మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతుల తొలి సంతానం క్లీంకార పుట్టినరోజు సందర్భంగా వేణుస్వామి చెప్పిన జాతకం వివాదాస్పదంగా మారింది. రెండేళ్ల క్రితం పాప జాతకం, చిరంజీవి కుటుంబం, రామ్ చరణ్, ఉపాసనల రెంతో సంతానంపై గ్రహస్థితులను లెక్కకట్టి ఓ వీడియో చేశారు వేణుస్వామి. ఆ సందర్భంగా వారి జాతకంలో రెండో సంతానం లేదని తేల్చి చెప్పారు. అయితే ప్రస్తుతం ఉపాసన పండంటి కవలలకు జన్మనిచ్చారు. ఈ క్రమంలో వేణుస్వామి జ్యోతిష్యాన్ని బయటకు తీసి.. నెటిజన్లు తప్పుబడుతున్నారు. దాంతో వేణుస్వామి తాను చెప్పిన జాతకంపై యూటర్న్ తీసుకొన్నారు. ఇంతకు ప్రముఖ జ్యోతిష్కుడు తేల్చి చెప్పిన విషయంలోకి వెళితే..
Twins for Ram Charan: ఆయన దయ, కృప వల్లే మా ఇంట్లోకి కవలలు.. చిరంజీవి భావోద్వేగం
మెగాస్టార్ చిరంజీవికి మనవరాలు పుట్టింది. కొణిదెల వంశంలో లక్ష్మీదేవి పుట్టింది అంటున్నారు. ఆ పాప జాతకాన్ని విశ్లేషించే ప్రయత్నం చేస్తే.. అమ్మాయి పుట్టింది పునర్వసు నక్షత్రం రెండో పాదం మిథునరాశి. జన్మనామం కోణంగి. రామ్ చరణ్ గారిది రోహిణి, ఉపాసన గారిది కృత్తిక, పాపది పునర్వసు నక్షత్రం. ఆ లెక్కన రామ్ చరణ్ గారిది కృష్ణుడి నక్షత్రం, ఉపాసన గారిది అమ్మవారి నక్షత్రం, పాపది రాముడి నక్షత్రం. ఈ మూడు నక్షత్రాలు దేవతా అంశ కలిగినటువంటి నక్షత్రాలు. అలాంటి నక్షత్రాల్లో వీళ్లు పుట్టడం జరిగింది.

ఈ అమ్మాయి పుట్టడం వల్ల మెగా కుటుంబానికి ఎలా ఉండబోతోంది చూస్తే.. పాప జాతకంలో గురుచండాల యోగం, అలాగే విపరీత రాజయోగం కనిపిస్తోంది. చిరంజీవి గారికి ఉన్న యోగమో ఈ అమ్మాయికి ఉంది. ఈ అమ్మాయి జాతకం వల్ల చిరంజీవి గారి కుటుంబానికి, కొణిదెల వంశానికి విపరీత రాజయోగం పట్టే అవకాశం ఉంది. చిరంజీవి గారు, సురేఖ గారు, రామ్ చరణ్ గారు, ఉపాసన గారు, పాప ఈ ఐదుగురి గురించే మాట్లాడుతున్నా. ఈ ఐదుగురి జాతకంలో విపరీతమైన రాజయోగం కనిపిస్తోంది. చాలా అనుకూలంగా ఉండే అంశాలు ఉన్నాయి.
రామ్ చరణ్ - ఉపాసనలకు ట్విన్స్... కవల పిల్లల్లో పెద్ద ఎవరు? ముందు ఎవరు పుట్టారంటే?
పెరిగి పెద్ద అయిన తర్వాత ఈ పాప చరిత్ర సృష్టించే అవకాశం ఉంది. చిరంజీవిగారికి, రామ్ చరణ్ గారికి, ఉపాసన గారికి ఉన్నంత పేరుని మించి క్లీంకారకు ఉండే అవకాశం ఉంది. ఈ పాప జన్మించడం వల్ల తల్లిదండ్రులు, తాతకి అందరికీ కలిసొస్తుంది. చాలా రేర్‌గా ఉండే జాతకం ఇది. కాకపోతే ఈ అమ్మాయి జాతకంలో చిన్నచిన్న మైనస్‌లు ఉన్నాయి. పంటికి, చెవికి సంబంధించిన చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి అని అన్నారు.
భవిష్యత్‌లో రామ్ చరణ్ - ఉపాసనలకు ఇక సంతానం ఉండకపోవచ్చు. ఎందుకంటే గురుచండాల యోగం ఉంది. అలాగే శని గురువుని చూస్తున్నాడు కాబట్టి సింగిల్ చైల్డ్‌గా ఈ జాతకం కనిపిస్తోంది. అంటే ఒకే ఒక్క అమ్మాయి ఈ ఇంట్లో ఉండే అవకాశం ఉంది. చిరంజీవిగారి ఫ్యామిలీకి సంబంధించి భవిష్యత్తులో రామ్ చరణ్ గారికి మగ సంతానం ఉండకపోవచ్చు. మొత్తం మీద క్లీంకార జాతకాన్ని బట్టి పరిశీలిస్తే చిరంజీవి గారి ఇంట్లో లక్ష్మీదేవి జన్మించిందని చెప్పొచ్చు అని వేణుస్వామి విశ్లేషణ చేశారు.
అలాంటి లింక్ పెట్టి దారుణం... నా మీదపడి బతుకుతున్నారు... సురేఖవాణి కంటతడి
రామ్ చరణ్ - ఉపాసనలకు రెండో సంతానం ఉండదని వేణుస్వామి చెప్పగా.. ఆమె రెండోసారి గర్బం దాల్చి కవల పిల్లలు జన్మించారు. అలాగే రామ్ చరణ్ దంపతులకు మగ సంతానం ఉండదని వేణుస్వామి చెప్పగా కవలల్లో ఒక బాబు పుట్టాడు. దాంతో వేణుస్వామి జోస్యం రెండు రకాలుగానూ తప్పిందంటూ నెటిజన్లు, మెగా అభిమానులు ఆయనపై ట్రోలింగ్‌కు దిగారు.
మామూలు ఆటగాడు కాదు... సుధీర్‌తో జాగ్రత్త.. నటికి మహిళా నిర్మాత హెచ్చరిక
దీంతో వేణుస్వామి స్పందించినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. నేను ఎప్పుడూ జాతకం చూసి మాత్రమే మాట్లాడతానని.. గాలిలో మాటలు చెప్పనని అప్పట్లో క్లింకార జాతకం చూసినప్పుడు ఆమెకు బలమైన రాజయోగం ఉందని చెప్పాను. ఆ జాతకం ప్రకారం ఆమె తర్వాత మరో సంతానం యోగం స్పష్టంగా కనిపించలేదు. క్లింకార తర్వాత మరో బిడ్డ పుట్టే యోగం లేదు. ఒక్క సంతానమే ఉంటుందని చెప్పాను. నేను చూసిన జాతక ఆధారంగానే చెప్పిన మాట. కానీ ఇప్పుడు కవలలు.. బాబు పాప పుట్టారు ఆ మాటను వెనక్కి తీసుకుంటానని వేణుస్వామి వివరణ ఇచ్చినట్లుగా సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. మరి ఆయన నిజంగానే వివరణ ఇచ్చారో లేదో తెలియాలంటే వేణుస్వామి స్పందించాల్సిందే.
Credit: Filmibeat
More From GoodReturns

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..



Click it and Unblock the Notifications