భారతీయ కార్ల మార్కెట్లో గత కొన్నేళ్లుగా SUVలకు విపరీతమైన డిమాండ్ కనిపిస్తోంది. రోడ్ ప్రెజెన్స్, ఎత్తైన సీటింగ్ పొజిషన్ వంటి కారణాలతో SUVల వైపు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. అందుకే చిన్న SUVల నుంచి పెద్ద SUVల వరకు అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. చాలా మంది కారు కొనాలంటే ముందుగా SUVనే ఎంపికగా చూసే పరిస్థితి ఏర్పడింది. అయితే, ఈ SUV ట్రెండ్ మధ్య సెడాన్లకు ఫ్యాన్‌బేస్ మాత్రం తగ్గలేదు. సెడాన్ కార్లు అందించే సౌకర్యం, డ్రైవింగ్ స్టెబిలిటీ, మైలేజ్ వంటి అంశాలు చాలామందికి ఇష్టంగా ఉన్నాయి. మీరు ప్రస్తుతం కొత్త సెడాన్ కారు కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, మార్కెట్లో కొన్ని మంచి ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. టాటా టిగోర్, హ్యుందాయ్ ఆరా, హోండా సిటీ బెస్ట్ ఆప్షన్లుగా ఉన్నాయి. వాటి గురించి కింది కథణంలో.
Tata Tigor: టాటా టిగోర్ భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న ఒక ప్రారంభ స్థాయి సెడాన్ కారు. సరసమైన ధరలో మంచి ఫీచర్లు కావాలనుకునే వినియోగదారులకు ఇది మంచి ఎంపికగా నిలుస్తుంది. ఈ కారుకు కనీస ధర రూ. 5.49 లక్షలు కాగా, టాప్ వేరియంట్ ధర రూ. 8.74 లక్షల వరకు(ఎక్స్-షోరూమ్) ఉంటుంది. ఈ ధర శ్రేణిలో సెడాన్ కారు కావాలనుకునే వారికి టిగోర్ మంచి విలువను అందిస్తుంది.

ఇంజిన్ ఆప్షన్ల విషయంలో టాటా టిగోర్ రెండు ఎంపికలతో అందుబాటులో ఉంది. ఇందులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు 1.2 లీటర్ CNG ఇంజిన్ కూడా లభిస్తుంది. వినియోగదారులు తమ అవసరాలకు అనుగుణంగా పెట్రోల్ లేదా తక్కువ ఇంధన ఖర్చుతో నడిచే CNG వేరియంట్‌ను ఎంచుకోవచ్చు. మైలేజ్ పరంగా చూస్తే, ఈ కారు సుమారు 19 కిలోమీటర్ల నుంచి 28 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇవ్వగలదని కంపెనీ చెబుతోంది.
Hyundai Aura: హ్యుందాయ్ ఆరా ధర రూ. 5.98 లక్షల నుంచి రూ. 8.54 లక్షల వరకు(ఎక్స్-షోరూమ్) అందుబాటులో ఉంటుంది. ఈ ధరలో మంచి ఫీచర్లు, నమ్మకమైన బ్రాండ్ కావాలనుకునే వారికి ఇది ఆకర్షణీయమైన ఎంపిక. డిజైన్ పరంగా చూస్తే, కొత్త ఆరా మరింత ఆధునికంగా, స్టైలిష్‌గా రూపొందించబడింది. బయట లుక్‌తో పాటు లోపలి క్యాబిన్ కూడా ప్రీమియం ఫీల్‌ను ఇస్తుంది. ఈ కారు 5 సీట్ల లేఅవుట్‌తో వస్తుంది.

ఇంజిన్ ఎంపికల విషయంలో హ్యుందాయ్ ఆరా రెండు ఆప్షన్లతో అందుబాటులో ఉంది. ఇందులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు 1.2 లీటర్ CNG ఇంజిన్ కూడా ఉన్నాయి. వినియోగదారులు తమ అవసరాలు, ఇంధన ఖర్చులను దృష్టిలో ఉంచుకుని సరైన వేరియంట్‌ను ఎంచుకోవచ్చు. మైలేజ్ పరంగా చూస్తే, ఈ కారు సుమారు 17 నుంచి 28 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇవ్వగలదని కంపెనీ పేర్కొంటోంది.
Honda City: హోండా సిటీ భారత కార్ల మార్కెట్లో ఒక ఐకానిక్ సెడాన్‌గా మంచి గుర్తింపు పొందింది. ఎన్నో ఏళ్లుగా నమ్మకమైన పనితీరు, కంఫర్ట్, స్టైలిష్ లుక్‌తో వినియోగదారుల అభిమానాన్ని సంపాదించుకుంది. ధర విషయానికి వస్తే, హోండా సిటీ రూ. 11.95 లక్షల నుంచి రూ. 16.07 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) అందుబాటులో ఉంటుంది. ఈ సెడాన్ 5 సీట్ల లేఅవుట్‌తో వస్తుంది.

ఇంజిన్ విషయానికి వస్తే, హోండా సిటీలో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను అందిస్తున్నారు. ఈ ఇంజిన్ మృదువైన పనితీరు, నమ్మకమైన పవర్ డెలివరీకి ప్రసిద్ధి చెందింది. మైలేజ్ పరంగా చూస్తే, ఇది సుమారు 17.8 నుంచి 18.4 కిలోమీటర్ల వరకు ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుంది. ద్రత పరంగా, ప్రయాణికుల రక్షణ కోసం ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లను అందించారు, ఇది ఈ కారును మరింత విశ్వసనీయంగా మారుస్తుంది.
Credit: Drivespark
More From GoodReturns

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications