తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్రనటులుగా వెలుగొందుతున్న మెగాస్టార్ చిరంజీవి- నందమూరి బాలకృష్ణలు సొంత అన్నదమ్ముల్లా మెలుగుతారు. ఒకరిపట్ల మరొకరు ఎంతో ఆదరాభిమానాలు చూపిస్తారు. అయితే అభిమానులు మాత్రం నందమూరి - కొణిదెల వర్గాలుగా విడిపోయి రచ్చ రచ్చే చేసేవారు. ఇప్పటికీ కూడా ఈ ఫ్యాన్ వార్ కొనసాగుతూనే ఉంది. మేమంతా అన్నదమ్ముల్లా ఉన్నప్పటికీ మీరు కొట్టుకోవద్దని మెగా, నందమూరి హీరోలు ఎన్నోసార్లు పిలుపునిచ్చినా అభిమానుల్లో మార్పు రాలేదు. ఎప్పటిలాగే చిరంజీవి- బాలకృష్ణ సినిమాల విషయంలో ఎన్నో పోలికలు, అంచనాలు. ఇటీవల అఖండ 2 ద్వారా బాలయ్య ప్రేక్షకులను పలకరించగా.. ఈ సినిమా వచ్చిన కొద్దిరోజులకే శంకర వరప్రసాద్ గారిగా మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈ రెండు సినిమాల కలెక్షన్స్, రికార్డుల గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. తాజాగా అఖండ 2పై చిరంజీవి పైచేయి సాధించారు. ఈ వివరాల్లోకి వెళితే..
మన శంకర వరప్రసాద్ గారు తారాగణం
మన శంకర వరప్రసాద్ గారు చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. లేడీ సూపర్‌స్టార్ నయనతార ఈ చిత్రంలో ఆయనకు జోడీగా నటించారు. టాలీవుడ్ అగ్ర కథానాయకుడు విక్టరీ వెంకటేష్ గెస్ట్ రోల్‌లో అలరించారు. కేథరిన్ థ్రెసా, సచిన్ ఖేడేకర్, శరత్ సక్సేనా, మాస్టర్ రేవంత్, బేబీ ఐరా, హర్షవర్థన్‌లు తదితరులు నటించారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత సాహు గారపాటితో కలిసి చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా.. భీమ్స్ సిసిరోలియో సంగీత దర్శకత్వం వహించారు, తమ్మిరాజు ఎడిటర్‌గా సేవలందించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న మన శంకర వరప్రసాద్ గారు చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది.

మన శంకర వరప్రసాద్ గారు బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులు కలిపి మన శంకర వరప్రసాద్ గారు సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరిగింది. ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ 55 కోట్ల రూపాయలకు, నైజాం థియేట్రికల్ హక్కులు 32 కోట్ల రూపాయలు, సీడెడ్ థియేట్రికల్ రైట్స్ 18 కోట్ల రూపాయలు చొప్పున తెలుగు రాష్ట్రాల్లో 105 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ చేసింది. అలాగే కర్ణాటకలో 10 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాల్లో 5 కోట్ల రూపాయలు చొప్పున ఇండియాలో మన శంకర వరప్రసాద్ గారు చిత్రం 120 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
మన శంకర వరప్రసాద్ గారు బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?
అటు ఓవర్సీస్‌లోనూ ఈ సినిమాకు మంచి బిజినెస్ జరిగినట్లుగా ట్రేడ్ పండితులు వెల్లడించారు. నార్త్ అమెరికా థియేట్రికల్ రైట్స్‌ను 20 కోట్ల రూపాయలకు అమ్మారు. దాంతో చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీకి వరల్డ్ వైడ్‌గా 140 నుంచి 150 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మన శంకర వరప్రసాద్ గారు చిత్రం లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 280 కోట్లు నుంచి 300 కోట్ల రూపాయల రేంజ్‌లో కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు బ్రేక్ ఈవెన్ టార్గెట్ నిర్దేశించారు.
నార్త్ అమెరికాలో మన శంకర వరప్రసాద్ గారు కలెక్షన్స్
కాగా.. జనవరి 12న మన శంకర వరప్రసాద్ గారు మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తుందని నిర్మాతలు ప్రకటించారు. అయితే తెలుగు రాష్ట్రాలు, నార్త్ అమెరికాలో ఈ సినిమాకు పెయిడ్ ప్రీమియర్స్ ప్రదర్శించారు. అమెరికా, కెనడాలలో చిరంజీవి మూవీకి కేవలం ప్రీమియర్స్ ద్వారానే 1.5 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో 13.52 కోట్ల రూపాయలు) వసూలు చేసింది. ఇక ఇండియాలో పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా 10 కోట్ల రూపాయలకు పైగా కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ పండితులు తెలిపారు. దాంతో కేవలం ప్రీమియర్స్‌లోనే మన శంకర వరప్రసాద్ గారు చిత్రం 24 కోట్ల రూపాయలు రాబట్టింది. మరోవైపు ఫస్ట్ డే అడ్వాన్స్ బుకింగ్‌లో ఈ చిత్రం దాదాపు 35 కోట్ల రూపాయలు వసూలు చేసి సంచలనం సృష్టించింది. దాంతో మన శంకర వరప్రసాద్ మూవీ తొలిరోజు 70 నుంచి 80 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
అఖండ 2పై మన శంకర వరప్రసాద్ గారు పైచేయి
ఇదిలాఉండగా.. ప్రీమియర్స్ కలెక్షన్స్ ద్వారా మెగాస్టార్ చిరంజీవి ఓ అరుదైన రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకోవడంతో పాటు నందమూరి బాలకృష్ణపై మరోసారి పైచేయి సాధించారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండకు సీక్వెల్‌గా తెరకెక్కిన అఖండ 2 చిత్రం డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా ఇటీవలే తన థియేట్రికల్ రన్ ముగించింది. నార్త్ అమెరికాలో అఖండ 2 చిత్రం తన థియేట్రికల్ రన్ ముగిసేసరికి వన్ మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో 9 కోట్ల రూపాయలు) వసూలు చేసింది. అయితే దీనిని మెగాస్టార్ చిరంజీవి కేవలం ప్రీమియర్స్ వసూళ్లతోనే అలవోకగా అధిగమించారు. నార్త్ అమెరికాలో ప్రీమియర్స్‌లో మన శంకర వరప్రసాద్ గారుకి 1.5 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ వచ్చాయి. ఇక వరల్డ్ వైడ్‌గా అఖండ 2కు ప్రీమియర్స్ ద్వారా 15 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాగా.. మన శంకర వరప్రసాద్ గారు చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 24 కోట్ల రూపాయలు వసూలైంది. తద్వారా ఓవరాల్‌గా ప్రీమియర్స్ కలెక్షన్స్ విషయంలోనూ బాలయ్యను చిరంజీవి అధిగమించారని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
Credit: Filmibeat
More From GoodReturns

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications