Secunderabad- Divya Dakshin Jyotirlinga special train: ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ మరో ప్యాకేజీని ప్రకటించింది. దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలను కలుపుతూ ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. దివ్య దక్షిణ జ్యోతిర్లింగ టూర్ ప్యాకేజీ ఇది. తమిళనాడు, కేరళల్లో గల రాష్ట్రాల్లో గల ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలను ఇందులో ఐఆర్సీటీసీ. అరుణాచలం, రామేశ్వరం, కన్యాకుమారి వంటి పుణ్య క్షేత్రాలు ఇందులో ఉన్నాయి.
ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్ ద్వారా ఆయా పుణ్యక్షేత్రాలను భక్తులు దర్శించుకోవచ్చు. మొత్తం ఏడు రాత్రులు/ ఎనిమిది పగళ్లు సాగే యాత్రా స్పెషల్ ఇది. 2026 ఫిబ్రవరి 21వ తేదీన సికింద్రాబాద్ నుంచి భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్ బయలుదేరి వెళుతుంది. మొత్తం 705 సీట్లు అందుబాటులో ఉంటాయి. ఇందులో స్లీపర్- 237, 3ఏసీ- 416, 2ఏసీ- 52.

సికింద్రాబాద్ నుంచి బయలుదేరే ఈ ఎక్స్‌ప్రెస్‌కు జనగామ, ఖాజీపేట్, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలల్లో హాల్ట్ సౌకర్యం ఉంటుంది. ఆయా స్టేషన్లల్లో ప్రయాణికులు బోర్డింగ్/డీబోర్డింగ్ అవ్వొచ్చు.
తొలుత ఈ ఎక్స్ ప్రెస్ తిరవణ్ణామలైకి చేరుకుంటుంది. అక్కడి అరుణాచలం ఆలయ దర్శనంతో ఈ యాత్ర మొదలవుతుంది. అనంతరం రామేశ్వరానికి చేరుకుంటుంది. అక్కడ వెలిసిన రామనాథస్వామివారి ఆలయాన్ని దర్శించుకోవచ్చు. ప్రత్యేక పూజలు చేయవచ్చు. అనంతరం మధురైకి వెళ్తుంది. ప్రఖ్యాత మీనాక్షి అమ్మవారిని యాత్రీకులు దర్శిస్తారు. ఆ తర్వాతి గమ్యస్థానం- కన్యాకుమారి. ఇక్కడ రాక్ మెమోరియల్, కుమారి అమ్మన్ ఆలయ దర్శనం ఉంటుంది.
అక్కడి నుంచి నేరుగా తిరువనంతపురానికి బయలుదేరి వెళ్తుంది ఈ ఎక్స్ ప్రెస్. అక్కడ అనంత పద్మనాభస్వామి దర్శించుకోవచ్చు. ఆ తర్వాత తిరుగుముఖం పడుతుంది. రిటర్న్ జర్నీలో ట్రిచిలో రంగనాథస్వామి, తంజావూరులో బృహదీశ్వరాలయం దర్శనంతో ఈ యాత్ర ముగుస్తుంది. అక్కడి నుంచి తిరిగి సికింద్రాబాద్ కు చేరుకుంటుందీ రైలు.
ఈ టూర్ ప్యాకేజీ ద్వారా దివ్య దక్షిణ జ్యోతిర్లాంగాలను దర్శించుకోదలిచిన వాళ్లు ఒక్కొక్కరు చెల్లించాల్సిన ఛార్జీ మొత్తం 14,700 రూపాయలు. ఇది ఎకానమీ అంటే స్లీపర్ క్లాస్. ఇందులో పిల్లలు అంటే 5 నుంచి 11 సంవత్సరాల్లోపు వారికి 13,800 రూపాయల ఛార్జీని నిర్ధారించారు. స్టాండర్డ్ కేటగిరీ (3ఏసీ)లో పెద్దలకు 22,300, పిల్లలకు 21,200 రూపాయలు, కంఫర్ట్ కేటగిరీ (2ఏసీ)లో పెద్దలకు 28,700, పిల్లలకు 27,400 రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది.
Credit: Oneindia
More From GoodReturns

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications