టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే తనకు చాలా ఇష్టమని టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ తెలిపాడు. ఖాళీ సమయంలో మహేష్ బాబు సినిమాలు చూస్తానని, ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడే సమయంలో తెలుగు సినిమాల గురించి సహచర ఆటగాళ్లతో బాగా చర్చిస్తానని చెప్పుకొచ్చాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా తనకు పిచ్చెక్కించిందని తెలిపాడు.
ఈ సినిమాలోని అల్లు అర్జున్ మేనరిజమ్ తనను బాగా ఆకట్టుకుందని చెప్పాడు. ప్రస్తుతం న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో అభిషేక్ శర్మ దుమ్మురేపుతున్నాడు. తొలి టీ20లో విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగిన అభిషేక్.. రెండో టీ20లో మాత్రం గోల్డెన్ డకౌట్ అయ్యాడు. మూడో టీ20లో మరోసారి తన విశ్వరూపం చూపించాడు. 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది 10 ఓవర్లలోనే మ్యాచ్ ముగించాడు. నాలుగో టీ20లో మరోసారి అభిషేక్ శర్మ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. దాంతో ఈ మ్యాచ్‌లో భారత్ 50 పరుగుల తేడాతో చిత్తయ్యింది.
ఆ రికార్డ్ బ్రేక్ చేయడం అసాధ్యం: అభిషేక్ శర్మ
ప్రత్యర్థి బౌలర్లకు సింహ స్వప్నంగా మారిన అభిషేక్ శర్మ.. టీమిండియాకు కీలక ప్లేయర్‌గా ఎదిగాడు. ఎంతలా అంటే అభిషేక్‌ను ఔట్ చేస్తే మ్యాచ్ గెలిచినట్లేనని ప్రత్యర్థి కెప్టెన్లు ఫీలయ్యేంత. గతంలో విరాట్ కోహ్లీ ఈ స్టార్‌డమ్‌ను సొంతం చేసుకోగా.. అతని స్థానాన్ని అభిషేక్ శర్మ ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నాడు.

మహేష్ బాబు అంటే ఇష్టం..
గత కొన్నేళ్లుగా ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అభిషేక్ శర్మ.. తెలుగు అభిమానులకు సుపరిచితమే. సినిమా, క్రికెట్ అంటే పడిచచ్చే తెలుగు ఫ్యాన్స్.. అభిషేక్ శర్మ ఫేవరేట్ తెలుగు హీరో గురించి తెలుసుకునేందుకు తెగ ఆరాటపడుతున్నారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ నిర్వహించిన ఒక ఫన్ ఇంటర్వ్యూలో అభిషేక్ శర్మ.. తన ఫేవరేట్ తెలుగు హీరో మహేష్ బాబు అని తెలియజేశాడు. హైదరాబాద్‌లో ఉన్నప్పుడు మహేష్ బాబు సినిమాల గురించి, ఆయనకు ఉన్న క్రేజ్ గురించి తన సహచర తెలుగు ఆటగాళ్లను అడిగి తెలుసుకుంటుంటానని చెప్పాడు.
కశ్మీరీ బ్యూటీతో అభిషేక్ శర్మ పెళ్లి?
అల్లు అర్జున్ మేనరిజమ్..
తాను తెలుగు సినిమా చూస్తానని, అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా బాగా నచ్చిందని చెప్పాడు. ఈ సినిమాలోని అల్లు అర్జున్ మేనరిజమ్స్‌ను మైదానంలో కూడా అనుకరించాడు. అల్లు అర్జున్ స్క్రీన్ ప్రెజెన్స్, డ్యాన్స్ ఇష్టమని ఓ ఇంటరాక్షన్‌లో తెలిపాడు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురిపించాడు. ముఖ్యంగా నాటు నాటు పాట బాగుందని, ఎన్టీఆర్, రామ్‌చరణ్ అద్భుతమైని కొనియాడాడు.
తెలుగు ప్లేయర్లు నితీష్ రెడ్డి, తిలక్ వర్మల సాయంతో తెలుగు డైలాగ్స్ నేర్చుకుంటానని చెప్పాడు. హైదరాబాద్ బిర్యానీ అంటే తనకు చాలా ఇష్టమని, రామోజీ ఫిల్మ్ సిటీలో సినిమా షూటింగ్ చూడాలని ఉందని తెలిపాడు.
Credit: Mykhel
More From GoodReturns

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..



Click it and Unblock the Notifications