రేంజ్ 421కి.మీ..ఫీచర్లు నెక్స్ట్ లెవల్..టాటా పంచ్ ఈవీ కొత్త రంగులు చూస్తే కళ్లు చెదరాల్సిందే

టాటా మోటార్స్ తన ఫేమస్ మైక్రో ఈవీ టాటా పంచ్ ఈవీ (Tata Punch EV)ని సరికొత్త హంగులతో ముస్తాబు చేస్తోంది. ఫిబ్రవరి 20, 2026న విడుదల కానున్న ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్, ముఖ్యంగా తన కొత్త కలర్ ఆప్షన్లతో వాహన ప్రియులను ఆకట్టుకుంటోంది. కేవలం రంగులే కాకుండా, సాంకేతికత మరియు ఫీచర్ల పరంగా కూడా ఈ కారులో భారీ మార్పులు జరగనున్నాయి.

టాటా మోటార్స్ ఈసారి కలర్ ప్యాలెట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టింది. హారియర్, సఫారి మోడళ్లలో సూపర్‌హిట్ అయిన సన్‌లిట్ ఎల్లో (Sunlit Yellow), కాపర్ బ్రాంజ్ (Copper Bronze) రంగులను పంచ్ ఈవీలోకి తీసుకువస్తోంది. ఈ రంగులు కారుకు మరింత ప్రీమియం, స్పోర్టీ లుక్ ఇస్తున్నాయి. ముఖ్యంగా యువతను ఆకర్షించేలా ఉన్న ఈ రంగులు, అమ్మకాల్లో కీలక పాత్ర పోషిస్తాయని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.

Tata Punch EV Facelift 2026 Bold New Colors and Premium Features Revealed

ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో కారు ముందు భాగం పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం ఉన్న మోడల్‌లో హెడ్ ల్యాంప్‌లను కలిపే బ్లాక్ ప్లాస్టిక్ స్ట్రిప్‌ను తొలగించి, క్లోజ్డ్ గ్రిల్ డిజైన్‌ను ఇచ్చారు. దీనివల్ల కారు మరింత క్లీన్‌గా, ఫ్యూచరిస్టిక్ గా కనిపిస్తోంది. ఫుల్-విడ్త్ LED లైట్ బార్, రీడిజైన్ చేసిన DRLలు కారుకు కొత్త కళను ఇచ్చాయి.

నెక్సాన్ ఈవీ తరహాలో కొత్త ఏరో-ఆప్టిమైజ్డ్ అలాయ్ వీల్స్ రానున్నాయి. వెనుక కనెక్టెడ్ LED టెయిల్ ల్యాంప్స్, అప్‌డేటెడ్ బంపర్ ఉండే అవకాశం ఉంది. కారు లోపల అడుగుపెడితే మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. ప్రస్తుతమున్న 10.25 అంగుళాల స్క్రీన్ స్థానంలో 12.3 అంగుళాల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ రానుంది.

Tata Punch EV Facelift 2026 Bold New Colors and Premium Features Revealed

సేఫ్టీ విషయంలో రాజీ పడకుండా Level 2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్)ను ప్రవేశపెడుతున్నారు. ఇందులో ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ అసిస్ట్ వంటివి ఉంటాయి. వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 360-డిగ్రీ కెమెరా, వైర్‌లెస్ ఛార్జింగ్, వాయిస్ కంట్రోల్డ్ సన్‌రూఫ్ వంటివి కొనసాగుతాయి.

మెకానికల్ గా పెద్ద మార్పులు లేకపోయినా, ప్రస్తుతం ఉన్న పవర్ ఫుల్ బ్యాటరీ ప్యాక్‌లనే టాటా కొనసాగిస్తోంది. స్టాండర్డ్ వేరియంట్ 25 kWh బ్యాటరీ ప్యాక్ తో 315 కి.మీ రేంజ్ ఇస్తుండగా, లాంగ్ రేంజ్ వేరియంట్ 35 kWh బ్యాటరీ ప్యాక్ తో 421 కి.మీ రేంజ్ అందిస్తుంది.

Tata Punch EV Facelift 2026 Bold New Colors and Premium Features Revealed

పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే 0-100 కి.మీ వేగాన్ని కేవలం 9.5 సెకన్లలోనే అందుకుంటుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 140 కి.మీ. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న పంచ్ ఈవీ ధర రూ. 9.99 లక్షల నుంచి రూ. 14.44 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది.

కొత్త ఫీచర్లు, ADAS చేర్చడం వల్ల, ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ధరలో రూ.30,000 నుంచి రూ.50,000 వరకు పెరుగుదల ఉండవచ్చని అంచనా. ఈ అప్‌డేటెడ్ పంచ్ ఈవీ కేవలం డిజైన్ పరంగానే కాకుండా, టెక్నాలజీ పరంగా కూడా తన సెగ్మెంట్‌లో రికార్డులు సృష్టిస్తుందని టాటా మోటార్స్ భావిస్తోంది. చాలా మంది పంచ్ ఈవీ కోసం వెయిట్ చేస్తున్నారు.

Credit: Drivespark

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+