ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా సౌతాఫ్రికాతో రెండో టీ20లో ఓడిన టీమిండియా మరో పోరుకు సిద్దమైంది. ధర్మశాల వేదికగా ఆదివారం జరిగే మూడో టీ20లో ఇరు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. తొలి రెండు మ్యాచ్‌ల్లో భారత్, సౌతాఫ్రికా చెరొక మ్యాచ్ గెలిచాయి. దాంతో ఐదు టీ20ల సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి.
పేలవ బౌలింగ్, చెత్త బ్యాటింగ్‌తో రెండో టీ20లో ఓడిన టీమిండియా.. ఆ తప్పిదాలను సవరించుకొని మళ్లీ విజయాల బాట పట్టాలని భావిస్తుండగా.. అదే జోరును కొనసాగించి సిరీస్‌పై పట్టు సాధించాలనే యోచనలో ఆతిథ్య సౌతాఫ్రికా ఉంది. తొలి రెండు మ్యాచ్‌లు ఏకపక్షంగా ముగియడంతో మూడో టీ20 అయినా రసవత్తరంగా సాగుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.
శుభ్‌మన్ గిల్‌పై వేటు?
తొలి రెండు టీ20ల్లో దారుణంగా విఫలమైన టీమిండియా ఓపెనర్, వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గాయం నుంచి కోలుకొని ఈ సిరీస్‌తోనే రీఎంట్రీ ఇచ్చిన శుభ్‌మన్ గిల్ 4, 0 పరుగులతో తీవ్రంగా నిరాశపర్చాడు. గిల్ కోసం అసాధారణ ప్రదర్శన కనబర్చిన సంజూ శాంసన్‌ను టీమిండియా మేనేజ్‌మెంట్ పక్కనపెట్టింది.

కానీ గిల్ మాత్రం ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం లేదు. సంజూ తర్వాత 14 ఇన్నింగ్స్‌ల్లో ఓపెనింగ్ చేసిన గిల్ ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై చేసిన 47 పరుగులే అత్యధికం. ఈ గణంకాల నేపథ్యంలోనే గిల్‌ను తప్పించి సంజూ శాంసన్‌ను ఓపెనర్‌గా కొనసాగించాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. కానీ గిల్‌కు టీమిండియా మేనేజ్‌మెంట్ మరో అవకాశం ఇవ్వచ్చు. ఒకవేళ గిల్‌ను తప్పిస్తే మాత్రం సంజూ ఓపెనర్‌గా బరిలోకి దిగుతాడు.
సూర్యకు అగ్ని పరీక్ష
మరో ఓపెనర్ అభిషేక్ శర్మ రెండు టీ20ల్లో నిరాశపర్చాడు. భారీ షాట్లతో విరుచుకుపడినా పెద్ద స్కోర్లు నమోదు చేయలేకపోయాడు. మూడో టీ20లో అతను చెలరేగాల్సి ఉంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి మరి దారుణంగా తయారైంది. గతేడాదిగా అతను తీవ్రంగా తడబడుతున్నాడు. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా అతను బ్యాట్ ఝులిపించాల్సి ఉంది. నాలుగో స్థానంలో తిలక్ వర్మ పర్వాలేదనిపించాడు. గత మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. అక్షర్ పటేల్ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేదు.
తొలి టీ20లో సత్తా చాటిన హార్దిక్ పాండ్యా.. రెండో మ్యాచ్‌లో నిరాశపర్చాడు. శివమ్ దూబే కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. జితేష్ శర్మ తన వంతు సహకారం అందిస్తున్నాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా వరుణ్ చక్రవర్తీ సత్తా చాటుతున్నాడు. జస్‌ప్రీత్ బుమ్రా పర్వాలేదనిపిస్తున్నా.. అర్ష్‌దీప్ సింగ్ నిలకడలేమి ప్రదర్శనతో జట్టు పరాజయానికి కారణమయ్యాడు. అతను మెరుగ్గా రాణించాల్సి ఉంది.
భారత్ తుది జట్టు(అంచనా)
శుభ్‌మన్ గిల్/సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేష్ శర్మ, అక్షర్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తీ, అర్ష్‌దీప్ సింగ్
భారత టీ20 టీమ్
శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేష్ శర్మ,సంజూ శాంసన్, అక్షర్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తీ, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్.
Credit: Mykhel
More From GoodReturns

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications