IPL 2026: భీకరంగా SRH లైనప్.. తుది జట్టు అంచనా ఇదే!

ఐపీఎల్ 2026 మినీ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ చాలా తెలివిగా వ్యవహరించింది. రూ.25.5 కోట్ల భారీ పర్స్‌తో బరిలోకి దిగిన ఆరెంజ్ ఆర్మీ.. మొత్తం 10 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. అత్యధికంగా ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్‌కు రూ.13 కోట్లు ఖర్చు చేసిన కావ్య మారన్.. ఆస్ట్రేలియా అనామక పేసర్ జాక్ ఎడ్వర్డ్స్‌ను రూ.3 కోట్లకు తీసుకుంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసిన 10 మందిలో 9 మంది అనామక ఆటగాళ్లే కావడంతో ఆ జట్టు అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారు. కానీ జట్టు బలహీనతలను అధిగమించేందుకు సన్‌రైజర్స్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. దేశవాళీ క్రికెట్‌లో రాణిస్తున్న ఆటగాళ్లను అన్వేషించి కొనుగోలు చేసింది. ముఖ్యంగా బౌలింగ్ విభాగాన్ని బలోపేతం చేసింది.

సన్‌రైజర్స్ కొనుగోలు చేసిన 10 మంది ఆటగాళ్లలో 8 మంది బౌలర్లు ఉండగా.. ఇందులో నలుగురు ఆల్‌రౌండర్లు ఉన్నారు. ఒకరు వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ ఉన్నారు. ఇద్దరు స్పెషలిస్ట్ పేసర్లు ఉండగా.. మరో ఇద్దరు స్పిన్నర్లు ఉన్నారు. దాంతో సన్‌రైజర్స్ కాంబినేషన్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.


SRH Predicted Playing XI for IPL 2026 Liam Livingstone Likely to Miss Out Despite 13 Crore Price Tag

భీకరంగా బ్యాటింగ్ లైనప్..

ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రీచ్ క్లాసెన్, లియామ్ లివింగ్ స్టోన్, అనికేత్ వర్మలతో బ్యాటింగ్ లైనప్ భీకరంగా ఉంది. ఈ లైనప్‌లో ఈ ఇద్దరు రాణించినా సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు తిరుగుండదు. బౌలింగ్ విభాగంలో కాస్త అనుభవం లేమి కనబడుతున్నా.. కుర్రాళ్లు, ప్యాట్ కమిన్స్, ఇషాన్ మలింగా అంచనాలను అందుకుంటే ఆరెంజ్ ఆర్మీ గెలుపు నల్లేరు మీద నడకే.

తుది జట్టులో చోటు ఎవరికంటే..?

ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఓపెనింగ్ చేయనుండగా.. ఇషాన్ కిషణ్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రీచ్ క్లాసెన్, అనికేత్ వర్మ మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేయనున్నారు. పంజాబ్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ సలీల్ అరోరాను ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించే ఛాన్స్ ఉంది. లేదంటే అనికేత్ వర్మకు బ్యాకప్‌గా ఉపయోగించుకోవచ్చు. భారీ సిక్స్‌లు బాదడం అతని ప్రత్యేకత. హైదరాబాద్ వేదికగా జరిగే మ్యాచ్‌లకు లివింగ్ స్టోన్ బెంచ్‌కే పరిమితం కావచ్చు.

అతని స్థానంలో నాలుగో ఓవర్‌సీస్ ప్లేయర్‌గా ఇషాన్ మలింగా, జాక్ ఎడ్వర్డ్స్‌లో ఒకరికి చోటు దక్కుతుంది. స్పిన్ ఆల్‌రౌండర్ శివాంగ్ కుమార్‌కు తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు ఉన్నాయి. చైనామన్ బౌలర్ అయిన అతను కీలకం కానున్నాడు. పేసర్లుగా కమిన్స్, హర్షల్ పటేల్‌తో పాటు అనామక పేసర్ ప్రఫుల్ హింగే‌కు అవకాశం దక్కనుంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు(అంచనా)

ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రీచ్ క్లాసెన్, శివాంగ్ కుమార్‌, హర్షల్ పటేల్, ప్యాట్ కమిన్స్, జీషన్ అన్సారీ/క్రెయిన్స్ ఫులెట్రా, ప్రఫుల్ హింగే/జయదేవ్ ఉనాద్కత్, జాక్ ఎడ్వర్డ్స్‌/ఇషాన్ మలింగా/ లియామ్ లివింగ్ స్టోన్

ఇంపాక్ట్ సబ్: అనికేత్ వర్మ/సలీల్ అరోరా

Credit: Mykhel

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+