పెట్రోల్ అవసరం లేని స్కూటర్.. ఆఫీస్ నుంచి షాపింగ్ వరకూ ఫుల్ పనికొస్తుంది! మిడిల్ క్లాస్‌కి పర్ఫెక్ట్
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో తన ఎలక్ట్రిక్ స్కూటర్ శ్రేణిని మరింత బలోపేతం చేస్తూ తాజాగా బజాజ్ చేతక్ C25 (Bajaj Chetak C25) ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ స్కూటర్, రోజువారీ ప్రయాణాలకు సరిపోయేలా సింపుల్‌గా, ఉపయోగకరంగా డిజైన్ చేయబడింది. ప్రస్తుతం ఇది రూ. 91,399 (ఎక్స్-షోరూమ్) ధరతో అందుబాటులోకి వచ్చింది. ఆఫీస్‌కు ప్రతిరోజూ వెళ్లే ఉద్యోగులు, కాలేజ్‌కు ప్రయాణించే విద్యార్థులు, ఇంటి చుట్టుపక్కల చిన్న షాపింగ్ పనులు లేదా రోజువారీ అవసరాల కోసం ఒక నమ్మకమైన ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం చూస్తున్న వారికి చేతక్ C25 మంచి ఎంపికగా నిలుస్తుంది.
ట్రాఫిక్‌లో సులభంగా నడపగలిగే విధంగా ఉండటంతో పాటు, తక్కువ ఖర్చుతో మెయింటెనెన్స్ ఉండేలా బజాజ్ ఈ మోడల్‌ను రూపొందించింది. కేవలం 107 కిలోల బరువు మాత్రమే ఉండటంతో బజాజ్ చేతక్ C25 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఎవరికైనా చాలా సులభంగా హ్యాండిల్ చేయవచ్చు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు లేదా కొత్తగా స్కూటర్ నడపడం ప్రారంభించినవారికి కూడా ఇది భయం లేకుండా నడిపేలా ఉంటుంది.

చిన్నదిగా కనిపించినా, రోజువారీ అవసరాలకు సరిపోయేంత నిల్వ స్థలం ఇందులో అందించడం బజాజ్ తెలివైన నిర్ణయమే అని చెప్పుకోవచ్చు. ఫీచర్ల విషయానికి వస్తే, చేతక్ C25లో ఆధునికమైన కలర్ LCD డిస్ప్లేను అందించారు. ఇది బ్యాటరీ స్టేటస్, స్పీడ్, రేంజ్ వంటి ముఖ్యమైన సమాచారాన్ని స్పష్టంగా చూపిస్తుంది. అలాగే, 650 మిల్లీమీటర్ల పొడవైన సీటు ఉండటంతో రైడర్‌తో పాటు వెనక కూర్చునే వారికి కూడా మంచి కంఫర్ట్ లభిస్తుంది.
పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, చేతక్ C25లో 2.5kWh బ్యాటరీ ప్యాక్ను ఉపయోగించారు. ఇది 2.2kW ఎలక్ట్రిక్ మోటార్తో పనిచేస్తుంది. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే, ఈ స్కూటర్ 113 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుంది. రోజువారీ నగర ప్రయాణాలకు ఇది చాలిపోతుంది. గరిష్టంగా 55 కిలోమీటర్లు గంట వేగంతో ప్రయాణించగల ఈ స్కూటర్, స్పోర్టీ లేదా స్ప్రింటింగ్ రైడింగ్‌కు కాకపోయినా, సిటీ ట్రాఫిక్‌లో సాఫీగా నడపడానికి మాత్రం పూర్తిగా సరిపోతుంది.

ఛార్జింగ్ విషయానికి వస్తే, 750W ఆఫ్-బోర్డ్ ఛార్జర్ ఉపయోగించి, 2 గంటల 25 నిమిషాల్లో సున్నా నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. బ్యాటరీని 4 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. ఈ ఛార్జింగ్ వేగం నగరాల్లో రోజువారీ అవసరాలకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ స్కూటర్ ఈ స్కూటర్ ఇద్దరు ప్రయాణీకులతో 19 శాతం వరకు వంపులను సులభంగా నిర్వహించగలదు. దీనిలో USB ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.
ఇతర ముఖ్య లక్షణాలలో హిల్-హోల్డ్ అసిస్ట్, ఇతర చేతక్ మోడళ్ల మాదిరిగా కాకుండా, ఇది ముందు భాగంలో డబుల్ టెలిస్కోపిక్ సస్పెన్షన్‌ను కలిగి ఉంది. ఈ స్కూటర్‌లో కలర్ LED స్పీడోమీటర్ను అందించడం మరో ముఖ్యమైన ఫీచర్. రైడర్‌కు అవసరమైన అన్ని సమాచారం స్పష్టంగా కనిపించేలా ఇది డిజైన్ చేయబడింది. బజాజ్ కంపెనీ సేఫ్టీ, కంఫర్ట్ విషయాల్లో కూడా బజాజ్ రాజీపడలేదు.

కొత్త బజాజ్ చేతక్ C25 EV తన కాంపాక్ట్, యూత్‌ఫుల్ డిజైన్తోనే మొదటి చూపులోనే ఆకట్టుకుంటుంది. ఆధునిక ట్రెండ్స్‌కు తగ్గట్టుగా రూపొందించిన ఈ స్కూటర్, యువతను మాత్రమే కాకుండా స్టైలిష్‌గా ప్రయాణించాలనుకునే ప్రతి ఒక్కరినీ ఆకర్షించేలా ఉంది. రంగుల విషయానికి వస్తే, బజాజ్ చేతక్ C25 EVను 6 శక్తివంతమైన ఆకర్షణీయమైన రంగు ఎంపికలలో అందిస్తోంది.
Credit: Drivespark


Click it and Unblock the Notifications