భారతదేశంలోని మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు, ముఖ్యంగా ఆఫీసులకు వెళ్లేవారికి మారుతి సుజుకి కార్స్ అంటే ఎప్పుడు ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. తక్కువ ధర, భారీ మైలేజ్ ఇచ్చే కార్లను తయారు చేయడంలో మారుతి దిట్ట. అయితే మారుతి సుజుకికి చెందిన సెలీరియో (Celerio) విషయంలో మాత్రం లెక్కలు మారుతున్నాయి.
అద్భుతమైన ఫీచర్లు, బైక్ రేంజ్ మైలేజ్ ఉన్నప్పటికీ, ఈ కారు అమ్మకాలు మాత్రం ఆశించిన స్థాయిలో సాగడం లేదు. అసలు ఈ కారు ప్రత్యేకతలు ఏంటి? జనం ఎందుకు దీనిపై ఆసక్తి చూపడం లేదో వివరంగా తెలుసుకుందాం.

తాజా గణాంకాల ప్రకారం (జనవరి 2026) మారుతి సుజుకి సెలీరియో కేవలం 1,501 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. గతేడాదితో పోలిస్తే అమ్మకాలు ఏకంగా 23.18 శాతం పడిపోయాయి. దీనికి ప్రధాన కారణం మారుతున్న కస్టమర్ల అభిరుచి. ప్రస్తుతం మార్కెట్లో మైక్రో ఎస్‌యూవీల హవా నడుస్తోంది.
సెలీరియో ధర కంటే కొంచెం ఎక్కువ పెడితే టాటా పంచ్ లేదా మారుతి ఫ్రాంక్స్ వంటి ఎస్‌యూవీలు వస్తుండటంతో, జనం హ్యాచ్‌బ్యాక్ కార్ల కంటే ఎస్‌యూవీలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగే సెలీరియో డిజైన్ కొంచెం పాతబడటం కూడా అమ్మకాలు తగ్గడానికి ఒక కారణమని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

సెలీరియో చిన్న కారు అయినప్పటికీ ఫీచర్లలో ఏమాత్రం తగ్గదు. ఇది ఎల్‌ఎక్స్‌ఐ, విఎక్స్‌ఐ, జెడ్‌ఎక్స్‌ఐ, జెడ్‌ఎక్స్‌ఐ ప్లస్ అనే నాలుగు వేరియంట్లలో లభిస్తోంది. ఎల్ఈడీ హెడ్‌లైట్లు, డిఆర్‌ఎల్‌లు, 15-అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో చూడడానికి ఆకర్షణీయంగా ఉంటుంది.
ఈ కారు పెట్రోల్ వేరియంట్ 24 కి.మీ ఇవ్వగా, సీఎన్‌జీ (CNG) వేరియంట్ ఏకంగా 34 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఇది బైక్ మైలేజీతో సమానం. ఇందులో ఐదుగురు ప్రయాణికులు సౌకర్యవంతంగా కూర్చోవచ్చు. 313 లీటర్ల బూట్ స్పేస్ లగేజ్ కోసం అందుబాటులో ఉంటుంది. 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్టార్ట్/స్టాప్ బటన్, ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి.

చిన్న కారు కదా అని మారుతి భద్రతను విస్మరించలేదు. కస్టమర్ల సేఫ్టీ కోసం ఇందులో 6 ఏయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ (ABS), ఈబీడీ (EBD), హిల్‌హోల్డ్ అసిస్ట్, రివర్స్ పార్కింగ్ సెన్సార్లను ప్రామాణికంగా అందిస్తున్నారు. ఇంత తక్కువ ధరలో ఇన్ని సేఫ్టీ ఫీచర్లు ఉండటం గమనార్హం. ధర విషయానికి వస్తే ఇది ఎక్స్-షోరూమ్‌లో రూ.4.70 లక్షల నుంచి రూ.6.73 లక్షల మధ్య అందుబాటులో ఉంది.
మారుతున్న ట్రెండ్స్ పక్కన పెడితే, నగరాల్లో ట్రాఫిక్ ఇబ్బందుల మధ్య తక్కువ ఖర్చుతో ప్రయాణించాలనుకునే వారికి సెలేరియో ఇప్పటికీ ఒక అద్భుతమైన ఆప్షన్. ముఖ్యంగా మధ్యతరగతి ఉద్యోగులకు పెట్రోల్ ఖర్చును భారీగా తగ్గిస్తుంది. అయితే, కస్టమర్ల మనసు మళ్లీ గెలవాలంటే సెలేరియోలో మరిన్ని కొత్త మార్పులు రావాలని ఆటోమొబైల్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
సెలీరియో తన ఉనికిని కాపాడుకోవాలంటే కేవలం మైలేజ్ మీదనే ఆధారపడకుండా, మారుతున్న కాలానికి అనుగుణంగా బోల్డ్ డిజైన్, మరిన్ని ప్రీమియం ఫీచర్లతో అప్‌డేట్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే, మైలేజ్ పరంగా రారాజుగా ఉన్నా, అమ్మకాల రేసులో వెనుకబడక తప్పదు.
Credit: Drivespark
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications