అసెంబ్లీ స్థానాల పెంపు పై తేల్చేసిన కేంద్రం, కీలక మలుపు..!!

కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల పెంపు పైన స్పష్టత ఇచ్చింది. ఏపీ పునర్విభజన చట్టం మేరకు ఏపీలో 50, తెలంగాణలో 34 అసెంబ్లీ సీట్లు పెరగాల్సి ఉంది. కేంద్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు.. తాజా నిర్ణయాల వేళ తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన పైన స్పష్టత వచ్చింది. దీంతో.. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలు ఈ నిర్ణయంతో తమ కార్యాచరణకు సిద్ధమవుతున్నాయి.

ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ సీట్ల పెంపు పైన క్లారిటీ వచ్చింది. 2014 లో పార్లమెంట్ ఆమోదించిన ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో ఒక్కో పార్లమెంట్ స్థానం పరిధిలో రెండు అసెంబ్లీ సీట్లు పెరగాల్సి ఉంది. అయితే, ఇప్పుడు కేంద్రం ఈ విషయంలో సంప్రదింపులు చేసింది. పలువురి అభిప్రాయాలు సేకరించింది. 2026 లో జరిగే జనగణన కారణంగా ఇప్పుడు అసెంబ్లీ స్థానాల పెంపు చేపట్టకుండా.. సెన్సెస్ పూర్తయిన తరువాత చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు పాత నియోజకవర్గాలతోనే జరుగనున్నాయి. జనాభా లెక్కల సేకరణ, దాని తర్వాత నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ పూర్తయ్యే సమయానికి 2029 ఎన్నికలు పూర్తి కానున్నాయి. నియోజక వర్గాల పునర్విభజనపై 2001లో తీసుకొచ్చిన 84వ రాజ్యాంగ సవరణలో.. ఆ రోజుకు ఉన్న అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల పరిధిని ఫ్రీజ్‌ చేశారు.


seats-in-assembly-of-telugu-states-will-increase-by-2034-elections-as-reports

దీంతో, 2026 తర్వాత చేపట్టే జనగణన ఆధారంగా నియోజకర్గాల పునర్విభజన జరగాలని అందులో నిర్దేశించారు. అయితే రాష్ట్ర విభజన చట్టం(2014)లోని సెక్షన్‌ 26(1) ప్రకారం తెలంగాణలో విభజన నాటికి ఉన్న 119 అసెంబ్లీ సీట్లను 153కి.. ఏపీలో 175 అసెంబ్లీ సీట్లను గరిష్ఠంగా 225కి పెంచుకునే వెసులుబాటు కల్పించారు. దీని ఆధారంగా 2029 ఎన్నికల నాటికి అసెంబ్లీ సీట్లు పెరుగుతాయని రాజకీయ పార్టీలు ప్రచారం చేస్తూ వచ్చాయి. జనగణన ఆధారం గానే నియోజకవర్గాల పునర్విభజన జరగాలని విభజన చట్టంలో ఎక్కడా లేదని.. ప్రజల సౌకర్యం, పాలనాసౌలభ్యం, భౌగోళిక సమస్యలు తలెత్తకుండా మాత్రమే పునర్విభజన జరగాలని అందులో ఎన్నికల కమిషన్‌(ఈసీ)కి నిర్దేశించారని వాదిస్తూ వచ్చాయి. కేంద్రం మాత్రం జనగణన తర్వాతే రెండు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందని స్పష్టం చేసింది. ఈ అంశంపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణ సమయలోనూ తన వైఖరిని తేల్చిచెప్పింది.

అంత జరిగితే నాకు చెప్పరా, అనవసర వివాదం - చంద్రబాబు ఆగ్రహం..!!

జనగణన తర్వాత ఏపీ, తెలంగాణలో నియోజకవర్గాలు పెంచుకోవచ్చని కోర్టుకు నివేదించింది. కేంద్రం ఈ ఏడాది జూన్‌ 4న 2027 జనగణనకు షెడ్యూల్‌ ప్రకటించింది. ఈ ప్రక్రియకు రూ.11,718 కోట్లు కేటాయిస్తూ కేంద్ర కేబినెట్‌ తాజాగా నిర్ణయం తీసుకుంది. జనగణన ప్రారంభ మై తుది నోటిఫికేషన్‌ ఇవ్వడానికి కనీసం ఏడాదిన్నర నుంచి రెండేళ్లు పడుతుంది. దీంతో, 2028 మధ్యలోనే జనాభా లెక్కలపై తుది నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం ఉంది. ఆ నోటిఫికేషన్‌ ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలంటే ఇంకో ఏడాది నుంచి ఏడాదిన్నర పడుతుంది. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ చేపట్టేందుకు ముందుగా కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్‌ కమిషన్‌ను నియమించాల్సి ఉంటుంది. ఈ కమిషన్‌ రాష్ట్రమంతా తిరిగి ప్రజాభిప్రాయాలను సేకరించి తుది నోటిఫికేషన్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ లెక్కన 2029 ఏప్రిల్‌, మే నెలల్లో జరిగే ఎన్నికలకు కొత్త నియోజకవర్గాలు సాధ్యం కావు. ఆ తర్వాత పునర్విభజన చేపడితే.. 2034 ఎన్నికలకు కొత్త నియోజవకర్గాలు అందుబాటులోకి రానున్నాయి.

Credit: Oneindia

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+