పసిడి ధరలు మసకబారుతున్నాయ్.. !!
జనవరి నెలకు సంబంధించి అమెరికాలో అంచనాలను మించి బలమైన నాన్‌ఫార్మ్ పేరోల్స్ డేటా విడుదలైన తర్వాత బంగారం ధరలు తగ్గాయి. ఈ గణాంకాలు బుధవారం వెలువడ్డాయి. దీంతో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మరింత తగ్గించవచ్చనే అంచనాలు మసకబారినట్టయింది. ఇది బంగారం ధరలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. మున్ముందు వీటి రేట్లు మరింత తగ్గుముఖం పట్టొచ్చనే అంచనాలు ఉన్నాయి.
మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్, కోమెక్స్.. రెండింట్లోనూ బంగారం ధరలు తగ్గాయి. ఈ ఉదయం మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,57,980 వద్ద ప్రారంభమైంది. బుధవారం నాటి ముగింపుతో పోలిస్తే 0.49 శాతం తక్కువ. అదే సమయంలో కోమెక్స్ (Comex)లో ఔన్సు బంగారం ధర 5,028 వద్ద ట్రేడ్ అయింది. ఇందులో కూడా క్షీణత కనిపించింది. సుమారు 0.31 శాతం మేర తగ్గింది.

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 15,928, 22 క్యారెట్లు - రూ. 14,600, 18 క్యారెట్లు - రూ. 12,600
ముంబై..
24 క్యారెట్లు - రూ. 15,840, 22 క్యారెట్లు- రూ. 14,520, 18 క్యారెట్లు - రూ. 11,880
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 15,840, 22 క్యారెట్లు- రూ. 14,520, 18 క్యారెట్లు - రూ. 11,880
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 15,840, 22 క్యారెట్లు- రూ. 14,520, 18 క్యారెట్లు - రూ. 11,880
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 15,840, 22 క్యారెట్లు- రూ. 14,520, 18 క్యారెట్లు - రూ. 11,880
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 15,840, 22 క్యారెట్లు- రూ. 14,520, 18 క్యారెట్లు - రూ. 11,880
Credit: Oneindia

Click it and Unblock the Notifications