మెగాస్టార్ చిరంజీవి తనయుడు, మెగా పవర్ స్టార్ రాంచరణ్, ఉపాసన కామినేని కొణిదెల దంపతులు పండంటి కవలలకు జన్మనిచ్చారు. గత కొద్ది రోజులుగా వారిద్దరూ కవలలకు జన్మనివ్వబోతున్నారనే విషయం సినీ వర్గాలో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే జనవరి 31వ తేదీన వారిద్దరూ ఇద్దరు చిన్నారులకు జన్మిచ్చారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అధికారికంగా ధృవీకరించారు. తన ట్వీట్‌లో భావోద్వేగానికి గురయ్యారు. ఈ వార్తకు సంబంధించిన వివరాలు, అలాగే చిరంజీవి ఎమోషనల్ ట్వీట్‌కు సంబంధించిన విశేషాల్లోకి వెళితే..
రాంచరణ్, ఉపాసన దంపతులు శనివారం రోజున హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని అపోలోహాస్పిటల్‌లో పండంటి కవలలకు జన్మనిచ్చారు. వారు పండంటి అబ్బాయికి, అమ్మాయికి జన్మనిచ్చారు. వైద్యుల పర్యవేక్షణలో ఉపాసన ప్రసవం జరగడానికి ముందు చిరంజీవి దంపతులు శనివారం సాయంత్రం అపోలో హాస్పిటల్‌కు చేరుకొన్నారు. తమ కుటుంబంలోకి వస్తున్న చిన్నారులిద్దరని వారు స్వాగతించారు. తమకు మనవడు, మనవరాలు పుట్టడంపై చిరంజీవి, సురేఖ కొణిదెల దంపతులు ఆనందంలో మునిగిసోయారు. ఇప్పటికే రాంచరణ్‌కు క్లింకార కొణిదెల కూతురు ఉన్న విషయం తెలిసిందే.

రాంచరణ్ దంపతులకు ఇద్దరు కవలలు పుట్టారనే వార్త మెగా ఫ్యామిలీలో సంతోషాన్ని నింపింది. ఈ సందర్భంగా అపోలో హాస్పిటల్ వద్ద బాణాసంచా కాల్చి సంబరాల జరుపుకొన్నారు. మెగా ఫ్యామిలీలోకి ఇద్దరు చిన్నారులను గ్రాండ్‌గా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు చిరంజీవిని, రాంచరణ్‌కు ఫోన్ కాల్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.
ఇదిలా ఉండగా, రాంచరణ్ దంపతులకు ఇద్దరు సంతానం కలుగడంపై చిరంజీవి ఆనందంతోను, భావోద్వేగంతోను ట్వీట్ చేశారు. రాంచరణ్, ఉపాసన దంపతులు ఇద్దరు కవలలక జన్మనిచ్చారు. ఒకరు బాబు, మరొకరు అమ్మాయి. ఈ విషయాన్ని మీతో పంచుకోవడానికి చాలా ఆనందంగా ఉంది. ఇద్దరు చిన్నారులు, తల్లి సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. ఇద్దరు చిన్నారులను మా కుటుంబంలోకి ఆహ్వానించడం మాకు ఎనలేని సంతోషాన్ని ఇస్తున్నది. తాత, అమ్మమ్మలుగా మాకు భగవంతుడు ఇచ్చిన వరంగా భావిస్తున్నాం అని చిరంజీవి అన్నారు.
ఈ సంతోషకరమైన క్షణాల సందర్భంగా ప్రార్థనలు చేసి, ప్రేమను, ఆశీస్సులను అందిస్తూ మాకు శుభాకాంక్షలు అందించిన ప్రతీ ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇట్లు చిరంజీవి, సురేఖ అంటూ తన ట్వీట్‌లో మెగాస్టార్ పేర్కొన్నారు.
Credit: Filmibeat
More From GoodReturns

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..



Click it and Unblock the Notifications