టాటా కారుకు జనాలు బ్రహ్మరథం.. SUV మార్కెట్‌ను షేక్ చేసింది! రోజుకు 549 కార్లు అమ్ముడుపోయాయ్

టాటా నెక్సాన్ (tata nexon) భారతీయ SUV మార్కెట్లో ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. స్టైలిష్ డిజైన్, బలమైన నిర్మాణం, సరసమైన ధర... ఇవన్నీ కలసి నెక్సాన్‌ను సామాన్య వినియోగదారుడి నుంచి ఫ్యామిలీ కొనుగోలుదారుడి వరకు అందరికీ ఇష్టమైన SUVగా మార్చాయి. ముఖ్యంగా ధర-ఫీచర్ల సమతుల్యత దీనికి పెద్ద ప్లస్ పాయింట్. అందుకే మార్కెట్లో దీని డిమాండ్ రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది, షోరూమ్‌ల వద్ద కూడా మంచి స్పందన కనిపిస్తోంది. వినియోగదారులు నెక్సాన్‌ను ఎంచుకునే మరో ప్రధాన కారణం దీని తక్కువ నిర్వహణ ఖర్చులు. రోజువారీ వినియోగంలో జేబుకు భారం కాకుండా ఉండటం, అలాగే మంచి ఇంధన సామర్థ్యం అందించడం వల్ల ఈ SUVను కొనుగోలు చేసిన వారు సంతృప్తిగా ఉన్నారు.

నగర ప్రయాణాలైనా, హైవే డ్రైవ్‌లైనా నెక్సాన్ నమ్మకంగా పనిచేస్తుందనే పేరు సంపాదించుకుంది. ఈ నమ్మకానికి 2025 అమ్మకాలు స్పష్టమైన ఉదాహరణగా నిలిచాయి. ఒక్క 2025 సంవత్సరంలోనే టాటా నెక్సాన్ మొత్తం 2,00,561 యూనిట్లు వినియోగదారులకు డెలివరీ చేయబడ్డాయి. అంటే రోజుకు సగటున సుమారు 549 యూనిట్ల నెక్సాన్ SUVలు అమ్ముడయ్యాయన్న మాట. ఇది భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో నెక్సాన్‌కు ఉన్న బలమైన స్థానం, వినియోగదారుల విశ్వాసాన్ని స్పష్టంగా చూపిస్తోంది.

Tata Nexon Cy2025 Sales Success Story 200k Plus Units Delivered

మరొక విశేషం ఏమిటంటే, టాటా నెక్సాన్ స్టాండర్డ్ పెట్రోల్-డీజిల్ వెర్షన్లతో పాటు ఎలక్ట్రిక్ వెర్షన్‌లో కూడా లభిస్తోంది. దీంతో సంప్రదాయ ఇంధన వాహనాలను ఇష్టపడేవారితో పాటు ఎలక్ట్రిక్ వాహనాల వైపు అడుగులు వేస్తున్న వినియోగదారులను కూడా నెక్సాన్ ఆకర్షిస్తోంది. విశ్వసనీయత, అమ్మకాల గణాంకాలు అన్నీ కలిసి టాటా నెక్సాన్‌ను భారతదేశంలో అత్యంత విజయవంతమైన SUVలలో ఒకటిగా నిలబెడుతున్నాయి.

టాటా నెక్సాన్ SUV మరో పెద్ద ఆకర్షణ దీని సరసమైన ధర. ఇది రూ.7.32 లక్షల నుంచి రూ.14.05 లక్షల వరకు(ఎక్స్-షోరూమ్) ధర పరిధిలో లభిస్తోంది. వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని టాటా ఈ SUVను స్మార్ట్, స్మార్ట్ ప్లస్, ప్యూర్, ప్యూర్ ప్లస్, క్రియేటివ్, క్రియేటివ్ ప్లస్, ఫియర్‌లెస్, ఫియర్‌లెస్ ప్లస్ వంటి అనేక వేరియంట్‌లలో అందిస్తోంది. దీంతో బడ్జెట్‌కు తగ్గట్టు నచ్చిన వేరియంట్‌ను ఎంచుకునే అవకాశం ఉంది.

Tata Nexon Cy2025 Sales Success Story 200k Plus Units Delivered

ఇంజిన్ ఆప్షన్ల విషయంలో కూడా టాటా నెక్సాన్ చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది. ఇందులో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్, 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో పాటు 1.2-లీటర్ CNG ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. దీంతో ఇంధన ఖర్చులు తగ్గించుకోవాలనుకునే వారికి CNG వేరియంట్ మంచి ఎంపికగా మారుతుంది. డ్రైవింగ్ సౌలభ్యం కోసం ఈ SUVలో 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్, ఆధునికమైన 7-స్పీడ్ DCT గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి.

మైలేజీ విషయంలో కూడా నెక్సాన్ తన స్థాయికి తగ్గట్టుగా మంచి పనితీరును చూపిస్తోంది. వేరియంట్, ఇంజిన్‌ను బట్టి ఇది సుమారు 17 నుంచి 24 kmpl వరకు ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుంది. టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ వేరియంట్ కూడా భారత మార్కెట్లో మంచి స్పందనను పొందుతోంది. పెట్రోల్, డీజిల్ వేరియంట్లతో పాటు పూర్తిగా ఎలక్ట్రిక్ టెక్నాలజీని కోరుకునే వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని టాటా ఈ నెక్సాన్ EVను పరిచయం చేసింది.

Tata Nexon Cy2025 Sales Success Story 200k Plus Units Delivered

ధర విషయానికి వస్తే, ఈ ఎలక్ట్రిక్ SUV రూ. 12.49 లక్షల నుంచి రూ. 17.49 లక్షల వరకు(ఎక్స్-షోరూమ్) లభిస్తోంది. ఈ ధరతో ఎలక్ట్రిక్ కార్ల ప్రపంచంలోకి అడుగుపెట్టాలనుకునే వారికి ఇది ఒక ఆకర్షణీయమైన ఎంపిక. కొత్త నెక్సాన్ EVలో 30 kWh నుంచి 45 kWh వరకు సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్‌లు ఉన్నాయి. ఈ కారు సుమారు 275 కిలోమీటర్ల నుంచి 489 కిలోమీటర్ల రేంజ్‌ను అందించగలదు.

Credit: Drivespark

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+