రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా యువ దర్శకుడు మారుతి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ది రాజా సాబ్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాకు పాపులర్ ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల, ఇషాన్ సక్సేనా నిర్మాతలుగా వ్యవహరించారు.
ఈ చిత్రంలో ప్రభాస్‌తో సంజయ్ దత్, బోమన్ ఇరానీ, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి కార్తీక్ పళని సినిమాటోగ్రాఫర్‌గా, ఎస్ థమన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌గా బాధ్యతలను నిర్వర్తించారు. ఈ చిత్రం 2026 సంవత్సరం జనవరి 9వ తేదీన సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ అయింది. పాన్ ఇండియా సినిమా రిలీజైన ఈ చిత్రం ఏ రేంజ్ కలెక్షన్లను సాధించిందనే వివరాల్లోకి వెళితే..

భారీ అంచనాల మధ్య రిలీజైన ది రాజాసాబ్ చిత్రం టాక్‌తో సంబంధం లేకుండా అన్ని ప్రాంతాల్లో భారీ వసూళ్లను సాధించింది. ఆంధ్రా, తెలంగాణ, కర్ణాటక, ఓవర్సీస్‌లో ఈ సినిమా రికార్డు స్థాయి వసూళ్లను సాధించింది. ఈ చిత్రం తొలి రోజున 112 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. థియేట్రికల్ బిజినెస్‌లో దాదాపు 30 శాతానికి రికవరీ సాధించింది అని చిత్ర యూనిట్ వెల్లడించింది.
అయితే ఈ సినిమా నార్త్ ఇండియాలో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. గతంలో ప్రభాస్ నటించిన చిత్రాలు మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ హిందీ ప్రాంతంలోని ప్రేక్షకులు ఆయన సినిమాలను విశేషంగా ఆదరించారు. కానీ ది రాజా సాబ్ మాత్రం వసూళ్లను రాబట్టడంలో కొంత వెనుకబడింది.
అయితే ఈ సినిమాకు దురంధర్ సినిమా నుంచి గట్టి పోటీ ఎదురైంది. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్‌గా ఉన్న ఈ సినిమాతో పోటీపడి కలెక్షన్లను సాధించింది. ఈ చిత్రం హిందీ వెర్షన్ 5.5 కోట్ల రూపాయలకుపైగా వసూళ్లను రాబట్టింది. దురంధర్ సినిమా 4.4 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించారు.
ఈ సినిమా ఏపీ, నైజాంలో 53 కోట్లకుపైగా కలెక్షన్లు, తమిళనాడు, కర్ణాటకలో 9 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక ఓవర్సీస్‌లో 26 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. దాంతో ఈ సినిమా 112 కోట్ల రూపాయల వసూళ్లను నమోదు చేసింది.
Credit: Filmibeat
More From GoodReturns

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications