The Rajasaab Closing Collections: ది రాజాసాబ్ క్లోజింగ్ కలెక్షన్లు.. ప్రభాస్ మూవీకి నష్టం ఎంతంటే?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ది రాజాసాబ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఊహించని పరిస్థితులను ఎదుర్కొన్నది. టాలీవుడ్ దర్శకుడు మారుతి దర్శకత్వంలో రూపొందిన ఫాంటసీ హారర్ థ్రిల్లర్ చిత్రం జనవరి 9వ తేదీన గ్రాండ్‌గా రిలీజైంది. అయితే ప్రభాస్ అభిమానులను, క్రిటిక్స్‌ను ఈ సినిమా మెప్పించలేకపోయింది. సాధారణ ప్రేక్షకుల అంచనాలను కూడా చేరుకోలేకపోవడంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. అయితే ఈ సినిమా మాత్రం డిజాస్టర్ టాక్‌లోను భారీ వసూళ్లే సాధించింది. అయితే థియేట్రికల్‌గా ఈ సినిమా బిజినెస్ ఎంత? ఏ మేరకు డిస్ట్రిబ్యూటర్లకు రెవెన్యూ తెచ్చిపెట్టింది? చివరకు ఈ సినిమా పరిస్థితి బాక్సాఫీస్ వద్ద ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే..

ప్రభాస్ నటించిన ది రాజాసాబ్ చిత్రం ఆయన ఇమేజ్‌కు భిన్నంగా రూపొందించారు. హారర్, థ్రిల్లర్ కావడంతో ఈ సినిమాకు భారీగా సెట్స్ వేశారు. వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్‌ కోసం అత్యధికంగా ఖర్చు చేశారు. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు, పాన్ ఇండియా స్థాయిలో స్టార్లు, ఎక్కువ కాలం షూటింగ్ చేయడం వల్ల భారీ ఖర్చు పెరిగిపోయింది. ఈ సినిమాను సుమారుగా 400 కోట్ల రూపాయలతో నిర్మించినట్టు అధికారికంగా వెల్లడించడం తెలిసిందే.


The Rajasaab Box Office Closing Collections

ప్రభాస్ మూవీపై అంచనాలు భారీగానే ఉండటంతో ఈ సినిమా బిజినెస్ కూడా రికార్డు స్థాయిలో జరిగింది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ విషయానికి వస్తే.. నైజాం హక్కులు 48 కోట్ల రూపాయలు, ఆంధ్రా రైట్స్ 78 కోట్ల రూపాయలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 126 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇక కర్ణాటక, ఇతర రాష్ట్రాల హక్కులు 16 కోట్ల రూపాయలు, హిందీ రైట్స్ 35 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ రైట్స్ 30 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా వరల్డ్ వైడ్ బిజినెస్ 207 కోట్ల రూపాయలుగా వాల్యూ కట్టారు. 210 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఈ సినిమా బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది.

ది రాజాసాబ్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేసిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. నైజాంలో ఈ చిత్రం 32 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 10 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 10 కోట్ల రూపాయలు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 8 కోట్ల రూపాయలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 5.5 కోట్ల రూపాయలు, వెస్ట్ గోదావరి జిల్లాలో 5.5 కోట్ల రూపాయలు, గుంటూరు జిల్లాలో 5.4 కోట్ల రూపాయలు, కృష్ణా జిల్లాలో 5.5 కోట్లు, నెల్లూరులో 3.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమా ఇప్పటి వరకు 80 కోట్ల రూపాయల నెట్, 120 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇక తెలుగేతర రాష్ట్రాల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలో ఈ సినిమా 15 కోట్ల రూపాయలు, తమిళనాడులో 3 కోట్ల రూపాయలు, కేరళలో ఈ సినిమా 1 కోటి రూపాయలు, హిందీ వెర్షన్ చిత్రం 30 కోట్ల రూపాయలతో 49 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఇండియాలో ఈ చిత్రం 170 కోట్ల రూపాయల కలెక్షన్లను నమోదు చేసింది. అలాగే ఓవర్సీస్‌లో ఈ సినిమా 35 కోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టింది. దాంతో ఈ సినిమా 100కుపైగా నెట్.. 205 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ సినిమా 50 శాతానికిపైగా రికవరీని థియేట్రికల్ బిజినెస్ పరంగా సాధించింది అని ట్రేడ్ వర్గాలు స్పష్టం చేశాయి.

ఇక నాన్ థియేట్రికల్ రైట్స్ విషయానికి వస్తే.. ఈ సినిమాకు ఓటీటీ బిజినెస్ 100 కోట్ల రూపాయలకుపైగా జరిగింది. ఇక శాటిలైట్ రైట్స్‌కు కూడా భారీగా ఆదాయం వచ్చింది. మ్యూజిక్ రైట్స్‌ను ఫ్యాన్సీ రేటుకు టీ సీరిస్ సొంతం చేసుకొన్నది. నాన్ థియేట్రికల్‌గా వచ్చిన రికార్డు రెవెన్యూతో బడ్జెట్ పరంగా కొంత మేరకు సేఫ్ అయింది. ఈ సినిమా ద్వారా 150 నుంచి 200 కోట్ల రూపాయల మేర నష్టం జరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Credit: Filmibeat

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+