సాంప్రదాయ దుస్తులు ధరించినప్పటికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా స్కూటర్‌ను వాడుకునేలా జూపిటర్ 110 డిజైన్ చేయబడింది.దీని ప్రారంభ ధర రూ. 76,150 కాగా, టాప్ వేరియంట్ ధర రూ. 88,350 వరకు(ఎక్స్-షోరూమ్) ఉంటుంది.
ఈ స్కూటర్‌లో 113-సిసి సామర్థ్యం గల సింగిల్-సిలిండర్, 4-స్ట్రోక్ పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజిన్ 6,500 rpm వద్ద గరిష్టంగా 8.02 bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అలాగే, 5,000 rpm వద్ద 9.8 Nm పీక్ టార్క్‌ను అందించడంతో స్మూత్ రైడింగ్ అనుభవాన్ని ఇస్తుంది. 1 లీటర్ పెట్రోల్‌తో దాదాపు 50 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.

Credit: Drivespark
More From GoodReturns

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..



Click it and Unblock the Notifications