పేకమేడలా కుప్పకూలిన బంగారం ధరలు- మహా పతనం
నిన్నటి వరకూ ఆకాశానికి ఎగబాకుతూ కనిపించిన బంగారం ధరలు నేడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. పేకమేడలా నేలకు రాలాయి. బంగారం ధరల్లో మహా పతనం కనిపించింది. తీవ్ర అస్థిరతను చవిచూశాయి. అమెరికా ఈక్విటీలలో చోటుచేసుకున్న భారీ హెచ్చుతగ్గుల కారణంగా మార్కెట్ గోల్డ్ క్యాపిటలైజేషన్‌లో దాదాపు తొమ్మిది ట్రిలియన్ల డాలర్ల మేర భారీ కదలిక నమోదైంది. ఈ పరిణామం అనిశ్చితికి దారి తీసింది.
అంతర్జాతీయంగా నెలకొన్న ఈ తీవ్ర అస్థిరత భారత బులియన్ మార్కెట్‌పైనా తీవ్ర ప్రభావం చూపింది. డాలర్ బలోపేతం కావడం వల్ల దేశీయంగా బంగారం ధరలు రికార్డు స్థాయిల నుండి దాదాపు 3.5 శాతం మేర తగ్గాయి. ముంబైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 1,78,860, 22 క్యారెట్ల బంగారం రూ. 1,63,960కి లభించింది. వెండి ధరలు సైతం రికార్డు స్థాయి నుండి పడిపోయాయి. సుమారు అయిదు శాతం వరకు తగ్గాయి.

గురువారం నాటితో పోల్చుకుంటే నేడు 10 గ్రాములపై 8,230 రూపాయలు తగ్గింది. 24 క్యారెట్ల బంగారం ధర 1,70,620 రూపాయలు పలుకుతోంది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 7,550 తగ్గింది. ప్రస్తుతం 1,56,400 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. దేశంలో వేర్వేరు మార్కెట్ లల్లో వేర్వేరుగా బంగారం ధరలు నమోదయ్యాయి. నిన్నటి వరకు కొండెక్కిన వెండి ధరలు ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి. పసిడి, వెండి రేట్లు మున్ముందు మరింత తగ్గొచ్చనే అంచనాలు ఉన్నాయి.
ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 17,673, 22 క్యారెట్లు - రూ. 16,200, 18 క్యారెట్లు - రూ. 13,500
ముంబై..
24 క్యారెట్లు - రూ. 17,062, 22 క్యారెట్లు- రూ. 15,640, 18 క్యారెట్లు - రూ. 12,797
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 17,062, 22 క్యారెట్లు- రూ. 15,640, 18 క్యారెట్లు- రూ. 12,797
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 17,062, 22 క్యారెట్లు- రూ. 15,640, 18 క్యారెట్లు- రూ. 12,797
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 17,062, 22 క్యారెట్లు- రూ. 15,640, 18 క్యారెట్లు- రూ. 12,797
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 17,062, 22 క్యారెట్లు- రూ. 15,640, 18 క్యారెట్లు- రూ. 12,797
Credit: Oneindia


Click it and Unblock the Notifications