తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్దం అవుతోంది. ప్రధాన పార్టీలకు ఈ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. హోరా హోరీగా ప్రచారం నిర్వహించాయి. పోలింగ్ సమయం సమీపిస్తున్న వేళ ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్ధులు శక్తి మేర ప్రయత్నిస్తున్నారు. అటు రాష్ట్ర ఎన్నికల సంఘం పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇదే సమయంలో పోలింగ్ వేళ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అయితే, సెలవు వర్తింపు విధానాల పైన ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టత ఇచ్చింది.
తెలంగాణ మున్సిపల్ పోలింగ్ కు కౌంట్ డౌన్ కొనసాగుతోంది. మరి కొద్ది గంటల్లో ప్రారంభం కానున్న పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు చేసారు. రాజకీయ నేతల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది. పోలింగ్ వేళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి (బుధవారం) పోలింగ్ రోజును సెలవుగా ప్రకటించింది సర్కార్. ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని ఫ్యాక్టరీలు, షాపులు, పరిశ్రమలకు సెలవు వర్తించనుంది. అంతేకాకుండా, మున్సిపాలిటీల పరిధిలో పనిచేసే ఉద్యోగులు, కార్మికులకు ఈ సెలవు వర్తించనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో మాత్రమే ఈ సెలవు వర్తించనుంది.
తెలంగాణలో మరో ఉప ఎన్నిక, ముహూర్తం..!?

పోలింగ్ కు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు
కాగా, హైదరాబాద్ లో పని చేస్తున్న ఓటింగ్ జరుగుతున్న ప్రాంతాల ఉద్యోగులకు కంపెనీలు ప్రత్యేకంగా సెలవు ఇస్తున్నాయి. దీంతో, ఓటు వేసేందుకు సొంత ప్రాంతాలకు బయల్దేరు తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఒకే విడతలో మున్సిపల్ ఎన్నికలు జరుగనున్నాయి. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు పోలింగ్ జరుగనుంది. మొత్తం 12,930 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఎన్నికల కోసం 8,203 పోలింగ్ కేంద్రాలు, 16,301 బాలెట్ బాక్సులను ఎన్నికల సంఘం సిద్ధం చేసింది. రేపు (ఫిబ్రవరి 11) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 13న ఫలితాలు వెల్లడి కానున్నాయి. పోలింగ్ కోసం ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పోలింగ్ సమయంలో మద్యం షాపులు మూసేయడంతో పాటు, కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోనున్నారు. స్థానిక ఎన్నికలు కావటంతో భారీగా పోలింగ్ జరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Credit: Oneindia
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications